ఏపీ సర్కారు తీరును ఖండించిన ఏపీయూడబ్ల్యూజే
హైదరాబాద్: జర్నలిస్టులపై ఆంధ్రప్రదేశ్ సర్కార్ ప్రతీకార చర్యను ఏపీయూడబ్ల్యూజే ఖండించింది. వార్తల ద్వారా లోపాలను ఎత్తి చూపితే ప్రభుత్వం సరిదిద్దుకోవాల్సింది పోయి, పత్రికా స్వేచ్ఛను హరించే చర్యలకు దిగడం సరైంది కాదని ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఐవీ సుబ్బారావు అన్నారు. రాష్ట్రంలో ఎమర్జెన్సీ కాలంనాటి పరిస్థితులు ఉన్నాయని తెలిపారు.