
ముంబై: దేశవాళీ క్రికెట్‌లో పరుగుల వరద పారిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు ఏర్పరచుకున్న ముంబై యువ సంచలనం పృథ్వీ షాకు గొప్ప అవకాశం లభించింది. ప్రముఖ టైర్ల సంస్థ మద్రాస్ రబ్బర్ ఫ్యాక్టరీ (ఎంఆర్‌ఎఫ్) ఈ యువ క్రికెటర్‌తో ఒప్పందం చేసుకుంది. వచ్చే జనవరిలో న్యూజిలాండ్‌లో జరిగే అండర్–19 ప్రపంచకప్‌లో భారత్‌కు కెప్టెన్‌గా వ్యవహరించనున్న పృథ్వీ షా తాజా ఒప్పందంతో సచిన్, కోహ్లిలాంటి మేటి క్రికెటర్ల సరసన చేరాడు.
‘నాతో ఒప్పందం చేసుకున్నందుకు ఎంఆర్‌ఎఫ్ సంస్థకు కృతజ్ఞతలు. సచిన్, కోహ్లి, లారాలు ఈ లోగోను ధరించి టన్నుల కొద్దీ పరుగులు సాధించారు. చిన్నప్పటి నుంచి వారినే ఆదర్శంగా తీసుకుంటూ పెరిగిన నేను కూడా త్వరలోనే ఈ బ్యాట్‌తో బరిలోకి దిగుతాను’ అని పృథ్వీ షా అన్నాడు.