ITF Womens Futures Tennis tournament
-
ప్రిక్వార్టర్స్‌లో ప్రత్యూష
నాగ్‌పూర్: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) మహిళల టోర్నీలో ఆంధ్రప్రదేశ్ అమ్మాయి ప్రత్యూష రాచపూడి శుభారంభం చేసింది. మంగళవారం జరిగిన సింగిల్స్ తొలి రౌండ్లో ప్రత్యూష 6–2, 5–7, 6–3తో అవిష్క గుప్తా (భారత్)పై నెగ్గి ప్రిక్వార్టర్ ఫైనల్‌కు చేరింది. హెదరాబాద్ అమ్మాయిలు హుమేరా, స్మృతి భాసిన్ కూడా ప్రిక్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టారు. తొలి రౌండ్లో హుమేరా 6–3, 6–4తో కశిష్ (భారత్)ను ఓడించగా, స్మృతి 6–3, 6–1తో ఎనిమిదో సీడ్ మిహికా యాదవ్ (భారత్)పై సంచలన విజయం సాధించింది. మరో మ్యాచ్‌లో శ్రావ్య శివాని 1–6, 0–6తో సహజ యమలపల్లి చేతిలో ఓడింది. డబుల్స్ తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో రష్మిక–సాత్విక 7–6 (7/4), 6–2తో శ్రావ్య శివాని–షర్మదాలపై... నిధి చిలుముల–సౌమ్య 6–3, 6–1తో సుదీప్త–రియాలపై నెగ్గి క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు. -
సెమీఫైనల్లో నిధి
ఐటీఎఫ్ ఫ్యూచర్స్ టోర్నీ చెన్నై: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) మహిళల ఫ్యూచర్స్ టెన్నిస్ టోర్నీలో సింగిల్స్ విభాగంలో ఆంధ్రప్రదేశ్ అమ్మాయి నిధి చిలుముల సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. ఇక్కడి మేయర్ రాధాకృష్ణన్ స్టేడియంలో జరుగుతున్న ఈ పోటీల్లో గురువారం జరిగిన క్వార్టర్ఫైనల్లో ఏడో సీడ్ నిధి 6-3, 6-0తో జియావో వాంగ్ (చైనా)పై విజయం సాధించింది. మరోవైపు రిషిక సుంకర 7-6 (7/3), 1-6, 0-6 స్కోరుతో మన దేశానికే చెందిన ఇతీ మెహతా చేతిలో పరాజయం పాలైంది. ఇతర మ్యాచ్‌ల్లో నటాషా (భారత్) 6-0, 6-2తో హిరోనో వాంతనబేపై, ప్రార్థన (భారత్) 6-4, 6-2తో వాంగ్టీన్చాయ్ (చైనీస్ తైపీ)పై గెలిచి సెమీస్‌కు చేరుకున్నారు. డబుల్స్ విభాగం సెమీఫైనల్లో నిధి జోడికి చుక్కెదురైంది. నిధి-వాంగ్ (చైనా) జోడీ 2-6, 3-6తో నటాషా-ప్రార్థన జోడి చేతిలో ఓటమి పాలైంది. అయితే రిషిక సుంకర-షర్మద ద్వయం 6-3, 6-1 (10/5)తో వాంతనబే-వాంగ్టీన్చాయ్ ద్వయంను ఓడించి తుది పోరుకు సిద్ధమైంది. నేటి సింగిల్స్ సెమీఫైనల్ మ్యాచ్‌లో ప్రార్థనతో నిధి తలపడనుంది.