ఫైనల్లో విష్ణువర్ధన్‌ జోడీ | vishnu vardhan enters final of itf tourny | Sakshi
Sakshi News home page

ఫైనల్లో విష్ణువర్ధన్‌ జోడీ

Published Fri, Mar 17 2017 12:11 PM | Last Updated on Tue, Sep 5 2017 6:21 AM

ఫైనల్లో విష్ణువర్ధన్‌ జోడీ

ఫైనల్లో విష్ణువర్ధన్‌ జోడీ

బెంగళూరు: అంతర్జాతీయ టెన్నిస్‌ సమాఖ్య (ఐటీఎఫ్‌) ఫ్యూచర్స్‌ టెన్నిస్‌ టోర్నమెంట్‌లో హైదరాబాద్‌ ప్లేయర్‌ విష్ణువర్ధన్‌ డబుల్స్‌ టైటిల్‌కు మరో విజయం దూరంలో నిలిచాడు. కర్ణాటక స్టేట్‌ లాన్‌ టెన్నిస్‌ అసోసియేషన్‌ వేదికగా జరుగుతోన్న ఈ టోర్నీలో విష్ణువర్ధన్‌–శ్రీరామ్‌ బాలాజీ (భారత్‌) ద్వయం ఫైనల్‌కు చేరుకుంది.

 

గురువారం జరిగిన సెమీస్‌లో టాప్‌ సీడ్‌ విష్ణువర్ధన్‌–శ్రీరామ్‌ బాలాజీ జంట 7–6 (7/3), 6–0తో అలెగ్జాండర్‌ సెంటినరీ (అమెరికా)–సామి రెన్‌వెన్‌ (జర్మనీ) జోడీపై గెలిచింది. ఫైనల్లో భారత్‌కే చెందిన ‘సూద్‌ బ్రదర్స్‌’ చంద్రిల్‌–లక్షిత్‌ జంటతో విష్ణువర్ధన్‌ జోడీ తలపడుతుంది. మరోవైపు సింగిల్స్‌ విభాగంలో విష్ణువర్ధన్‌ పోరాటం క్వార్టర్స్‌లోనే ముగిసింది. క్వార్టర్స్‌లో విష్ణు 7–6 (9/7), 5–7, 3–6తో సామి రెన్‌వెన్‌ (జర్మనీ) చేతిలో ఓటమి పాలయ్యాడు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement