Jaaved Jaaferi
-
ఊర్వశి రౌతేలా నీ ఫాలోయర్లు వేస్ట్...!
ఒక సినిమాకు కలెక్షన్లు రావాలంటే ఏం చేయాలి? అనగానే సినీ పరిశ్రమకు చెందిన వ్యక్తుల నుంచి ఠక్కున వచ్చే సమాధానం... భీభత్సంగా ప్రమోషన్ చేయాలి. సోషల్ మీడియాలో, టీవీ షోస్‌లో, ఓటీటీ ప్లాట్‌ఫార్మ్స్‌లో, క్లబ్బులూ కాలేజీలనే తేడా లేకుండా ఎక్కడ పడితే అక్కడ ఎంత వీలైతే అంతగా ప్రమోట్ చేయాలి...మరి అంత భారీగా ప్రమోషన్ చేసిన సినిమాలు ఎందుకు బాక్సాఫీస్ వద్ద ఢమాల్ అంటున్నాయ్? ఏ ప్రమోషన్ లేకుండా వచ్చిన సినిమాలు ఎందుకు కోట్లు కొల్లగొడుతున్నాయ్? అని అడిగితే మాత్రం సమాధానం దొరకదు. ఇటీవలే దీనిపై సీనియర్ బాలీవుడ్ నటుడు ఒకరు చేసిన విశ్లేషణ ఆసక్తికరంగా ఉంది.(చదవండి: తేళ్లు, బొద్దింకలు తిన్నాను.. తెలుగు హీరోయిన్)ఈ మధ్య ఓ ఇంటర్వ్యూలో బాలీవుడ్ సీనియర్ హీరో, నటుడు జావేద్ జాఫ్రి(Jaaved Jaaferi ) మాట్లాడుతూ ఈ తరహా ప్రమోషన్లను ఏ మాత్రం పనికిరావంటూ తీసిపారేయడం విశేషం. రకరకాల మాధ్యమాల్లో మార్గాల్లో చేసే ప్రమోషన్లు వృధా ప్రయాసేనని ఆయన తేల్చేశాడు. స్టార్లను వెర్రిగా అభిమానిస్తారని అందరూ భావించే ఇన్‌స్టా ఫాలోయర్ల సంఖ్య సైతం కలెక్షన్లకు ఉపకరించదని స్పష్టం చేశాడు. ఈ సందర్భంగా దబిడి దిబిడి నటి ఊర్వశి రౌతేలా(Urvashi Rautela )ను ఉదాహరణగా పేర్కొంటూ ఆమెకి ఇన్‌స్టాగ్రామ్‌లో 72 మిలియన్ల మంది ఫాలోయర్లు కలిగి ఉన్నారని, ఆమె ఫాలోయర్లలో కోటి మంది అంటే 10 మిలియన్ల మందిని తీసుకున్నా, ఆ 1 కోటి మంది రూ. 250 సినిమా టికెట్ కొంటే ఆమె ప్రతీ సినిమా రూ. 100 కోట్లు వసూలు చేసేది కదా?అని ఆయన ప్రశ్నించాడు. ఇటీవల ఊర్వశి నందమూరి బాలకృష్ణతో తెలుగు చిత్రం డాకు మహారాజ్లో నటించింది అంతేకాక సినిమా ప్రమోషన్లో ఆమె చురుగ్గా పాల్గొంది కూడా. అయితే కేవలం ప్రమోషన్లు మాత్రమే సినిమా విజయాన్ని ఖరారు చేయవని జావేద్ నొక్కిచెప్పారు. ‘‘మేం కూడా సినిమాని ప్రమోట్ చేయడానికి కాలేజీలకు ఇంకా చాలా చోట్లకు వెళతాం. కానీ అది ఫలితాలను ఇవ్వదని చాలా సార్లు రుజువైంది’’ అని చెప్పిన ఆయన ఈ సందర్భంగా తన సినిమాలను ప్రమోషన్ చేయడంలో ఉత్సాహం చూపని రజనీకాంత్‌ను ఉదాహరణగా చూపించాడు. ‘‘రజనీకాంత్ సాబ్.. అతిపెద్ద స్టార్. ఆయన తన సినిమాను ఎక్కడ ప్రమోట్ చేస్తాడు? మరి ఆయన సినిమాలు కలెక్షన్లు ఎందుకు సాధిస్తున్నాయి?’’ అంటూ ప్రశ్నించాడు. మంచి సినిమా అయితే కొన్ని రోజుల పాటు రన్ అవుతుంది.ప్రమోషన్లు ఎంత చేసినా కానీ కొన్నిసార్లు కొంతమంది స్టార్లకు సరైన ఓపెనింగ్ కూడా లభించదు, ’’అని ఆయన చెప్పాడు.సరే ప్రమోషన్లు వృధా ప్రయాసే అనుకుందాం. మరి కలెక్షన్లు రావాలంటే.. సరైన మార్గం ఏమిటి? అంటే ఆయన సమాధానం ట్రైలర్. అవును... సినిమా అమ్ముడుపోయేలా చేసేది ట్రైలర్ మాత్రమే. నాకు ట్రైలర్ నచ్చితే నేను సినిమా చూస్తాను, అంతే తప్ప హీరో/హీరోయిన్లు ఏదైనా టీవీ షోకి లేదా డ్యాన్స్ షోకి వచ్చి హడావిడి చేసినంత మాత్రాన నేను పట్టించుకోను. సో..ట్రైలర్ మాత్రమే సినిమాకి కలెక్షన్లను రప్పిస్తుంది ’’అని అంటూ జావేద్ జాఫ్రి చెప్పాడు. -
