బస్సులో పొగలు, భయంతో ప్రయాణికుల పరుగు
మానవపాడు: పాలెం దుర్ఘటన మరవకముందే మరో వోల్వో బస్సు ప్రమాదం ప్రయాణికులను భయపెట్టింది. వోల్వో బస్సులో పొగలు రావడంతో ప్రయాణికులు భయంతో వణికిపోయారు. అయితే ఈ ఘటనలో ప్రయాణికులు సురక్షితంగా బయటపడడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఎస్వీఆర్ వోల్వో బస్సులో పొగలు రావడంతో మహబూబ్‌నగర్ జిల్లా మానవపాడు మండలం ఇటిక్యాలపాడులో నిలివేశారు.
హైదరాబాద్ నుంచి తిరుపతి వెళుతుండగా రాత్రి 2 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. బస్సును నిలిపివేసి డ్రైవర్, క్లీనర్ పరారయ్యారు. బస్సులో ఉన్న 30 మంది ప్రయాణికులు బస్సు దిగి భయంతో దూరంగా పరుగులు తీశారు. తెల్లారినా వారిని వారిని గమ్యస్థానాలకు చేర్చే వారు రాకపోవడంతో ప్రయాణికులు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు.
మహబూబ్‌నగర్ జిల్లా పాలెం వద్ద గత అక్టోబర్ 30న బెంగళూరు నుంచి హైదరాబాద్ వస్తున్న జబ్బార్ ట్రావెల్స్‌కు చెందిన వోల్వో బస్సు అగ్నిమాదానికి గురై 45 మంది సజీవదహనమైన సంగతి తెలిసిందే.