దేశంలో వరుస ఘటనలు.. ప్రకృతి పరంగా కొన్ని.. ప్రమాదాలు మరికొన్ని
ఇటీవల ప్రమాదాలు పెరిగిపోతున్నాయి. ప్రకృతి వైపరీత్యాలు వంటి ఊహించని ప్రమాదాలు కొన్ని అయితే, మానవ తప్పిదాలతో జరిగే ఘటనలు మరికొన్ని.. మధ్యకాలంలో గతంలో ఎన్నడూ చూడని స్థాయిలో అత్యంత తీవ్రతతో ఈ ప్రమాదాలు సంభవిస్తున్నాయి. వీటిలో ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్మించినవి కూడా ఉన్నాయి. వరుస ఘటనలతో ఎటునుంచి ఏ ప్రమాదం పొంచి వస్తుందోనని ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.ఢిల్లీ ప్రగతి మైదానం సొరంగంలో పగుళ్లుసెంట్రల్ ఢిల్లీని నగర తూర్పు ప్రాంతాలతో అనుసంధానం చేస్తూ.. రూ. 777 కోట్లతో ప్రగతి మైదాన్ ఇంటిగ్రేటెడ్ ట్రాన్సిట్ కారిడార్ ప్రాజెక్ట్‌ను కేంద్రం చేపట్టింది.. ఇందులో భాగంగా 1.3 కి.మీ. పొడవైన సొరంగం, ఐదు అండర్‌పాస్‌లు నిర్మించారు. 2022 జూన్‌లో ప్రధాని మోదీ ప్రారంభించిన ఈ టన్నెల్లో నీళ్లు నిలిచిపోవడం, పగుళ్లు రావడం వంటి అనేక లోపాలు వెలుగుచూశాయి. పనుల్లో జాప్యం, నిర్వహణ లేమీ కారణంగా సమస్యలు తలెత్తాయి. అనంతం మళ్లీ కోట్ల రూపాయలతతో డిజైన్‌ను సరిదిద్ది, మరమ్మతులు చేశారు.జలమయంగా మారిన అయోధ్యఉత్తరప్రదేశ్లోని అయోధ్య నగరంలో వర్ష బీభత్సం కారణంగా రోడ్లపై మోకాళ్ల వరకు నీరు నిలిచిపోయింది. రామమందీర్ సమీపంలోని ఇళ్లలోకి మురుగునీరు చేరింది. దీంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రామమందిరం చుట్టూ హడావిడిగా నిర్మాణ పనులు చేపట్టడంతోనే ఇళ్లలోకి నీళ్లు వచ్చాయని స్థానికులు అంటున్నారు.మరోవైపు ధ్యలో నిర్మించిన రామమందిరం ప్రారంభోత్సవం జరుపుకొని సరిగ్గా ఆరు నెలలు కూడా పూర్తి కాకముందే.. ప్రధాన గర్భాలయంలో నీరు లీకవడం ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. చిన్నపాటి వర్షానికే ఆలయం నుంచి నీరు కారుతోందని ఆలయ ప్రధాన ఆర్చకుడు ఆచార్య సత్యేంద్ర దాస్ పేర్కొన్నారు. రామ్‌లల్లా విగ్రహం ముందు పూజారి కూర్చునే స్థలం, వీఐపీ దర్శనం కోసం భక్తులు వచ్చే ప్రదేశం వరకూ పైకప్పు నుంచి వర్షపు నీరు లీక్ అవుతోందన్నారు.ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన దేవాలయం పైకప్పు లీక్ అవడం ఆశ్చర్యంగా ఉందని, ఇలా ఎందుకు జరిగిందని విస్మయం వ్యక్త ంచేశారు. ఇంత పెద్ద ఇంజనీర్ల సమక్షంలోనే ఇలాంటి ఘటన జరగడం చాలా పొరపాటుగా పేర్కొన్నారు.అయితే గర్భగుడి నుంచి వర్షపు నీరు లీకవుతోందన్న వార్తలపై రామాలయ నిర్మాణ కమిటీ చైర్మన్ నృపేంద్ర మిశ్రా స్పందించారు. ఈ మేరకు ఆలయ ప్రధాన పూజారి ఆరోపణలను తోసిపుచ్చారు. పైకప్పు లీక్ కాలేదని, విద్యుత్ తీగల కోసం అమర్చిన పైపుల ద్వారా నీరు కిందకు వచ్చిందని వివరించారు. జబల్పూర్ ఎయిర్ పోర్టు ప్రమాదంమధ్యప్రదేశ్లోని జబల్పూర్ దుమ్నా ఎయిర్‌పోర్ట్‌లో పెను ప్రమాదం తప్పింది. భారీ వర్షాలు కారణంగా టెర్మినల్ రూఫ్‌టాప్ పడిపోయింది. పార్కు చేసిన కారు మీద పడడంతో నుజ్జునుజ్జు అయింది. ప్రమాదానికి కొద్ది సేపటి క్రితమే కారులోంచి ఆదాయపు పన్ను అధికారి, డ్రైవర్ కిందకి దిగారు. లేదంటే ప్రాణాలు గాల్లో కలిసిపోయేవి.ఇక ఈ విమానాశ్రాయాన్ని కొన్ని నెలల క్రితమే రూ.450 కోట్ల వ్యయంతో పునరుద్ధరించారు. కానీ గురువారం కురిసిన వర్షానికి అతలాకుతలం అయింది. దీంతో నాణ్యతపై అనుమానాలు రేకెత్తుతున్నాయి.ఢిల్లీ ఎయిర్‌పోర్టు టెర్మినల్‌లో కూలిన రూఫ్ఈ ఘటన జరిగిన ఒక్క రోజుకే ఢిల్లీలోని విమానాశ్రయంలోని టెర్మినల్-1లో పైకప్పు కూలింది. ఈ దుర్ఘటనలో ఒకరు మృతి చెందగా, ఆరుగురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు డాక్టర్లు ఘటనాస్థలానికి చేరుకున్న పొలిసు బృందాలు సహాయక చర్యలు అందిస్తున్నాయి. టెర్మినల్ 1లో ప్రమాదం జరగడంతో పలు విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.అయితే ఎయిర్ పోర్టును నిర్మించిన కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం జరిగిందని పలువురు ఆరోపిస్తున్నారు. నాసిరకం మెటీరియల్‌తో ఎయిర్ పోర్టును నిర్మించిన కంపెనీపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.