సాక్షి, హైదరాబాద్: ప్రముఖ టైర్ల తయారీ సంస్థ ఎంఆర్‌ఎఫ్ రాష్ట్రంలో మరో వెయ్యి కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టనున్నట్లు ప్రకటించింది. గురువారం రాష్ట్రమంత్రి కేటీఆర్‌తో ఎంఆర్‌ఎఫ్ వైస్ చైర్మన్, ఎండీ అరుణ్ మమ్మెన్ భేటీ అయ్యారు. రూ.వెయ్యి కోట్లతో సదాశివపేట ప్లాంట్‌ను విస్తరించాలని నిర్ణయం తీసుకున్నట్టు కంపెనీ ఎండీ వెల్లడించారు. ఇదే విషయాన్ని మంత్రి కేటీఆర్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా కూడా తెలియజేశారు. మన ఊరు–మన బడి కార్యక్రమానికి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద రూ.4 కోట్ల చెక్‌ను కేటీఆర్‌కు అరుణ్ మమ్మెన్ అందజేశారు. అదేవిధంగా అస్సోచామ్ ప్రతి నిధులు కేటీఆర్‌తో సమావేశమయ్యారు. పెట్టుబడు లకు సంబంధించి కేటీఆర్‌తో చర్చించినట్టు సంస్థ ట్విట్టర్ ఖాతా ద్వారా తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment