Jai Jagan
-
నంద్యాలలో జై జగన్ నినాదాలతో హోరెత్తించిన విద్యార్థులు
-
టీడీపీ కార్యాలయంలో జై జగన్ అంటూ నినాదాలు..
చిత్తూరు జిల్లా: టీడీపీలో ఉన్న వర్గవిభేదాలు తారాస్థాయికి చేరినట్లు తెలుస్తోంది. నాయకులు ఏకంగా పార్టీ కార్యాలయంలోనే చంద్రబాబు వైఖరిపై విమర్శలు కురిపించిన వీడియో తాజాగా వెలుగులోకి వచ్చింది. మదనపల్లె టీడీపీ కార్యాలయంలో చంద్రబాబును బూతులు తిడుతూ టీడీపీ నేత విద్యాసాగర్ ఆగ్రహావేశం వ్యక్తం చేశారు. జై జగన్ అంటూ పార్టీ కార్యాలయంలోనే నినాదాలు చేశారు. టీడీపీ నేత విద్యాసాగర్.. తమ పార్టీ అధినేత చంద్రబాబుపై ఈ సందర్భంగా వ్యగ్యాంస్త్రాలు సంధించారు. వయసైపోయాక బాబుకి వేపకాయంత వెర్రి వచ్చిందని మాట్లాడారు. బస్టాండ్‌లో టీడీపీ జెండా తగులబెడతానని అన్నారు. జగన్ మాకేమీ ద్రోహం చేయలేదు.. జై జగన్.. అంటూ నినాదాలు చేశారు. ఈ వీడియోకు సంబంధించిన ఘటన కొన్ని రోజుల క్రితం జరగగా.. ప్రస్తుతం వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇదీ చదవండి: పార్లమెంట్ సాక్షిగా బయటికొచ్చిన వాస్తవాలు -
పవన్‌కు చేదు అనుభవం.. ‘జై జగన్’ అంటూ ఫ్యాన్స్ నినాదాలు
సాక్షి, కృష్ణా: జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ శనివారం ఏలూరు జిల్లా పర్యటనకు వచ్చారు. రోడ్ షో సందర్భంగా కారులో వెళ్లుండగా బాపులపాడు మండలం హనుమాన్ జంక్షన్ వేలేరు అడ్డ రోడ్డు దగ్గర అభిమానులు పవన్‌కు పూలతో స్వాగతం పలికారు. ఈ క్రమంలో జై జగన్.. జై జగన్ అంటూ ఫ్యాన్స్ నినాదాలు చేశారు. -
వైఎస్సార్సీపీకే జెడ్పీ పీఠం
-
వైఎస్సార్సీపీకే జెడ్పీ పీఠం
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: పట్టణాల్లో వైఎస్సార్ సీపీకి ఆధిక్యత ఇచ్చిన జిల్లా ప్రజలు పల్లెల్లోనూ జై జగన్ నినాదం చేశారు. కడపటి వార్తలు అందేసరికి జిల్లా పరిషత్ చైర్మన్ స్థానాన్ని కైవసం చేసుకునేందుకు అవసరమైన 24 మ్యాజిక్ ఫిగర్‌ను వైఎస్సార్సీపీ కైవసం చేసుకుంది. 26 మండలాల్లో వైఎస్సార్సీపీ పూర్తి మెజారిటీ సాధించింది. వైఎస్సార్సీపీ నుంచి జెడ్పీ చైర్మన్ అభ్యర్థిగా ఆత్మకూరు నుంచి పోటీచేసిన బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి 2395 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు. టీడీపీ చైర్మన్ అభ్యర్థిగా సూళ్లూరుపేట నుంచి బరిలోకి దిగిన వేనాటి రామచంద్రారెడ్డి 2205 ఓట్లతో గెలుపొందారు. ఆత్మకూరు, సర్వేపల్లి నియోజకవర్గాల్లో వైఎస్సార్సీపీకి ఏకపక్ష ఓటింగ్ జరిగి మండలాలు, జెడ్పీటీసీలను స్వీప్ చేసింది. సూళ్లూరుపేట నియోజకవర్గం పెళ్లకూరు మండలంలో 10 ఎంపీటీసీలకు 10 స్థానాలు గెలిచి వైఎస్సార్సీపీ స్వీప్ చేసింది. కావలి పోలింగ్ కేంద్రంలో బ్యాలెట్ బాక్సు ల్లో చెదలు చేరడంతో ఏర్పడిన వివాదం కారణంగా ఈ కేంద్రంలో ఓట్ల లెక్కింపు సాయంత్రం 4 గంటలకు ప్రారంభమైంది. మిగిలిన కేంద్రాల్లో కూడా ఉదయం 8 గంటల నుంచే బ్యాలెట్ బాక్సులను లెక్కింపు కేంద్రాల్లోకి తీసుకుని వచ్చినా పార్టీల వారీగా బ్యాలెట్లు వేరు చేసి కట్టలు కట్టడంలో తీవ్ర ఆలస్యం జరిగి ఉదయం 11 గంటలకు కానీ ఓట్ల లెక్కింపు ప్రారంభం కాలేదు. కాంగ్రెస్ పార్టీ ఒక్క మండలం కానీ, ఒక్క జెడ్పీటీసీ స్థానం కానీ గెలవలేకపోవడం గమనార్హం. చైర్మన్ పీఠం వైఎస్సార్సీపీదే జిల్లాలో 46 జెడ్పీటీసీ స్థానాల్లో 24 మ్యాజిక్ ఫిగర్ గెలుచుకుని వేనాటి రామచంద్రారెడ్డిని జెడ్పీ చైర్మన్ చేయడానికి టీడీపీ రంగంలోకి దించింది. ఎన్నికల్లో భారీ ఎత్తున డబ్బులు ఖర్చుచేసి ఎక్కడి కక్కడ వైఎస్సార్సీపీని కట్టడి చేయడానికి తీవ్రంగా కష్టపడింది. అయితే ఆ పార్టీని పల్లె జనం ఆదరించలేదు. వైఎస్సార్ సీపీ మాజీ ఎమ్మెల్సీ, పార్టీ సీఈసీ సభ్యుడు బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డిని బరిలోకి దించింది. ఓట్ల లెక్కింపునకు ముందే టీడీపీ జెడ్పీ చైర్మన్ పదవి మీద ఆశలు వదులుకుంది. అయితే దింపుడు కల్లం ఆశతో ధీమా వ్యక్తం చేస్తూ వచ్చింది. జెడ్పీటీసీ ఫలితాల వెల్లడి ప్రారంభం అవుతూనే జెడ్పీ ఇక తమది కాదని టీడీపీ నిర్ణయించుకుంది. వైఎస్సార్సీపీ గెలిచిన జెడ్పీటీసీలు 1. బాలాయపల్లి 2.చిల్లకూరు 3. ఆత్మకూరు 4. సంగం 5. మనుబోలు 6. డి.వి.సత్రం 7. సీతారాంపురం 8. మర్రిపాడు 9. వాకాడు 10.పెళ్లకూరు 11. ఏఎస్ పేట 12. చిట్టమూరు 13 ఉదయగిరి 14. వెంకటాచలం 15. కోట 16. చేజర్ల 17. టీపీ గూడూరు 18 అనంతసాగరం 19 చిట్టమూరు, 20. కావలి రూరల్, 21 ముత్తుకూరు, 22 వింజమూరు టీడీపీ గెలిచిన జెడ్పీటీసీలు 1. వరికుంటపాడు 2. వెంకటగిరి 3.సూళ్లూరుపేట 4.దుత్తలూరు 5.డక్కిలి 6.నెల్లూరు రూరల్ 7.నాయుడుపేట 8. ఓజిలి 9.తడ 10.విడవలూరు వైఎస్సార్సీపీ గెలిచిన మండలాలు 1. నెల్లూరు రూరల్ 2. ఆత్మకూరు 3. సంగం 4. బాలాయపల్లి 5. మర్రిపాడు 6. వాకాడు 7. వింజమూరు 8. సీతారాంపురం 9. ఉదయగిరి 10. అల్లూరు 11. కొడవలూరు 12. ముత్తుకూరు 13. వెంకటాచలం 14. టీపీ గూడూరు 15.మనుబోలు 16. పెళ్లకూరు 17. కలువాయి 18. కోట 19. గూడూరు రూరల్ 20. డివిసత్రం 21. సూళ్లూరుపేట 22. జలదంకి 23.తడ 24. అనంతసాగరం 25. సైదాపురం, 26 బోగోలు టీడీపీకి దక్కిన మండలాలు 1. వరికుంటపాడు 2. డక్కిలి 3. నాయుడుపేట 4.చిట్టమూరు 5.కొండాపురం 6. విడవలూరు 7. చిట్టమూరు 8. కోవూరు 9. దుత్తలూరు 10. కలిగిరి 11. ఓజిలి 12. ఏఎస్ పేట 13. కావలి రూరల్ వెంకటగిరిలో చెరో 4 వెంకటగిరి మండలంలోని 8 ఎంపీటీసీ స్థానాల్లో 4 వైఎస్సార్సీపీ 4 టీడీపీ గెలిచింది. దీంతో ఇక్కడ ఫలితం ఎలా ఉంటుందన్నది ఆసక్తికరంగా మారింది. ఎమ్మెల్యేకి మండల పరిషత్‌లో ఓటు హక్కు కల్పిస్తే ఈ ఫలితం ఎటు ఉంటుందో చెప్పలేని పరిస్థితి. చిల్లకూరు, బుచ్చి వైఎస్సార్సీపీవైపే చిల్లకూరు మండలంలోని 15 ఎంపీటీసీ స్థానాల్లో వైఎస్సార్సీపీ 6 గెలుచుకుంది. టీడీపీ 5 దక్కించుకోగా కాంగ్రెస్ 2, స్వతంత్రులు 2 స్థానాలు గెలుపొందారు. అయితే ఇందులో ఒక స్వతంత్ర అభ్యర్థి వైఎస్సార్ సీపీకి మద్దతు ఇచ్చేందుకు ముందుకు రానుండటంతో ఈ మండలం కూడా వైఎస్సార్ సీపీ ఖాతాలో పడనుంది. బుచ్చిరెడ్డిపాళెం మండలంలో 22 ఎంపీసీటీ స్థానాలకు గాను వైఎస్సార్ సీపీ 11, టీడీపీ 8 సీపీఎం 2 బీజేపీ 1 స్థానం గెలుపొందాయి. ఇక్కడ సీపీఎం లే దా బీజేపీ అభ్యర్థి ఒకరు వైఎస్సార్సీపీ వైపు నడిస్తే ఆ పార్టీ ఈ మండలాన్ని కూడా దక్కించుకుంటుంది. -
ఊరూ వాడా సంబరం
జగనన్న వచ్చేశాడు.. 484 రోజుల నిరీక్షణ ఫలించింది.. మంగళవారం సాయంత్రం హైదరాబాద్‌లో చంచల్‌గూడ జైలు నుంచి జననేత జగన్ విడుదలవగానే ఊరూ వాడ జగన్నినాదాలతో హోరెత్తింది. మహిళలు, వృద్ధులు, చిన్నారులు సైతం రోడ్డుపై కొచ్చి ‘జై జగన్’ అంటూ నినాదాలు చేశారు.. మిఠాయిలు పంచుకున్నారు.. నృత్యం చేశారు. సాక్షి, అనంతపురం : జననేత వైఎస్ జగన్మోహన్రెడ్డి జైలు నుంచి విడుదల కావడంతో మంగళవారం జిల్లాలో సంబరాలు అంబరాన్నంటాయి. జగన్ మంగళవారం సాయంత్రం నాలుగు గంటలకు హైదరాబాద్‌లోని చంచల్‌గూడ జైలు నుంచి అడుగు బయటపెట్టగానే.. జిల్లా వ్యాప్తంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ‘జై..జగన్’ అంటూ పెద్దఎత్తున నినదించారు. రంగులు చల్లుకుంటూ.. మిఠాయిలు, కేకులు పంచిపెడుతూ సంబరాలు చేసుకున్నారు. వైఎస్సార్సీపీ నేత ఎర్రిస్వామిరెడ్డి కుమారుడు యోగీశ్వరరెడ్డి ఆధ్వర్యంలో అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రిలోని రోగులకు పండ్లు పంచిపెట్టారు. పార్టీ జిల్లా మహిళా అధ్యక్షురాలు బోయ సుశీలమ్మ, నగర అధ్యక్షురాలు శ్రీదేవి ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. స్థానిక సుభాష్ రోడ్డులోని వైఎస్ విగ్రహం వద్ద కేక్ కట్ చేసి పంచిపెట్టారు. ఈ కార్యక్రమానికి ఎర్రిస్వామిరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మాజీ కార్పొరేటర్ టీవీ చంద్రమోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో నగరంలో భారీ బైక్ ర్యాలీ చేపట్టారు. పార్టీ కార్యాలయంలో నాయకులు, కార్యకర్తలు కేక్ కట్ చేశారు. 45వ డివిజన్లో పార్టీ జిల్లా సాంస్కృతిక విభాగం అధ్యక్షుడు రిలాక్స్ నాగరాజు ఆధ్వర్యంలో భారీ ఎత్తున బాణాసంచా కాల్చారు. మిఠాయిలు పంచిపెట్టారు. కళ్యాణదుర్గం రోడ్డులోని రాజా హోటల్ వద్ద జగన్ అభిమానులు దాదాపు రెండు వేల మందికి అన్నదానం చేశారు. ధర్మవరం పట్టణంలో పార్టీ జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు రవితేజారెడ్డి, భాస్కర్‌రెడ్డి ఆధ్వర్యంలో స్వీట్లు పంచి పెట్టారు. పార్టీ నాయకులు గుండా ఈశ్వరయ్య, ఓబిరెడ్డి, బొమ్మా హరి ఆధ్వర్యంలో పట్టణంలోని మారుతీ రాఘవేంద్ర స్వామి, షిరిడీ సాయి ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. హిందూపురంలో వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త కొండూరు వేణుగోపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ చేపట్టారు. అనంతరం వైఎస్ విగ్రహం వద్ద నివాళులర్పించి... ప్రజలకు స్వీట్లు పంచిపెట్టారు. చిలమత్తూరులో వైఎస్సార్సీపీ నాయకులు ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. కదిరిలో పార్టీ నాయకులు వజ్ర భాస్కర్‌రెడ్డి ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం, ఫర్హానాఫయాజ్, బయప్ప, లోకేశ్వర్‌రెడ్డి, చాంద్‌బాషా ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. మడకశిర మండలం కదిరేపల్లిలో ప్రజలు బాణాసంచా కాల్చి.. సంబరాలు జరుపుకున్నారు. అమరాపురం, నాగోనహళ్లి, తమడేపల్లిలో కేకులు కట్ చేసి, అన్నదానం చేశారు. రాప్తాడు, కనగానపల్లి, ఆత్మకూరు, రామగిరి, శింగనమల, పుట్లూరు, అగళి, గుడిబండ, ఓడీచెరువు, విడపనకల్లులో సంబరాలు మిన్నంటాయి. రొళ్లలో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు ర్యాలీ నిర్వహించారు. వైఎస్ విగ్రహం వద్ద నివాళులర్పించారు. పుట్టపర్తి, కొత్తచెరువులో వైఎస్సార్సీపీ నాయకుడు మాణిక్యం బాబా పేద మహిళలకు చీరలు పంపిణీ చేశారు. పుట్టపర్తిలో పార్టీ నాయకుడు డాక్టర్ హరికృష్ణ ఆధ్వర్యంలో పేదలకు అన్నదానం చేశారు. పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. పుట్టపర్తి, కొత్తచెరువు, బుక్కపట్నం మీదుగా బైక్ ర్యాలీ చేపట్టారు. అమడగూరు చౌడేశ్వరి ఆలయంలో వైఎస్సార్సీపీ నాయకులు ప్రత్యేక పూజలు చేశారు. పెనుకొండ, రొద్దంలో ర్యాలీ నిర్వహించి... స్వీట్లు పంచారు. తాడిపత్రిలో వైఎస్సార్సీపీ నాయకుడు మున్నా ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. పోలీసుసర్కిల్లో మానవహారం నిర్మించి వృద్ధులకు పండ్లు, ప్రజలకు స్వీట్లు పంచిపెట్టారు. తాడిపత్రి పరిధిలోని పులిపొద్దుటూరులో గ్రామస్తులు ప్రత్యేక పూజలు చేశారు. పెద్దవడుగూరు శివాలయంలో వైఎస్సార్సీపీ నాయకులు ప్రత్యేక పూజలు చేసి... ర్యాలీ నిర్వహించారు. యాడికిలో ర్యాలీ చేశారు. ఉరవకొండలో పార్టీ యువజన విభాగం ఆధ్వర్యంలో ర్యాలీ చేపట్టారు. జగన్‌కు అంతా మంచే జరగాలని దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. వెంకటాంపల్లి పెద్ద తండాలో గిరిజనులు సంబరాలు చేసుకున్నారు. పార్టీ నాయకుడు ప్రణయ్‌కుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి పంచిపెట్టారు. -
జన ఘన సంబరం
* జగన్‌కు బెయిల్ మంజూరుతో రాష్ట్ర వ్యాప్తంగా పండుగ వాతావరణం * వైఎస్ఆర్ సీపీ శ్రేణుల్లో ఉరిమిన ఉత్సాహం సాక్షి నెట్వర్క్: పల్లె, పట్నం ఏకమయ్యాయి.. వాడవాడలు మార్మోగాయి.. ఎక్కడ చూసినా సంబరాలే.. ఎవరిని కదిపినా జగన్నినాదమే..! వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డికి బెయిల్ వచ్చిందన్న విషయం తెలియగానే రాష్ట్రవ్యాప్తంగా సంబరాలు అంబరాన్ని తాకాయి. పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు, రైతులు, వ్యాపారులు, విద్యార్థులు, మహిళలు పండుగ చేసుకున్నారు. బాణసంచా పేల్చుతూ, రంగులు చల్లుకుంటూ, డ్యాన్స్‌లు చేస్తూ, మిఠాయిలు పంచుతూ హర్షాతిరేకాలు వ్యక్తంచేశారు. చిన్నాపెద్దా తేడా లేకుండా పెద్దఎత్తున జనం, కార్యకర్తలు రోడ్లపైకి వచ్చి ‘జై జగన్’ అంటూ నినాదాలు చేశారు. ఒకరికొకరు అభినందనలు తెలుపుకున్నారు. యువకులు ఆనందంతో బైక్ ర్యాలీలు తీశారు. రంగులు చల్లుకుంటూ సంబరాల్లో మునిగిపోయారు. పార్టీ నేతలు వైఎస్ విగ్రహాలకు పాలాభిషేకం చేశారు. వైఎస్సార్ జిల్లాలో అన్నిచోట్ల పండుగ వాతావరణం కనిపించింది. కడపలో పార్టీ జిల్లా కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున నేతలు, కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. గుంటూరు జిల్లాలో అనేక సెంటర్లలో కార్యకర్తలు, నాయకులు టపాసులు కాల్చారు. విశాఖ జిల్లాలో పలుచోట్ల ప్రజలు దేవాలయాల్లో పూజలు చేసి, మిఠాయిలు పంచుకున్నారు. విశాