నిధి పరాజయం | nidhi defeated in ITF tounry | Sakshi
Sakshi News home page

నిధి పరాజయం

Published Thu, Dec 15 2016 10:42 AM | Last Updated on Mon, Sep 4 2017 10:48 PM

nidhi defeated in ITF tounry

సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) మహిళల టోర్నమెంట్‌లో హైదరాబాద్ క్రీడాకారిణి నిధి చిలుముల పోరాటం ముగిసింది. పుణేలో బుధవారం జరిగిన సింగిల్స్ రెండో రౌండ్‌లో నిధి 2-6, 2-6తో టాప్ సీడ్ క్యానీ పెరిన్ (స్విట్జర్లాండ్) చేతిలో ఓడిపోరుుంది.

 

73 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో నిధి తన ప్రత్యర్థి సర్వీస్‌ను రెండుసార్లు బ్రేక్ చేసి... తన సర్వీస్‌ను ఆరుసార్లు కోల్పోయింది. ఇతర మ్యాచ్‌ల్లో  కర్మన్‌కౌర్ థండి 6-2, 1-6, 6-2తో గసనోవా (రష్యా)పై గెలుపొందగా... నటాషా పల్హా 2-6, 4-6తో పొలీనా మొనోవా (రష్యా) చేతిలో ఓడిపోయింది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement