Jagapatibabu
-
అడవి బాట... బాక్సాఫీస్ వేట
అడవిలో వేటకు దిగారు హీరోలు.. ఒకరి వేట అక్రమార్కులను అంతం చేయడం కోసం.. ఒకరి వేట స్మగ్లింగ్ చేయడం కోసం.. ఎవరి వేట ఏదైనా అంతిమంగా బాక్సాఫీస్ వసూళ్ల వేట కోసమే. కొందరు తెలుగు హీరోలు, దర్శకులు అడవి బాట పట్టారు. అడవి నేపథ్యంలో కథలను వెండితెరపైకి తీసుకువస్తున్నారు. ఈ మధ్య ‘అడవి’ సినిమాలు కొన్ని వచ్చాయి. ఇక రానున్న ఫారెస్ట్ బ్యాక్‌డ్రాప్ చిత్రాల గురించి తెలుసుకుందాం. హీరో అల్లు అర్జున్– దర్శకుడు సుకుమార్ కాంబినేషన్లో రూపొందిన ‘ఆర్య’, ‘ఆర్య 2’ చిత్రాలు లవ్‌స్టోరీగా ప్రేక్షకులను మెప్పించాయి. ఈ ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన మూడో చిత్రం ‘పుష్ప’ ఫుల్ మాస్ ఎంటర్టైనర్. కంప్లీట్ ఫారెస్ట్ బ్యాక్‌డ్రాప్ స్టోరీ అని తెలిసిందే. గత ఏడాది డిసెంబరులో విడుదలైన ‘పుష్ప’ ఫస్ట్ పార్ట్ ‘పుష్ప: ది రైజ్’ ఎంతటి ఘనవిజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ చిత్రంలో పుష్పరాజ్‌గా అల్లు అర్జున్ రెచ్చిపోయి నటించారు. ‘పుష్ప: ది రైజ్’ ఇచ్చిన విజయంతో మరింత జోష్‌తో ‘పుష్ప’లో రెండో భాగమైన ‘పుష్ప: ది రూల్’పై ఫోకస్ పెట్టారు అల్లు అర్జున్, సుకుమార్. ‘పుష్ప: ది రైజ్’ అడవి బ్యాక్‌డ్రాప్‌లో సాగినట్లే ‘పుష్ప: ది రూల్’ కూడా అడవి బ్యాక్‌డ్రాపే. ఈ ఏడాది ఆగస్టులో షూటింగ్ ప్రారంభం కానుందని తెలిసింది. ఇక ‘విరాటపర్వం’ కోసం వెండితెర విప్లవకారుడు రవన్న అవతారం ఎత్తారు హీరో రానా. సాయిపల్లవి హీరోయిన్గా నటించిన ఈ సినిమాకు వేణు ఊడుగుల దర్శకుడు. 1990 నాటి పరిస్థితుల ఆధారంగా నక్సలిజం నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రం ఎక్కువ శాతం షూటింగ్ అడవిలోనే జరిగింది. ప్రియమణి, నందితాదాస్, నవీన్‌చంద్ర, జరీనా వాహబ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం ఈ నెల 17న రిలీజ్ కానుంది. మరోవైపు ఇటీవలి కాలంలో మారేడుమిల్లి ఫారెస్ట్‌లోనే ఎక్కువ టైమ్ స్పెండ్ చేశారట ‘అల్లరి’ నరేశ్. ఎందుకంటే... ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’ సినిమా కోసం. అడవిలో నివాసం ఉండే ఓ ఆదివాసీ తెగ సమస్యలను పరిష్కరించే వ్యక్తి పాత్రలో నటిస్తున్నారు ‘అల్లరి’ నరేశ్. ఈ సినిమా కథనం కూడా అడవి నేపథ్యంలోనే ఉంటుంది. ఈ చిత్రానికి ఏఆర్ మోహన్ దర్శకత్వం వహిస్తున్నారు. మరోవైపు ‘సింబా’ చిత్రం కోసం ఫారెస్ట్మేన్గా మారిపోయారు