రాజ్నాథ్ సింగ్పై ఆప్ అభ్యర్థిగా జావేద్ జాఫ్రీ | aam aadmi party frays Jaaved Jaaferi against rajnath singh in lucknow | Sakshi
Sakshi News home page

రాజ్నాథ్ సింగ్పై ఆప్ అభ్యర్థిగా జావేద్ జాఫ్రీ

Published Mon, Mar 31 2014 6:52 PM | Last Updated on Wed, Apr 4 2018 7:42 PM

రాజ్నాథ్ సింగ్పై ఆప్ అభ్యర్థిగా జావేద్ జాఫ్రీ - Sakshi

రాజ్నాథ్ సింగ్పై ఆప్ అభ్యర్థిగా జావేద్ జాఫ్రీ

బూగీ వూగీ లాంటి కార్యక్రమాలు, చిన్న పిల్లల సినిమాలతోను, డాన్స్ షోలతోను దేశవ్యాప్తంగా ప్రచారం పొందిన బాలీవుడ్ నటుడు జావేద్ జాఫ్రీ రాజకీయ రంగ ప్రవేశం చేస్తున్నారు. రావడం రావడమే ఆయన ఏకంగా కొండను ఢీకొంటున్నారు. ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నో నగరంలో బీజేపీ జాతీయాధ్యక్షుడు రాజ్నాథ్ సింగ్ మీద ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున ఆయన లోక్సభకు పోటీ పడుతున్నారు. జావేద్ జాఫ్రీకి లక్నో టికెట్ కేటాయిస్తూ ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ నాయకత్వం నిర్ణయం తీసుకుంది.

ఇప్పటికే చండీగఢ్లో గుల్ పనగ్ అనే నటిని రంగంలోకి దింపిన ఆమ్ ఆద్మీ పార్టీ.. ఇప్పుడు జావేద్ జాఫ్రీని కూడా బరిలోకి తీసుకొచ్చింది. సినీ గ్లామర్తో ఓట్లు సంపాదించడానికి ఆప్ నాయకత్వం వీలైనంత వరకు ప్రయత్నిస్తోంది. ఇక జావేద్ జాఫ్రీ విషయానికొస్తే, గెలుపోటముల సంగతి ఎలా ఉన్నా.. రాజ్నాథ్ సింగ్ మీద పోటీ అంటే బోలెడంత ప్రచారం వస్తుందని సంబరపడుతున్నట్లు తెలుస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement