జగ్గంపేటలో జగదీశ్వరి ఆత్మహత్యాయత్నం
కాకినాడ : తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేటలో జగదీశ్వరి అనే యువతి మంగళవారం ఆత్మహత్యయత్నం చేసుకుంది. ఆ విషయాన్ని గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రియుడు మోసం చేశాడని... ఆరోపిస్తూ... 10 రోజుల క్రితం సదరు యువతి పోలీసులను ఆశ్రయించింది.
ఆమె విషయాన్ని పోలీసులు పట్టించుకోలేదు. దీంతో జగదీశ్వరి తీవ్ర మనస్తాపానికి గురైంది. దాంతో మంగళవారం తెల్లవారుజామున జగదీశ్వరి ఆత్మహత్యకు యత్నించింది.