జగపతిబాబు. దర్శకుడు సంపత్ నంది కథ అందిచడంతో పాటు ఓ నిర్మాతగా ఉన్న ఈ సినిమాకు మురళీ మోహన్ రెడ్డి దర్శకుడు. ఈ చిత్రంలో ప్రకృతి ప్రేమికుడి పాత్రలో కనిపిస్తారు జగపతిబాబు. పర్యావరణ అంశాల నేపథ్యంలో సినిమా కాబట్టి ‘సింబా’ మేజర్ షూటింగ్ అడవి బ్యాక్ డ్రాప్లో ఉంటుందనుకోవచ్చు. అలాగే దివంగత నటుడు హరనాథ్ మనవడు విరాట్‌రాజ్ ‘సీతామనోహర శ్రీరాఘవ’ చిత్రంతో హీరోగా పరిచయం అవుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా అడవి బ్యాక్‌డ్రాప్‌లోనే సాగుతుంది. ఇక ఈ ఏడాది రిలీజైన ‘భీమ్లా నాయక్’, ‘ఆర్ఆర్ఆర్’, ‘ఆచార్య’, చిత్రాలు కూడా అడవి నేపథ్యంతో కూడుకున్నవే. రాబోయే రోజుల్లో మరికొన్ని అడవి కథలు వెండితెర పైకి రానున్నాయి. అడవి బాటలోనే మహేశ్-రాజమౌళి సినిమా కూడా: హీరో మహేశ్‌బాబు–దర్శకుడు రాజమౌళి కాంబినేషన్లో ఓ భారీ సినిమా రూపుదిద్దుకోనున్న సంగతి తెలిసిందే. ఆఫ్రికన్ అడవుల నేపథ్యంలో ఈ సినిమా ఉంటుందనే వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాకు కథ అందిస్తున్న రచయిత విజయేంద్రప్రసాద్ సైతం మహేశ్ సినిమా ఫారెస్ట్ బ్యాక్‌డ్రాప్‌లోనే ఉంటుందని పేర్కొన్నారు. -
చందనకు జగపతి బాబు తల్లి సహాయం
హైదరాబాద్: తల్లిదండ్రులిద్దరూ వదిలేసి వెళ్లిపోవడంతో నాయనమ్మ వద్ద పెరుగుతూ చదువుకోవడానికి ఇబ్బందులు పడుతున్న చిన్నారికి హీరో జగపతిబాబు తల్లి వసుంధరాదేవి స్పందించి రూ. 20 వేల ఆర్థిక సహాయం ప్రకటించారు. గురువారం ఈ మొత్తాన్ని హీరో జగపతిబాబు ఆ బాలికకు అందజేశారు. మణికొండకు చెందిన చందన అనే బాలిక నాలుగో తరగతి చదువుతుండగా తల్లిదండ్రులు వదిలేసి వెళ్లిపోయారు. దీంతో చదువుకోవడం ఇబ్బందికరంగా మారిన నేపథ్యంలో ఓ చానెల్లో బాలిక వేదనను చూసిన... వసుంధరాదేవి ఆమె చదువుల కోసం ఈ ఆర్థిక సహాయాన్ని అందించింది. -
స్టార్ స్టార్ సూపర్ స్టార్ - జగపతి బాబు
-
మన బాధ్యత
‘‘సామాజికంగా మన బాధ్యతలను, ఆదర్శవంతమైన విలువలను చూపించడంలో ‘హితుడు’ సినిమా విజయం సాధించిందని, ఇలాంటి చిత్రాలను ప్రోత్సహించడం మన బాధ్యత’’ అని పాటల రచయిత అనంత శ్రీరామ్ అన్నారు. జగపతిబాబు, మీరానందన్ జంటగా, విప్లవ్ దర్శకత్వంలో సుంకర మధు మురళి నిర్మించిన ఈ చిత్రానికి మేధావులు, సినీ పరిశ్రమ నుంచి మంచి స్పందన లభిస్తోంది. సీనియర్ సంపాదకుడు ఏబీకె ప్రసాద్, తెలంగాణా ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ, నమస్తే తెలంగాణ పత్రిక ఎడిటర్ కట్టా శేఖర్‌రెడ్డి ఈ చిత్రాన్ని చూసి, నిర్మాతను అభినందించారు. -
రజనీకాంత్ ‘ లింగా’ చిత్రం ఆడియో ఆవిష్కరణ
-
ప్రజలకు సేవ చేస్తా
ప్రజలకు సేవ చే యడమే తన ఏకైక లక్ష్యమని సూపర్‌స్టార్ రజనీకాంత్ స్పష్టం చేశారు. లింగా చిత్రం ఆడియో ఆవిష్కరణ కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. రజనీకాంత్ నటించిన తాజా చిత్రం లింగా. అనుష్క, సోనాక్షి సిన్హాలు నాయికలు. టాలీవుడ్ ప్రముఖ నటుడు జగపతిబాబు ప్రతినాయకుడిగా నటించారు. కేఎస్ రవికుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని రాక్‌లైన్ వెంకటేశ్ నిర్మించారు. ఈరో స్ ఎంటర్టైన్మెంట్ సంస్థ లింగా చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తం గా డిసెంబర్ 12న విడుదలకు సన్నాహాలు చేస్తోంది. ఏఆర్ రెహ్మాన్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రం ఆడియో ఆవిష్కరణ ఆదివారం ఉదయం స్థానిక అన్నాసాలైలోని సత్యం సినిమా థియేటర్లో జరిగింది. చిత్ర ఆడియోను రజనీకాంత్ ఆవిష్కరించి తొలి ప్రతిని చిత్ర యూనిట్‌కు అందించారు. రజనీ చూపించిన టైటిల్ లింగా దర్శకుడు కేఎస్ రవికుమార్ లింగా చిత్ర టైటిల్‌ను ఎవరు చూపించాలన్న విషయాన్ని ప్రస్తావిస్తూ తొలి చిత్రానికి వెంక న్న అనుకున్నామని అయితే రజనీ టైటిల్ కొంచెం సాఫ్ట్‌గా అనిపిస్తోందని, ఇంకొంచెం ఫోర్స్‌గా ఉంటే బాగుంటుందన్నారన్నారు. ఆ తరువాత ఆయనే లింగా టైటిల్‌ను చూపించారని తెలిపారు. సీనియర్ దర్శకుడు ఎస్పి ముత్తురామన్ మాట్లాడుతూ రజనీకాంత్ అనారోగ్యానికి గురై, విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో ఆయనకు ప్రశాంతతను కలిగించింది ఆయన మనవళ్లు లింగా, యాత్రలేనని తెలిపారు. అందువలన తన మనవడు లింగా పేరు ప్రాచుర్యం పొందాలనే ఈ చిత్రానికి ఆ టైటిల్ నిర్ణయించారన్నారు. లింగా చిత్రాన్ని తాను నిర్మించానంటే ఇప్పటికీ కలగానే ఉందని చిత్ర నిర్మాత రాక్‌లైన్ వెంకటేష్ అన్నారు. ఇంతకుముందు ఎన్ని చిత్రాలు చేసినా లింగా చిత్రం అనుభవం మరపురానిదన్నారు. దర్శకుడు శంకర్ మాట్లాడుతూ లింగా చిత్రం ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోందన్నారు. ఈ చిత్రం గురించి పలువురు లింగా చిత్రం డబుల్ పడయప్పలా ఉంటుందని మరికొందరు ఈ చిత్ర స్టిల్స్ చూస్తుంటే శివాజీ చిత్రంలో రజనీ గుర్తుకొస్తున్నారని, ఇంకొందరు లింగా ఎందిరన్ను మించిపోయిందని చెబుతున్నారన్నారు. రజనీ అంటే చాలా ఇష్టం రజనీకాంత్ అంటే తనకు చాలా ఇష్టమని ఈ చిత్రంలో నటించిన జగపతిబాబు తెలిపారు. తాను పుట్టి పెరిగింది ఇక్కడే. చిన్నప్పటి నుంచి రజనీ చిత్రాలు చూస్తున్నాను. అందుకే లింగా చిత్రంలో నటించే అవకాశం రావడంతో కథ కూడా వినకుండా నటించడానికి ఒప్పేసుకున్నానన్నారు. రజనీకాంత్ తనకు ఆయన బయోగ్రఫీ పుస్తకాన్ని గిఫ్ట్‌గా ఇచ్చారు. తానందుకున్న తొలి బయోగ్రఫీ పుస్తకం ఇదేనన్నారు. సోనాక్షి సిన్హా మాట్లాడుతూ తాను సూపర్‌స్టార్ హీరోయిన్ అంటే ఆనందం పట్టలేక అరిచేశానన్నారు. అంతేకాదు అయామ్ రజనీ ఫ్యాన్ అన్నారు. లుంగీ డాన్స్, లింగా డాన్స్ అంటూ డాన్స్ హమ్ చేస్తూ ఆడేశారు. అనుష్క మాట్లాడుతూ రజనీకాంత్‌తో తొలిసారి నటించాను. చాలా సంతోషంగా ఉందని, ఆయనతో కలిసి నటించిన అనుభవాన్ని ఎక్స్‌ప్రెస్ చేయలేనన్నారు. జయించడమే ముఖ్యం రజనీకాంత్ మాట్లాడుతూ తాను అనారోగ్యానికి గురైన తరువాత మళ్లీ నటించగలనా అని చింతించానన్నారు. కొంచెం గ్యాప్ తీసుకుని తన కూతురు సౌందర్య దర్శకత్వంలో ప్రయోగాత్మక చిత్రం కోచ్చడయాన్ చేశానన్నారు. ఆ చిత్రం ఆర్థికంగా లాభించకపోయినా సౌందర్యకు అపార అనుభవాన్ని కలిగించిందన్నారు. అది యానిమేషన్ చిత్రం కావడంతో చాలామంది అభిమానులు చివరిలోనైనా తాను మామూలు నటుడిగా కనిపిం చాలని ఆశించినట్లు తెలిపారన్నారు. దీంతో ఒక కమర్షియల్ చిత్రం వెంటనే చేయాలన్న నిర్ణయమే లింగా అని తెలిపారు. ఈ వేదికపై చాలా మంది రాజకీయాల్లోకి రావాలనే ఆకాంక్షను వ్యక్తం చేశారన్నారు. అయితే రాజకీయాలంటే తనకేమీ భయం లేదని, వాటి లోతు కూడా తెలుసన్నారు. సినిమా చేయడం సులభమే, అలాగే రాజకీయ రంగ ప్రవేశం కష్టసాధ్యం కాదు. అయితే జయించడమే ముఖ్యం అన్నారు. పలు అవరోధాలను అధిగమించాల్సి ఉంటుందన్నారు. కొన్ని పరిస్థితులే తననీ స్థాయికి నిలబెట్టాయని, అదే విధంగా రేపటి పరిస్థితుల్లో ఏ స్థాయికి చేరుస్తాయో తెలియదన్నారు. అయితే ఖచ్చితంగా తనను నమ్మిన వాళ్లకు సేవ చేస్తానని రజనీ అన్నారు. -
సినిమా రివ్యూ: లెజెండ్
సినిమా రివ్యూ: లెజెండ్ నటవర్గం: బాలకృష్ణ, జగపతి బాబు, రాధిక ఆంప్టే, సోనాల్ చౌహన్ దర్శకుడు: బోయపాటి శ్రీను నిర్మాత: అచంట గోపినాథ్, ఆచంట రాము, అనిల్ సుంకర సంగీతం: దేవి శ్రీ ప్రసాద్ బ్యానర్: 14 రీల్స్ ఎంటర్ టైన్ మెంట్ ప్లస్ పాయింట్స్: జగపతిబాబు, బాలకృష్ణ నటన డైలాగ్స్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం మైనస్ పాయింట్స్: మితిమీరిన హింస క్లైమాక్స్ బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వచ్చిన సింహా సూపర్ హిట్. ఆతర్వాత బాలకృష్ణ, బోయపాటి శ్రీనులకు సరైన హిట్ లేదు. లెజెండ్ లో జగపతిబాబు రూట్ మార్చి విలన్ రూపంలో కనిపించనున్నారు. రాష్ట్రంలో రాజకీయ వాతావరణం వేడిక్కి ఉంది. ఇలాంటి నేపథ్యంలో బాలకృష్ణ రాజకీయంగాను, సినీ కెరీర్ లో ప్రభావం చూపేందుకు లెజెండ్ ఎంచుకున్నారు. ఇలాంటి నేపథ్యంలో బాలకృష్ణ, బోయపాటిలు సరైన హిట్ కోసం, జగపతిబాబు తనను తాను కొత్తగా అవిష్కరించుకునే ప్రయత్నం చేస్తున్న తరుణంలో ఈ చిత్రం కొంత ప్రాధాన్యత, ఆసక్తిని సొంతం చేసుకుంది. మార్చి 28 శుక్రవారం వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉందా అని తెలుసుకోవాలంటే కథలోకి వెళ్లాల్సిందే. ఇంట్లో కారం, ఒంట్లో అహంకారం లేకుండా బతకలేననే జితేందర్ (జగపతిబాబు) ముఖ్యమంత్రిపై పదవిపై ఆశలు పెంచుకుంటాడు. అలాంటి జితేందర్ పెళ్లి చూపుల కెళ్లి ఓ వివాదంలో చిక్కుకుంటాడు. ఆ ఊరి పెద్ద (సుమన్) జితేందర్ ను నష్టపరిహారం, క్షమాపణ చెప్పాలని తీర్పు ఇస్తాడు. ఆ ఊరి పెద్ద నిర్ణయాన్ని వ్యతిరేకించడమే కాకుండా భార్య (సుహాసిని)ను కుమారుడు కృష్ణ (బాలకృష్ణ)ను కిడ్నాప్ చేస్తాడు. కిడ్నాప్ వ్యవహారంలో తల్లి చనిపోవడంతో కృష్ణ జితేందర్ తండ్రి, అతని అనుచరులను చంపుతాడు. చిన్నతనంలో ఫ్యాక్షన్ రాజకీయాల్లో తలదూర్చడం ఇష్టం లేని కారణంగా కృష్ణను పై చదువుల కోసం లండన్ పంపుతాడు. చదువు పూర్తయిన తర్వాత దుబాయ్ లో బిజినెస్ లో స్థిర పడుతాడు. పెళ్లి చేసుకుందామని వచ్చిన కృష్ణకు జితేందర్, అతని అనుచరుడి రూపంలో అనుకోని సంఘటనలు ఎదురవుతాయి. జితేందర్ ను, అతని అనుచరులు ఎదుర్కొన్న కృష్ణను హతమార్చేందుకు ప్లాన్ వేసి.. ఓ ఘటనలో కృష్ణపై కాల్పులు జరుపుతారు. దాంతో కృష్ణ పరిస్థితి విషమంగా మారుతుంది. ఆ సంఘటన తర్వాతే సినిమాలో పెద్ద ట్విస్ట్ మొదలవుతుంది. ట్విస్ట్ ఎమిటి? చావు బతుకుల పరిస్థితుల మధ్య ఉన్న కృష్ణ పరిస్థితి ఏమైంది. జితేందర్ ముఖ్యమంత్రి అయ్యాడా; జితేందర్ ముఖ్యమంత్రి అయ్యేందుకు ఎవరు అడ్డంకిగా మారారు అనే సందేహాలకు సినిమా చూడాల్సిందే. కృష్ణ పాత్రలో బాలకృష్ణ మరోసారి విజృంభించాడు. కథకు తగినట్టుగా.. తనకు లభించిన క్యారెక్టర్ పండించడంలో బాలకృష్ణ సఫలమయ్యాడు. సింహా తర్వాత ఓ పవర్ ఫుల్ పాత్రతో బాలకృష్ణ అదరగొట్టాడనే చెప్పవచ్చు. ఇక జితేందర్ పాత్రలో జగపతిబాబు తన రూట్ ను మార్చుకుని ఓ పవర్ ఫుల్ విలన్ పాత్రతో అద్బుతంగా రాణించాడు. జితేంద్ర పాత్ర లేకపోతే లెజెండ్ సినిమా లేదని ఓ అభిప్రాయాన్ని కలిగించే రేంజ్ లో జగపతిబాబు ప్రభావాన్ని చూపారు. తన ఇమేజ్ ను పక్కన పెట్టి ఓ కొత్త పాత్రతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారడంలో సందేహం అక్కర్లేదు. కథలో భాగంగా రాధికా ఆంప్టే, సోనాల్ చౌహాన్ లు పాటలకే పరిమితం కాకుండా పెర్పార్మెన్స్ కూడా అవకాశం లభించింది. మిగితా పాత్రలు తమ పాత్రల పరిమితి మేరకు పర్వాలేదనిపించారు. రత్నం మాటలు, దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం, రామ్ ప్రసాద్ కెమెరా ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ద్వితీయార్ధంలో రత్నం మాటలు తూటాల్ల పేలాయి. మ్యూజిక్ రివ్యూ: తొలిసారి బాలకృష్ణ చిత్రం కోసం మ్యూజిక్ సెన్సేషన్ దేవి శ్రీ ప్రసాద్ స్వరాలు చేకూర్చారు. బాలకృష్ణను క్రేజ్ దృష్టిలో ఉంచుకుని రూపొందించిన 'సూర్యుడు, చంద్రుడు, రాముడు, భీముడు, కృష్ణుడు, విష్ణువు కలిసాడంటే వీడు' అనే టైటిల్ సాంగ్, మెలోడిగా రూపొందింన 'పట్టు చీర బాగుందే.. కట్టు బొట్టు బాగుందే' ఆడియోలో అభిమానులను ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. ఈ పాటలకు వచ్చిన క్రేజ్ ఏమాత్రం తగ్గకుండా తెర రూపం కల్పించారు. ఇక ఈ చిత్రంలో కీలకమైన పలు సన్నివేశాలకు తన బ్యాక్ గ్రౌండ్ స్కోరుతో దేవి శ్రీ ప్రసాద్ జీవం పోశారు. ఈ చిత్ర ద్వితీయార్ధంలో దేవీ శ్రీ స్రసాద్ పనితీరు అద్బుతంగా ఉంది. దర్శకుడి పనితీరు: దమ్ము చిత్రంతో ఎదురెబ్బ తిన్న బోయపాటి శ్రీను లెజెండ్ చిత్రంలో చక్కటి స్క్రీన్ ప్లే, ఫర్ ఫెక్ట్ స్క్రిప్ట్ తో దూసుకుపోయాడు. తొలిభాగంలో కథ మామూలుగా నడిపించినా.. ఇంటర్వెల్ బ్యాంగ్ నుంచి ఆతర్వాత ద్వితీయార్ధంలో సన్నివేశాలను పరిగెత్తించాడు. మంచి టేకింగ్ కు రత్నం మాటలు తోడవ్వడంతో ప్రేక్షకుడికి ఓ మంచి అనుభూతిని కలిగించారు. ఏది ఏమైనా కష్టకాలంలో బోయపాటి శ్రీను తొలి ఆటకే సానుకూలమైన టాక్ సంపాదించుకున్నారు. సింహా తర్వాత ఈ మధ్యకాలంలో సరియైన హిట్ సొంతం చేసుకోలేకపోయిన బాలకృష్ణకు ఊరట కలిగించే చిత్రాన్ని అందించడంలో బోయపాటి సఫలమయ్యారని చెప్పవచ్చు. అయితే చిత్రంలో మితి మీరిన హింస, ఊహలకు అందిన ఫైట్స్ మైనస్ పాయింట్ చెప్పవచ్చు. పక్కా కమర్షియల్ హంగులతో, సెంటిమెంట్ తోపాటు, బాలకృష్ణ ఇమేజ్ ను దృష్టిలో ఉంచుకొని రూపొందించిన లెజెండ్ చిత్రం 'సింహా-2' అని చెప్పవచ్చు.