in jagityala
-
అన్నను చంపిన తమ్ముడి అరెస్టు
జగిత్యాల రూరల్ : ఆస్తికోసం అన్నను హత్య చేసిన తమ్ముడిని జగిత్యాల పోలీసులు శనివారం అరెస్టు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. మండలంలోని గుల్లపేటకు చెందిన భూపతి ఎల్లయ్య, బుచ్చవ్వలకు ముగ్గురు కొడుకులు. వీరికి 8.30 ఎకరాల భూమి ఉంది. రెండో కుమారుడు లచ్చన్న మతమార్పిడి అయ్యాడు. ఆగ్రహానికి గురైన ఎల్లయ్య మిగిలిన కుమారులు భూపతి రామన్న, భూపతి లింగన్న పేరిట ఏడెకరాలు పట్టా చేయించారు. అప్పటి నుంచి వీరి కుటుంబంలో గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో పంచాయితీ నిర్వహించగా.. ఉపాధి కోసం బెహరాన్ వెళ్లిన లింగన్న స్వగ్రామానికి వచ్చాడు. ఈనెల 10న పంచాయితీ జరుగుతుండగానే.. లింగన్న లచ్చన్నపై కట్టెతో దాడిచేశాడు. తీవ్రంగా గాయపడిన లచ్చన్నను స్థానికులు ఆసుపత్రికి తరలించారు. ఆయన చికిత్స పొందుతుండగానే లింగన్న తిరిగి బెహరాన్ వెళ్లిపోయాడు. ఈ క్రమంలో లచ్చన్న (45) ఈనెల 24న చికిత్స పొందుతూ చనిపోయాడు. ఈ కేసులో ప్రధాన నిందితుడైన లింగన్నను రప్పించేందుకు పోలీసులు ఆయన కుటుంబసభ్యుల ద్వారా ఒత్తిడితెచ్చారు. దీంతో ఆయన శుక్రవారం బెహరాన్ నుంచి స్వదేశానికి రాగా.. పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వివరించారు. -
డూప్‌ల సందడి
జగిత్యాల అర్బన్ : ఈ చిత్రం చూడండి.. అచ్చం సినీ హీరోలు విక్టరీ వెంకటేశ్, దివంగత నాగేశ్వర్రాలా కనిపిస్తున్నారు కదూ.. అవును అట్లే కనిపిస్తున్నారు. విజయనగరంకు చెందిన రవిచంద్రన్ (వెంకటేశ్ డూప్), హైదరాబాద్‌కు చెందిన నగేశ్ (నాగేశ్వర్రావు డూప్) జగిత్యాలలో జరిగిన ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చారు. ఈ సందర్భంగా పట్టణానికి చెందిన కళాశ్రీ అధినేత గుండేటి రాజు, బానుక రవి, అభి డూప్‌లను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో తిరునహరి, విజయ్, భానుక శ్రీనివాస్, అమూల్య రవి తదితరులు పాల్గొన్నారు.