ఆ నటుడితో బిగ్‌బీ మనవరాలు ప్రేమాయణం.. స్పందించిన తండ్రి
బాలీవడ్ సూపర్ స్టార్ బిగ్‌బీ అమితాబ్ బచ్చన్ మనవరాలు నవ్య నవేలీ నందా ఈ మధ్య కాలంలో తరచు వార్తల్లో నిలుస్తున్నారు. బాలీవుడ్ యువ నటుడు, తన స్నేహితుడు మీజాన్ జాఫేరీతో నవ్య ప్రేమలో ఉన్నట్లు బి-టౌన్లో కొంతకాలంగా పుకార్లు షికార్లు చేస్తున్న సంగతి తెలిసిందే. దీంతో రిలేషన్‌పై వస్తున్న పుకార్లపై మీజాన్ తండ్రి, నటుడు జావేద్ జాఫేరీ స్పందించాడు. ఇటీవల ఓ ఇంగ్లీష్ ఛానల్‌కు ఇచ్చి ఇంటర్య్వూలో ఆయనకు నవ్య, మీజాన్ల ప్రేమ వ్యవహరంపై ప్రశ్న ఎదురైంది. ఇక దీనికి ఆయన సమాధానం ఇస్తూ.. నవ్య, మీజాన్‌లు కేవలం స్నేహితులు మాత్రమేనని స్పష్టం చేశాడు. ‘నా కూతురు, నవ్య మంచి స్నేహితురాలు. స్కూలింగ్ నుంచి వారిద్దరూ కలిసే పెరిగారు. ఈ క్రమంలో మీజాన్, నవ్యలు కూడా మంచి స్నేహితులయ్యారు. వారిద్దరికి కొంతమంది కామన్ ఫెండ్స్ కూడా ఉన్నారు. ఈ క్రమంలో వారంత అప్పుడప్పుడు కలిసి పార్టీలు, షికార్లకు వెళ్లడం చేస్తుంటారు. అది చూసి కొంతమంది వాళ్ల మధ్య రిలేషన్ ఉన్నట్లు పుకార్లు సృష్టిస్తున్నారు. ఎందుకంటే ప్రజలకు వినోదం కావాలి. అందుకే మంచి ఫ్రెండ్స్ మధ్య కూడా ఎదో ఉందని పుకార్లు సృష్టించి వారి గురించి చర్చించుకుంటూ వినోదాన్ని పొందుతారు. ఇక చెప్పాలంటే సారా అలీఖాన్, నా కొడుకు(మీజాన్) కూడా ఒకే స్కూల్లో చదువుకున్నారు. వారిద్దరూ కూడా మంచి స్నేహితులే. కలిసి పార్టీలు, విందులకు వెళుతుంటారు. తెల్లవారు జామును 3 గంటల వరకు వారు పార్టీలంటూ బయట తిరుగుతుంటారు. అంటే ఇక అని వారిమధ్య కూడా ఎదో రిలేషన్ ఉన్నట్టా’ అంటూ ఆయన చెప్పుకొచ్చారు. అయితే గత నెల నవ్య ఓ రెస్టారెంట్లో కుర్చొని ఉన్న ఫొటోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. దీంతో తన పోస్టుపై మీజాన్ ‘వావ్ ఈ ఫొటో ఎవరూ తీశారు. చాలా బాగుంది. ఐ వండర్’ అంటూ కామెంటు పెట్టాడు.. దీనికి నవ్య మీజాన్జీ అనే నా పర్సనల్ ఫొటోగ్రాఫర్ అంటూ సమాధానం ఇచ్చింది. ఇక అది చూసి అందరూ వీరిమద్య ఎదో ఉందంటూ గుసగుసలాడుకోవడం మొదలు పెట్టారు. కాగా మీజాన్ సంజయ్ లీలా బన్సాలీ ప్రోడక్షన్ నిర్మించిన మలాల్ మూవీతో బాలీవుడ్ ఆరంగేట్రం చేశాడు. ఆ తర్వాత హంగామా-2లో కూడా నటించాడు. ఇటీవల షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీలో నటి శిల్పా శెట్టి, పరెష్ రావల్. పునిత్ సుభాష్‌లు కీలక పాత్రలు పోషించారు. ఇక న్యూయార్క్‌లోని ఫోర్థామ్ యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన నవ్య గతేడాది ‘ఆరా హెల్త్’ పేరిట ఆన్లైన్ హెల్త్‌కేర్ పోర్టల్‌ను పప్రారంభించింది. అంతేగాక అప్పుడప్పుడు వివిధ ఆరోగ్య సమస్యలకు గల కారణాలపై పలు ఆన్లైన్ ప్లాట్‌ఫ్లాంలో చర్చిస్తుంటుంది. (చదవండి: బిగ్‌బీ కూతురిని చులకనగా చూసిన నెటిజన్!) (మానసిక సమస్యలలో అమితాబ్ మనవరాలు) (వ్యాపార సంస్థను ప్రారంభించిన బిగ్‌బీ మనవరాలు) -
కేరళ వరదలు : సల్మాన్ భారీ విరాళం..?
కేరళ వరద బాధితులను ఆదుకోవడం కోసం ఎందరో ముందుకు వస్తున్నారు. వీరిలో సిని పరిశ్రమకు చెందిన వారు కూడా ఉన్నారు. ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు కేరళ వాసులకోసం విరాళాలు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే వీరందరిలోకి అతి ‘భారీ విరాళా’న్ని ప్రకటించిన హీరో బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్. సల్లు భాయ్ కేరళ బాధితుల కోసం ఏకంగా 12 కోట్ల రూపాయల విరాళాన్ని ప్రకటించినట్లు నటుడు జావేద్ జాఫెరీ తన ట్విటర్లో తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న సల్మాన్ అభిమానులు ఆయన మంచి మనసును అభినందిద్దామనుకునేలోపే జావేద్ ఆ ట్వీట్‌ని డిలీట్ చేశారు. దాంతో అభిమానుల్లో గందరగోళం మొదలయ్యింది. అనంతరం జావేద్ మరో ట్వీట్ చేశారు. ‘కేరళ వరద బాధితుల కోసం సల్మాన్ ఖాన్ 12 కోట్ల రూపాయలను విరాళంగా ప్రకటించారనే వార్తను నేను కేవలం విన్నాను అంతే. సల్మాన్ లాంటి సూపర్ స్టార్‌కి అది ఏమంత పెద్ద విషయం కాదు. అలానే బాధితులను ఆదుకోవడంలో సల్మాన్ ఖాన్ ఎప్పుడు ముందే ఉంటారు కాబట్టి వెంటనే ఈ విషయం గురించి ట్వీట్ చేశాను. అయితే ఈ విషయం గురించి ఎటువంటి అధికారిక సమాచారం నాకు తెలియదు’ అంటూ జావేద్ ట్వీట్ చేశారు. I had tweeted that I had ‘heard’ about @BeingSalmanKhan ‘s bcontribution. Because it was a very strong possibility given his track record, I put forward my thoughts and admiration. Taking the tweet off till I can confirm it — Jaaved Jaaferi (@jaavedjaaferi) August 26, 2018 ఇదిలా ఉండగా కేరళ వరద బాధితులను ఆదుకోవడానికి బాలీవుడ్ యాక్టర్ సుశాంత్ సింగ్ రాజ్‌పూత్ 1 కోటి రూపాయలను విరాళంగా ప్రకటించగా, ‘గోల్డ్’ నటుడు కునాల్ కపూర్ రూ. 1.2 కోట్లను విరాళంగా ప్రకటించారు. మరో నటుడు రణ్‌దీప్ హుడా వాలంటీర్లతో కలిసి కేరళలోని ఖల్సా ప్రాంతంలో సహాయక చర్యల్లో పాల్గొనడమే కాక బాధితులకు స్వయంగా ఆహారం వండి పెట్టారు. -
రాజ్‌నాథ్ సింగ్‌పై ఆప్ అభ్యర్థిగా జావేద్ జాఫ్రీ
బూగీ వూగీ లాంటి కార్యక్రమాలు, చిన్న పిల్లల సినిమాలతోను, డాన్స్ షోలతోను దేశవ్యాప్తంగా ప్రచారం పొందిన బాలీవుడ్ నటుడు జావేద్ జాఫ్రీ రాజకీయ రంగ ప్రవేశం చేస్తున్నారు. రావడం రావడమే ఆయన ఏకంగా కొండను ఢీకొంటున్నారు. ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నో నగరంలో బీజేపీ జాతీయాధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్ మీద ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున ఆయన లోక్‌సభకు పోటీ పడుతున్నారు. జావేద్ జాఫ్రీకి లక్నో టికెట్ కేటాయిస్తూ ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ నాయకత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే చండీగఢ్‌లో గుల్ పనగ్ అనే నటిని రంగంలోకి దింపిన ఆమ్ ఆద్మీ పార్టీ.. ఇప్పుడు జావేద్ జాఫ్రీని కూడా బరిలోకి తీసుకొచ్చింది. సినీ గ్లామర్‌తో ఓట్లు సంపాదించడానికి ఆప్ నాయకత్వం వీలైనంత వరకు ప్రయత్నిస్తోంది. ఇక జావేద్ జాఫ్రీ విషయానికొస్తే, గెలుపోటముల సంగతి ఎలా ఉన్నా.. రాజ్‌నాథ్ సింగ్ మీద పోటీ అంటే బోలెడంత ప్రచారం వస్తుందని సంబరపడుతున్నట్లు తెలుస్తోంది.