
సమావేశంలో మాట్లాడుతున్న ప్రొఫెసర్ కోదండరాం
- జేఏసీ చైర్మన్ ప్రొపెసర్ కోదండరాం
సదాశివపేట: పరిశ్రమలో కార్మికులు పడుతున్న ఇబ్బందులు తెలిసిన పరిశ్రమలో పనిచేస్తున్న కార్మికుడినే కార్మికులు నాయకునిగా ఎన్నుకుంటే సమస్యలు పరిష్కారమవుతాయని జేఏసీ చైర్మన్ ప్రొపెసర్ కోదండరాం అన్నారు. మండల పరిధిలోని ఎంఆర్‌ఎఫ్ పరిశ్రమలో ఈనెల 24న జరుగనున్న కార్మిక యూనియన్ ఎన్నికల సందర్భంగా సోమవారం పట్టణంలోని మూతపడిన బాంబే టాకీస్ ఆవరణలో ఏర్పాటు చేసిన ఎంఆర్‌ఎఫ్ కార్మిక సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హజరయ్యారు.
కేపీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు కొత్తగొల్ల చంద్రశేఖర్ ఆధ్వర్యంలో కార్మికులు పట్టణ పురవీధుల గుండ బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం కొత్తగొల్ల చంద్రశేఖర్ అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కోదండరాం మాట్లాడుతూ అసమానతలు, దోపిడీ, ఆకలి దారిద్య్రం నుంచి విముక్తి పొందాలనే ఎందరో స్వాతంత్ర పోరాటం చేశారని తెలిపారు. స్వాతంత్రోద్యమం లేకపోతే రాజ్యంగమే లేదని రాజ్యంగం మనకు దారి చూపుతుందని, తెలంగాణ ఉద్యం భారత రాజ్యంగాన్ని వాడుకుందని అందువల్లనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని అన్నారు.
కార్మికులు వెట్టిచాకిరీ చేయవద్దని ఐక్యమత్యంతో కార్మికులు పోరాటం చేసి కార్మిక హక్కలను సాధించుకోవాని సూచించారు. సరళికృత విధానాల వల్ల దేశంలో చాల పరిశ్రమలు మూతపడ్డాయని కాంట్రాక్టు వ్యవస్థపెరిపోయినందువల్ల పర్మనెంట్ కార్మికుల సంఖ్య తగ్గిపోయి కాంట్రాక్టు కార్మికుల సంఖ్య పెరుపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. పరిశ్రమలో అందరికి న్యాయం జరుగాలనే కార్మిక పోరాట సమితి కార్మిక యూనియన్ ఎన్నికల్లో పోటిచేస్తుందని కార్మికులందరకు కేపీఎస్ వ్యవస్థాపక అధ్యకుడు కొత్తగొల్ల చంద్రశేఖర్ ప్యానల్‌కు ఓట్లు వేసి గేలిపించాలని జేఏసీ తరపున కార్మికులకు అండగా ఉంటామని కోదండరాం కార్మికులకు తెలిపారు.
కార్యక్రమంలో జేఏసీ రాష్ట్రనాయకుడు పురుషోత్తమ్, జిల్లా కన్వీనర్ ఆశోక్‌కుమార్, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర నాయకుడు బీరయ్యయాదవ్, కార్మికనాయకులు వెంకట్‌రెడ్డి, మక్స్‌ద్, జనార్ధన్, మల్లేశంతోపాటు ఎంఆర్‌ఎఫ్ కార్మికులు తదితరులు పాల్గొన్నారు.