its my city
-
మొబైల్లో కొత్త షో!
కథానాయికగా వెండితెరపై దూసుకెళుతున్న ప్రియాంకా చోప్రా అమెరికన్ టీవీ సిరీస్ ‘క్వాంటికో’ ద్వారా బుల్లితెరపై కూడా తన సత్తా చాటుకున్నారు. ఇప్పుడీ బ్యూటీ మొబి-సిరీస్‌లో కూడా హల్చల్ చేయనున్నారు. అంటే.. మొబైల్ ఫోన్లో వచ్చే సిరీస్ అన్నమాట. ముంబైలో ఓ ఫ్లాట్లోనివసించే నలుగురు అమ్మాయిలు ఎదుర్కొనే సమస్యల నేపథ్యంలో ఈ సిరీస్ సాగుతుంది. ఆ నలుగురి అమ్మాయిలకు గార్డియన్‌గా ప్రియాంక స్పెషల్ రోల్ చేస్తున్నారు. అది మాత్రమే కాదు... ఈ సిరీస్‌ను ఆమే స్వయంగా నిర్మించడం విశేషం. ‘ఇట్స్ మై సిటీ’ పేరుతో రూపొంద నున్న ఈ సిరీస్ మొత్తం 14 ఎపిసోడ్స్‌గా సాగుతుంది. వారానికి రెండుసార్లు ప్రసారమవుతుంది. ‘‘ఈ సిరీస్ స్టోరీ నా నిజజీవితానికి దగ్గరగా ఉంటుంది. ఏదో సాధించాలనే తపనతో, ఎన్నో కలలతో ఒకప్పుడు నేను ముంబైలో అడుగుపెట్టిన రోజులు గుర్తుకొస్తు న్నాయి. నేను మాత్రమే కాదు... చాలామంది ఈ కథతో రిలేట్ అవుతారు. నేటి తరం వారికి స్ఫూర్తినివ్వాలనే ఆకాంక్షతోనే ఈ మొబి-సిరీస్ ప్లాన్ చేశాను. ఇవాళ మొబైల్ ఫోన్ లేని కుర్రకారు ఉండరు కదా. అందరూ మొబైల్లో చూడచ్చు’’ అని ప్రియాంకా చోప్రా పేర్కొన్నారు. -
ప్రియాంక చోప్రా డిజిటల్ ప్రయోగం
హాలీవుడ్ టీవీ సీరీస్ 'క్వాంటికో'తో అంతర్జాతీయ స్ధాయిలో గుర్తింపు తెచ్చుకున్న బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా. ఈ సిరీస్‌తో హాలీవుడ్ ఎంట్రీ ఇవ్వటంతో పాటు ఎన్నో అవార్డులు రివార్డులను సొంతం చేసుకుంది. ఇదే జోష్‌లో సొంత గడ్డ మీద కూడా సత్తా చాటడానికి రెడీ అవుతోంది. 'క్వాంటికో' స్పూర్తితో ఇండియాలో కూడా ఓ సీరియల్‌ను నిర్మించాలని భావిస్తోంది ప్రియాంక చోప్రా. ఇటీవల పర్పల్ పెబల్ పిక్చర్స్ పేరుతో సొంత నిర్మాణ సంస్థను ప్రారంభించిన ప్రియాంక చోప్రా, ఆ బ్యానర్లో మూడు ప్రాంతీయ చిత్రాలు ప్రారంభించింది. బోజ్పురిలో భమ్ భమ్ బోల్ రహామై, మరాఠిలో వెంటిలేటర్, పంజాబీలో ఓంకార్ సినిమాలను ఈ ఏడాదిలోనే రిలీజ్ చేయడానికి ప్లాన్ చేసుకుంటోంది. ఈ సినిమాలతో పాటు 'ఇట్స్ మై సిటీ' పేరుతో ఓ సీరియల్‌ను కూడా ప్రారంభిస్తోంది. అయితే ఈ సీరియల్‌ను ఏ టీవీ ఛానల్లో ప్రసారం చేయకుండా నేరుగా ప్రేక్షకులు డిజిటల్ టెక్నాలజీ సాయంతో మొబైల్ ఫోన్లో చూసుకునే వీలు కల్పించడానికి ప్రయత్నిస్తోంది. నెక్స్ జీటీవీ(nexGTV) మొబైల్ యాప్ ద్వారా సీరియల్‌ను నేరుగా మొబైల్ ఫోన్లో చూసే విధంగా ఏర్పాట్లు చేస్తోంది. ముంబైలో ఒకే ఫ్లాట్ లో నివసించే నలుగురు అమ్మాయిల కథతో రూపొందుతున్న ఈ సీరియల్లో, ప్రియాంక చోప్రా ఓ కీలక పాత్రలో నటించనుంది.