Jaguar movie
-
‘జాగ్వార్’తో ‘గుండెజారి గల్లంతయ్యిందే’ డైరెక్టర్!
కర్ణాటక సీఎం కుమారస్వామి కుమారుడు నిఖిల్ గౌడ జాగ్వార్ మూవీతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కానీ అది బెడిసికొట్టడంతో నిఖిల్ వచ్చిన సంగతిని ఎవరూ పట్టించుకోలేదు. కానీ కన్నడలో మాత్రం నిఖిల్ బిజీగానే ఉన్నాడు. అయితే ఈ కన్నడ హీరోను మన టాలీవుడ్ దర్శకుడు డైరెక్ట్ చేయబోతున్నాడు. ‘గుండెజారి గల్లంతయ్యిందే’ మూవీతో హిట్ కొట్టిన విజయ్‌కుమార్ కొండ.. ఆ తరువాత ‘ఒక లైలా కోసం’ చిత్రాన్ని తెరకెక్కించారు. నాగచైతన్య, పూజా హెగ్డే కాంబోలో వచ్చిన ఈ సినిమా ఫర్వాలేదనిపించినా.. మళ్లీ ఇంతవరకు మరో ప్రాజెక్టును పట్టాలెక్కించలేకపోయాడు. శ్యాండిల్‌వుడ్‌లో తన ప్రతిభను చాటుకుని.. టాలీవుడ్ మళ్లీ అవకాశాలను పొందేందుకు ప్రయత్నిస్తున్నాడేమో దర్శకుడు విజయ్. దీనిలో భాగంగానే నిఖిల్ గౌడతో సినిమా చేయబోతున్నాడని సమాచారం. ప్రస్తుతం నిఖిల్ సీతారామ కళ్యాణ, కురుక్షేత్ర సినిమాలో అభిమన్యుడిగా నటిస్తూ బిజీగా ఉన్నాడు. -
ఓటమి భయంతో బాలకృష్ణ ఏం మాట్లాడుతున్నాడో..
దొడ్డబళ్లాపురం: మాగడి నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థి బాలకృష్ణ తనకు సంబంధించిన సీడీ ఏదో విడుదల చేస్తానని బెదిరిస్తున్నాడని, బహుశా అది నా మొదటి సినిమా జాగ్వార్ సీడీనే అయ్యుంటుందని కుమారస్వామి కుమారుడు నిఖిల్‌గౌడ ఎద్దేవా చేసాడు. శుక్రవారం మాగడి పట్టణంలో రోడ్‌షో నిర్వహించి జేడీఎస్ అభ్యర్థి ఎ మంజుకు మద్దతుగా ఎన్నికల ప్రచారం చేసిన నిఖిల్ ఈ సందర్భంగా బాలకృష్ణ వ్యాఖ్యలను గుర్తుచేస్తూ ప్రసంగించారు. తాను సీడీలు విడుదల చేసేంత గొప్ప పనులు ఏం చేయలేదన్నారు. ఓటమి భయంతో బాలకృష్ణ ఏం మాట్లాడుతున్నాడో ఆయనకే తెలీడంలేదన్నారు. అందుకే జేడీఎస్ అభ్యర్థి క్రమ సంఖ్యలను మార్పు చేసి తప్పుడు పప్రచారం చేస్తూ ఓటర్లను తప్పుదారి పట్టించాలని చూస్తున్నాడని, ఓటర్లు ఓటు వేసే సమయంలో జాగ్రత్తగా వ్యవహరించాలని కోరారు. ఇందుకు సంబంధించి క్రిమినల్ కేసు నమోదు చేస్తామని చెప్పారు. -
‘జాగ్వార్’ ని ఎలా అడ్డుకుంటారో చూస్తా..
బెంగళూరు : కన్నడ చలనచిత్ర రంగంలోని కొంత మంది కారణంగా శాండిల్‌వుడ్ పరిశమ్ర అప్రతిష్ట పాలవుతోందని కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్డీ కుమారస్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన స్వీయ నిర్మాణంలో తన కుమారుడు నిఖిల్ హీరోగా వెండితెరకు పరిచయం చేస్తూ జాగ్వార్ చిత్రాన్ని నిర్మించిన విషయం తెలిసిందే. ఆ చిత్రం సక్సెస్ మీట్లో ఆయన మాట్లాడుతూ... ఇదే నెలలో దీపావళీ విడుదల కానున్న ఇద్దరు అగ్రనటుల సినిమాల విడుదల కారణంగా జనాదరణ పొంది, ఇప్పటికీ హౌస్‌ఫుల్ కలెక్షన్లతో నడుస్తున్న జాగ్వార్ చిత్రం థియేటర్ల నుంచి తొలగించడానికి కొంతమంది ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. తాను కూడా గతంలో ఎన్నో చిత్రాలకు డిస్ట్రిబ్యూటర్‌గా వ్యవహరించానని, ఇతర చిత్రాలకు నష్టం వాటిల్లకుండా అప్పటికి అందుబాటులో ఉన్న థియేటర్లలో తమ చిత్రాలను విడుదల చేసుకునే వాళ్లమని గుర్తు చేశారు. తమ పరిస్థితే ఇలా ఉంటే ఇక చిన్న నిర్మాతల పరిస్థితి ఏమిటని ఆయన ప్రశ్నించారు. విడుదలైన అన్ని చోట్ల విజయవంతంగా ప్రదర్శిమవుతున్న జాగ్వార్ చిత్రాన్ని ఏ విధంగా అడ్డుకుంటారో తాను చూస్తానని హెచ్చరించారు. ఆర్థికంగా బలంగా ఉన్న కొంత మంది వ్యక్తుల చేతుల్లో కన్నడ ఇండస్ట్రీ నలిగిపోతోందని దీనిని ఇకపై ఏమాత్రం సహించేది లేదని స్పష్టం చేశారు. జాగ్వార్ చిత్రాన్ని త్వరలో అమెరికా, యూకే, ఆస్ట్రేలియా తదితర దేశాల్లో కూడా విడుదల చేయనున్నట్లు కుమారస్వామి తెలిపారు. ఈ కార్యక్రమంలో హీరో నిఖిల్‌గౌడ, నటుడు సంపత్ తదితరులు పాల్గొన్నారు. -
సినిమా బాగా నచ్చిందట: నిఖిల్
బెంగళూరు: కన్నడ సినీ చరిత్రలోనే అత్యంత భారీ వ్యయంతో నిర్మించిన జాగ్వార్ చిత్రంతో కన్నడ, తెలుగు భాషల్లో ఒకేసారి అడుగుపెట్టిన మాజీ ముఖ్యమంత్రి కుమారుడు నిఖిల్‌గౌడ తన మొదటి చిత్రంతోనే కన్నడనాట భారీ అభిమానగణాన్ని సొంతం చేసుకున్నాడు. జాగ్వార్ చిత్రంతో ఘనవిజయం సాధించడంతో చిత్రం ప్రచారంతో పాటు అభిమానులను కలుసుకునేందుకు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తున్న అతడు మంగళవారం తన మనసులోని భావాలను మీడియాతో పంచుకున్నాడు. మొదటి చిత్రంతోనే కన్నడ ప్రజలు తనను చాలా బాగా ఆదరించారన్నారు. సినిమా బాగా నచ్చిందని ఇటీవల ఓ ప్రైవేటు సంస్థలో పని చేసే ఉత్తరాదికి చెందిన ఉద్యోగులు పేర్కొనడం సంతోషాన్నిచ్చిందని తెలిపాడు. జాగ్వార్ సినిమాను ఇంకా బాగా తెరకెక్కించి ఉంటే ప్రేక్షకుల్లోకి మరింత చొచ్చుకెళ్లేదన్నాడు. మొదటి చిత్రంతో చాలా నేర్చుకున్నానని, దొర్లిన తప్పులను రెండవ చిత్రంలో పునరావృతం కాకుండా మరింత శిక్షణ తీసుకోవాలని నిర్ణయించుకున్నానని చెప్పాడు. కన్నడ సినీ ఇండస్ట్రీకి మంచి ప్రతిభావంతులను పరిచయం చేసే ఉద్దేశంతో కొత్త స్టూడియోను నిర్మించనున్నామని, అందులో కంప్యూటర్ గ్రాఫిక్స్, అధునాతన డబ్బింగ్ టెక్నాలజీ తదితర సాంకేతికత సౌకర్యాలను కల్పించనున్నట్లు నిఖిల్ గౌడ పేర్కొన్నాడు. కాగా అతడు నటించబోయే రెండవ చిత్రానికి రేసుగుర్రం, ఊసరవెల్లి,కిక్ తదితర హిట్ చిత్రాలకు దర్శకత్వం వహించిన టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు సురేందరరెడ్డి దర్శకత్వం వహించనున్నారని సమాచారం.