15 మంది మావోయిస్టుల లొంగుబాటు
ఛత్తీస్గఢ్: ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో 15 మంది మావోయిస్టులు శుక్రవారం లొంగిపోయారు. బస్తర్ అటవీ ప్రాంతంలోని జగదల్పూర్ పోలీసులు ఎదుట మావోయిస్టులు లొంగిపోయారు. లొంగిపోయిన మావోయిస్టులు తమ ఆయుధాలను పోలీసులకు అప్పగించారు. లొంగిపోయిన వారిపై ఉన్న రివార్డును వారికి అందజేస్తామని పోలీసులు తెలిపారు. లొంగిపోయిన మావోయిస్టుల వివరాలు తెలియాల్సి ఉంది.