రోడ్డు ప్రమాదంలో ఉపాధ్యాయుడి మృతి
మంగపేట, న్యూస్‌లైన్ : రోడ్డు ప్రమాదంలో ఓ ఉపాధ్యాయుడు మృతిచెందిన సంఘటన మం డల కేంద్రంలో బుధవారం చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. మండలంలోని తిమ్మంపేట గ్రామానికి చెంది న జబ్బ నర్సింహారావు(46) అనే ప్రభుత్వ ఉపాధ్యాయుడు గత పదిహేనేళ్ల నుంచి మండల కేంద్రంలోని టీచ ర్స్ కాలనీలో నివాసముంటున్నాడు.
అయితే బుధవారం ఉదయం ఏటూరునాగారంలోని బ్యాంకులో పని ఉందని కుటుంబ సభ్యులకు చెప్పి బైక్‌పై అక్కడికి వెళ్లాడు. అనంతరం పని ముగిం చుకుని మంగపేటలోని తన ఇంటికి తిరిగి వస్తుండగా మార్గమధ్యలోని జీడి వాగు సమీపంలో రోడ్డు దాటుతున్న అడవిపందిని ప్రమాదవశాత్తు ఢీకొట్టా డు. ఈ సంఘటనలో నర్సింహారావు తలకు బలమైన గాయాలయ్యాయి. ఇదిలా ఉండగా, రోడ్డు ప్రమాదంలో గాయపడి సృహతప్పిన నర్సింహారావును కమలాపురం నుంచి ఏటూరునాగారానికి వెళ్తున్న కమలాపురం గ్రామ పంచాయతీ బిల్ కలెక్టర్ కొమురెల్లి గుర్తించాడు.
అనంతరం ఆయన 108 సిబ్బందికి ఫోన్‌చేశాడు. అలాగే మంగపేటకు చెందిన మరో ఉపాధ్యాయుడి కి సమాచారం అందించి వరంగల్‌లోని ప్రైవేటు ఆస్పత్రికి తరలిస్తుండగా మా ర్గమధ్యలో నర్సింహారావు మృతి చెం దాడు. కాగా, మృతుడికి భార్య చంద్రకళ, కుమారులు శశి, రాజేష్ ఉన్నారు.
ఇదిలా ఉండగా, నర్సింహారావు మృతి పట్ల ములుగు మాజీ ఎమ్మెల్యే సీతక్క, కాంగ్రెస్ అభ్యర్థి పొదెం వీరయ్య, టీడీ పీ జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి ఆకా రాధాకృష్ణ, యూత్ కాంగ్రెస్ ము లుగు డివిజన్ అధ్యక్షుడు కొమరగిరి సురేష్ సంతాపం తెలిపారు. అలాగే వివిధ ఉపాధ్యాయ సంఘాల నాయకులు కూడా మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించారు.