MRF company
-
రాష్ట్రంలో వెయ్యి కోట్ల పెట్టుబడికి ఎంఆర్ఎఫ్ సిద్ధం
సాక్షి, హైదరాబాద్: ప్రముఖ టైర్ల తయారీ సంస్థ ఎంఆర్ఎఫ్ రాష్ట్రంలో మరో వెయ్యి కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టనున్నట్లు ప్రకటించింది. గురువారం రాష్ట్రమంత్రి కేటీఆర్‌తో ఎంఆర్ఎఫ్ వైస్ చైర్మన్, ఎండీ అరుణ్ మమ్మెన్ భేటీ అయ్యారు. రూ.వెయ్యి కోట్లతో సదాశివపేట ప్లాంట్‌ను విస్తరించాలని నిర్ణయం తీసుకున్నట్టు కంపెనీ ఎండీ వెల్లడించారు. ఇదే విషయాన్ని మంత్రి కేటీఆర్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా కూడా తెలియజేశారు. మన ఊరు–మన బడి కార్యక్రమానికి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద రూ.4 కోట్ల చెక్‌ను కేటీఆర్‌కు అరుణ్ మమ్మెన్ అందజేశారు. అదేవిధంగా అస్సోచామ్ ప్రతి నిధులు కేటీఆర్‌తో సమావేశమయ్యారు. పెట్టుబడు లకు సంబంధించి కేటీఆర్‌తో చర్చించినట్టు సంస్థ ట్విట్టర్ ఖాతా ద్వారా తెలిపింది. -
డివిడెండ్ ప్రకటించిన ఎంఆర్ఎఫ్
న్యూఢిల్లీ: టైర్ల తయారీ దిగ్గజం ఎంఆర్ఎఫ్ లిమిటెడ్ గతేడాది(2020–21) నాలుగో త్రైమాసికంలో నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన క్యూ4(జనవరి–మార్చి)లో నికర లాభం 51 శాతం పడిపోయింది. రూ. 332 కోట్లకు పరిమితమైంది. అంతక్రితం ఏడాది(2019–20) ఇదే కాలంలో రూ. 679 కోట్ల నికర లాభం ఆర్జించింది. మొత్తం ఆదాయం మాత్రం రూ. 3,685 కోట్ల నుంచి రూ. 4,816 కోట్లకు ఎగసింది. వాటాదారులకు కంపెనీ బోర్డు షేరుకి రూ. 94 చొప్పున తుది డివిడెండును ప్రకటించింది. ప్రత్యేక డివిడెండ్సహా దీంతో కలిపి గతేడాది మొత్తం రూ. 150 డివిడెండ్ చెల్లించినట్లు కంపెనీ పేర్కొంది. మార్చితో ముగిసిన పూర్తి ఏడాదికి ఎంఆర్ఎఫ్ రూ. 1,277 కోట్ల నికర లాభం సాధించింది. 2019–20లో రూ. 1,423 కోట్ల లాభం ఆర్జించింది. మొత్తం ఆదాయం రూ. 16,239 కోట్ల నుంచి స్వల్ప వెనకడుగుతో రూ. 16,163 కోట్లకు చేరింది. కన్సాలిడేటెడ్ ఫలితాలివి. ఎంఆర్ఎఫ్ షేరు ఎన్ఎస్ఈలో 3% పతనమై రూ. 82,310 వద్ద ముగిసింది. -
పృథ్వీ షాతో ఎంఆర్ఎఫ్ ఒప్పందం
ముంబై: దేశవాళీ క్రికెట్లో పరుగుల వరద పారిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు ఏర్పరచుకున్న ముంబై యువ సంచలనం పృథ్వీ షాకు గొప్ప అవకాశం లభించింది. ప్రముఖ టైర్ల సంస్థ మద్రాస్ రబ్బర్ ఫ్యాక్టరీ (ఎంఆర్ఎఫ్) ఈ యువ క్రికెటర్‌తో ఒప్పందం చేసుకుంది. వచ్చే జనవరిలో న్యూజిలాండ్‌లో జరిగే అండర్–19 ప్రపంచకప్‌లో భారత్‌కు కెప్టెన్‌గా వ్యవహరించనున్న పృథ్వీ షా తాజా ఒప్పందంతో సచిన్, కోహ్లిలాంటి మేటి క్రికెటర్ల సరసన చేరాడు. ‘నాతో ఒప్పందం చేసుకున్నందుకు ఎంఆర్ఎఫ్ సంస్థకు కృతజ్ఞతలు. సచిన్, కోహ్లి, లారాలు ఈ లోగోను ధరించి టన్నుల కొద్దీ పరుగులు సాధించారు. చిన్నప్పటి నుంచి వారినే ఆదర్శంగా తీసుకుంటూ పెరిగిన నేను కూడా త్వరలోనే ఈ బ్యాట్‌తో బరిలోకి దిగుతాను’ అని పృథ్వీ షా అన్నాడు. -
కార్మికుడినే నాయకుడిగా ఎన్నుకోవాలి
జేఏసీ చైర్మన్ ప్రొపెసర్ కోదండరాం సదాశివపేట: పరిశ్రమలో కార్మికులు పడుతున్న ఇబ్బందులు తెలిసిన పరిశ్రమలో పనిచేస్తున్న కార్మికుడినే కార్మికులు నాయకునిగా ఎన్నుకుంటే సమస్యలు పరిష్కారమవుతాయని జేఏసీ చైర్మన్ ప్రొపెసర్ కోదండరాం అన్నారు. మండల పరిధిలోని ఎంఆర్ఎఫ్ పరిశ్రమలో ఈనెల 24న జరుగనున్న కార్మిక యూనియన్ ఎన్నికల సందర్భంగా సోమవారం పట్టణంలోని మూతపడిన బాంబే టాకీస్ ఆవరణలో ఏర్పాటు చేసిన ఎంఆర్ఎఫ్ కార్మిక సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హజరయ్యారు. కేపీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు కొత్తగొల్ల చంద్రశేఖర్ ఆధ్వర్యంలో కార్మికులు పట్టణ పురవీధుల గుండ బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం కొత్తగొల్ల చంద్రశేఖర్ అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కోదండరాం మాట్లాడుతూ అసమానతలు, దోపిడీ, ఆకలి దారిద్య్రం నుంచి విముక్తి పొందాలనే ఎందరో స్వాతంత్ర పోరాటం చేశారని తెలిపారు. స్వాతంత్రోద్యమం లేకపోతే రాజ్యంగమే లేదని రాజ్యంగం మనకు దారి చూపుతుందని, తెలంగాణ ఉద్యం భారత రాజ్యంగాన్ని వాడుకుందని అందువల్లనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని అన్నారు. కార్మికులు వెట్టిచాకిరీ చేయవద్దని ఐక్యమత్యంతో కార్మికులు పోరాటం చేసి కార్మిక హక్కలను సాధించుకోవాని సూచించారు. సరళికృత విధానాల వల్ల దేశంలో చాల పరిశ్రమలు మూతపడ్డాయని కాంట్రాక్టు వ్యవస్థపెరిపోయినందువల్ల పర్మనెంట్ కార్మికుల సంఖ్య తగ్గిపోయి కాంట్రాక్టు కార్మికుల సంఖ్య పెరుపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. పరిశ్రమలో అందరికి న్యాయం జరుగాలనే కార్మిక పోరాట సమితి కార్మిక యూనియన్ ఎన్నికల్లో పోటిచేస్తుందని కార్మికులందరకు కేపీఎస్ వ్యవస్థాపక అధ్యకుడు కొత్తగొల్ల చంద్రశేఖర్ ప్యానల్‌కు ఓట్లు వేసి గేలిపించాలని జేఏసీ తరపున కార్మికులకు అండగా ఉంటామని కోదండరాం కార్మికులకు తెలిపారు. కార్యక్రమంలో జేఏసీ రాష్ట్రనాయకుడు పురుషోత్తమ్, జిల్లా కన్వీనర్ ఆశోక్‌కుమార్, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర నాయకుడు బీరయ్యయాదవ్, కార్మికనాయకులు వెంకట్‌రెడ్డి, మక్స్ద్, జనార్ధన్, మల్లేశంతోపాటు ఎంఆర్ఎఫ్ కార్మికులు తదితరులు పాల్గొన్నారు.