JAC chairman kodanda Ram
-
పరిపాలన నీతిని విస్మరించొద్దు..
టీ జేఏసీ చైర్మన్ కోదండరాం దేవరుప్పుల(పాలకుర్తి) : ప్రజలను పరిపాలించే పాలకవర్గాలు మానవీయ కల్యాణం కోసం పరితపించాలే తప్ప పరిపాలన నీతిని విస్మరించొద్దని టీ జేఏసీ చైర్మన్ కోదండరాం సూచించారు. మండలంలోని చిన్నమడూరులో శ్రీ వేణుగోపాలస్వామి ఆలయంలో మొక్కులు చెల్లిం చుకున్న అనంతరం సీతారాముల కల్యాణోత్సవ శోభాయాత్రను బుధవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కోదండరాం మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాలు సుభిక్షంగా ఉండేందుకు, పరిపాలన దక్షతకు నిదర్శనంగా వెలిసినవే ఆలయాలు అని అభివర్ణించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ వీరారెడ్డి సోమశేఖర్‌రెడ్డి, దామోదర్‌రెడ్డి, సర్పంచ్ మేడ సునీత, ఉత్సవ నిర్వాహక కమిటీ ప్రతినిధి శ్రీనివాస్, జనగామ టీ జేఏసీ కన్వీనర్ ఆకుల సతీష్ పాల్గొన్నారు. పేదోళ్ల అడ్డానే దొరికిందా ? జనగామ : పదహారేళ్లుగా నివాసముంటున్న ఏసీ.రెడ్డి నగర్ గుడిసె వాసులకు పట్టాలు ఇచ్చి, డబుల్ బెడ్ రూం ఇళ్లు నిర్మించాల్సిందేనని టీ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం డిమాండ్ చేశారు. ఈ మేరకు గుడిసె వాసులు తలపెట్టిన రిలే దీక్షలు బుధవారం 59వ రోజుకు చేరుకోగా దీక్షా శిబిరాన్ని కోదండరాం సందర్శించి సంఘీభావం తెలిపి మాట్లాడారు. రాష్ట్రమంతటా శ్రీ సీతారాముల కల్యాణ వేడుకలు జరుగుతుంటే.. ఏసీ.రెడ్డి నగర్ వాసులు మాత్రం రోడ్డుపైకి రావాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. జనగామలో కలెక్టరేట్ నిర్మించుకునేందుకు చాలా చోట్ల స్థలాలు ఉన్నా.. పేద కుటుంబాలు నివసించే కాలనీపై కన్ను వేయడం దుర్మార్గమన్నారు. కలెక్టరేట్ కార్యాలయాన్ని ఇక్కడే నిర్మించాలనుకుంటే ముందుగా గుడిసె వాసులకు పక్కా ఇళ్లు కట్టించిన తర్వాతే పనులు ప్రారంభించాలని డిమాండ్ చేశారు. కాగా, రాష్ట్రంలోని మంచిర్యాల, వేములఘాట్‌తో పాటు రాష్ట్రంలో అనేక చోట్ల నెలల తరబడి దీక్షలు జరుగుతున్నా స్వరాష్ట్రంలో పాలకులు పట్టించుకోక పోవడం బాధాకరమన్నారు. టీ జేఏసీ జిల్లా చైర్మన్ ఆకుల సతీష్, కోచైర్మన్‌ప్రొఫెసర్ పురుషోత్తం, కోడెం కుమార్, రామచంద్రం, బిట్ల శ్రీనివాస్, సీపీఎం నాయకులు బూడిద గోపి, ఎం.డీ.దస్తగిరి, ఆకుల లక్ష్మయ్య, కుమార్, జోగు ప్రకాష్, సుధాకర్, రవి పాల్గొన్నారు. -
నయీంలానే కేసీఆర్ సర్కార్ !
-
నయీంలానే కేసీఆర్ సర్కార్ !
హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావుపై జేఏసీ చైర్మన్ కోదండరాం మరోసారి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. గ్యాంగ్‌స్టర్ నయీం భూములు గుంజుకున్నట్లు కేసీఆర్ సర్కార్ కూడా భూములు లాక్కుంటున్నదన్నారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో బుధవారం భూ నిర్వాసితుల సదస్సులో ఆయన మాట్లాడుతూ తెలంగాణ అభివృద్ధికి ప్రాజెక్టులు అవసరమే కానీ వాటికి పక్కా ప్రణాళిక ఉండాలి, ప్రజలతో సంప్రదింపులు జరిపి భూములు తీసుకోవాలని ప్రభుత్వానికి సూచించారు. ప్రజల భాగస్వామ్యంతో నిపుణులతో చర్చించి ప్రాజెక్టులు రూపకల్పన చేయాలి లేదంటే ప్రాజెక్టులను వెంటనే ఆపాలన్నారు. ప్రభుత్వం ఈ విషయంలో మెట్టు దిగిరాకపోతే వచ్చే నెల అసెంబ్లీ సమావేశాల సమయంలో ఇందిరా పార్కు వద్ద భారీ ధర్నా నిర్వహిస్తామన్నారు. ఈ ధర్నాకు రైతులు భారీసంఖ్యలో హాజరు కావాలని కోరారు. రెవెన్యూ సెక్రటరికీ, సీఎస్‌కు, డిప్యూటీ సీఎంకు భూసేకరణ కమిషనర్‌కు జేఏసీ డిక్లరేషన్ కాపీని అందచేస్తామన్నారు. ఈ సదస్సులో ప్రకటించిన తీర్మానాలు 1.రాష్ట్ర ప్రభుత్వం నీటి పారుదల ప్రాజెక్టులకు, పరిశ్రమలకు దౌర్జన్యంగా భూములు తీసుకోవద్దు. దబాయింపులతో భూములను గుంజుకునే విధానానికి స్వస్తిచెప్పాలి. 2. డీపీఆర్ లేకుండా ఇష్టానుసారంగా ప్రాజెక్టులకోసం భూములు తీసుక్కోవద్దు. 3.నష్టపరిహారం ప్రజలు కోరుకున్నట్లు ఇవ్వాలి. భూమికి భూమి సేకరించి సర్కారే ఇవ్వాలి. డబ్బులిచ్చి చేతులు దులుపుకుంటామంటే కుదరదు. 4. భూములు కోల్పోయో రైతులతో పాటు వాటిపై ఆధారపడే వృత్తి దారులకు పరిహారం ఇవ్వాలి. 5. ప్రాజెక్టుల వల్ల భూములు కోల్పోతున్న రైతులకు ఆ ప్రాజెక్టుల ప్రయోజనాల్లో భాగస్వాములను చేయాలి. 6. 2013 జాతీయ భూ సేకరణ చట్టం ప్రకారం నష్టపరిహారం చెల్లించాలి. 7.అన్ని రకాల భూములకు ఏవిధమైన తేడా లేకుండా పరిహారం ఇవ్వాలి. -
కార్మికుడినే నాయకుడిగా ఎన్నుకోవాలి
జేఏసీ చైర్మన్ ప్రొపెసర్ కోదండరాం సదాశివపేట: పరిశ్రమలో కార్మికులు పడుతున్న ఇబ్బందులు తెలిసిన పరిశ్రమలో పనిచేస్తున్న కార్మికుడినే కార్మికులు నాయకునిగా ఎన్నుకుంటే సమస్యలు పరిష్కారమవుతాయని జేఏసీ చైర్మన్ ప్రొపెసర్ కోదండరాం అన్నారు. మండల పరిధిలోని ఎంఆర్ఎఫ్ పరిశ్రమలో ఈనెల 24న జరుగనున్న కార్మిక యూనియన్ ఎన్నికల సందర్భంగా సోమవారం పట్టణంలోని మూతపడిన బాంబే టాకీస్ ఆవరణలో ఏర్పాటు చేసిన ఎంఆర్ఎఫ్ కార్మిక సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హజరయ్యారు. కేపీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు కొత్తగొల్ల చంద్రశేఖర్ ఆధ్వర్యంలో కార్మికులు పట్టణ పురవీధుల గుండ బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం కొత్తగొల్ల చంద్రశేఖర్ అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కోదండరాం మాట్లాడుతూ అసమానతలు, దోపిడీ, ఆకలి దారిద్య్రం నుంచి విముక్తి పొందాలనే ఎందరో స్వాతంత్ర పోరాటం చేశారని తెలిపారు. స్వాతంత్రోద్యమం లేకపోతే రాజ్యంగమే లేదని రాజ్యంగం మనకు దారి చూపుతుందని, తెలంగాణ ఉద్యం భారత రాజ్యంగాన్ని వాడుకుందని అందువల్లనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని అన్నారు. కార్మికులు వెట్టిచాకిరీ చేయవద్దని ఐక్యమత్యంతో కార్మికులు పోరాటం చేసి కార్మిక హక్కలను సాధించుకోవాని సూచించారు. సరళికృత విధానాల వల్ల దేశంలో చాల పరిశ్రమలు మూతపడ్డాయని కాంట్రాక్టు వ్యవస్థపెరిపోయినందువల్ల పర్మనెంట్ కార్మికుల సంఖ్య తగ్గిపోయి కాంట్రాక్టు కార్మికుల సంఖ్య పెరుపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. పరిశ్రమలో అందరికి న్యాయం జరుగాలనే కార్మిక పోరాట సమితి కార్మిక యూనియన్ ఎన్నికల్లో పోటిచేస్తుందని కార్మికులందరకు కేపీఎస్ వ్యవస్థాపక అధ్యకుడు కొత్తగొల్ల చంద్రశేఖర్ ప్యానల్‌కు ఓట్లు వేసి గేలిపించాలని జేఏసీ తరపున కార్మికులకు అండగా ఉంటామని కోదండరాం కార్మికులకు తెలిపారు. కార్యక్రమంలో జేఏసీ రాష్ట్రనాయకుడు పురుషోత్తమ్, జిల్లా కన్వీనర్ ఆశోక్‌కుమార్, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర నాయకుడు బీరయ్యయాదవ్, కార్మికనాయకులు వెంకట్‌రెడ్డి, మక్స్ద్, జనార్ధన్, మల్లేశంతోపాటు ఎంఆర్ఎఫ్ కార్మికులు తదితరులు పాల్గొన్నారు. -
అవాకులు, చెవాకులు పేలొద్దు!
హన్మకొండ: తెలంగాణ రాష్ట్ర సాధనకై ఉద్యమం చేసిన కొందరు అవాకులు, చెవాకులు పేలడం సరికాదని రాజ్యసభ సభ్యుడు కెప్టెన్ లక్ష్మీకాంతరావు అన్నారు. దానికన్నా వారు బంగారు తెలంగాణ కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం, సీఎం కేసీఆర్‌కు నిర్మాణాత్మక సలహాలు, సూచనలు అందిస్తే మంచిదని పేర్కొన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వంపై జేఏసీ చైర్మన్ కోదండరాం విమర్శల నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. రాజ్యసభకు ఎన్నికైన తరువాత తొలిసారిగా మంగళవారం హన్మకొండకు వచ్చిన కెప్టెన్ అమరవీరుల స్థూపానికి నివాళులర్పించిన అనంతరం మాట్లాడారు. నిధులు, నీళ్లు, నియామకాల కోసం పోరాటం చేసి తెలంగాణ సాధించుకున్నామని, ప్రజల ఆలోచనల మేరకు రాష్ట్రాన్ని కేసీఆర్ ముందుకుపోతున్నారని చెప్పారు. ప్రజలు టీఆర్ఎస్ ప్రభుత్వం, సీఎం కేసీఆర్‌పై విశ్వాసంతో ఉన్నారని అన్నారు.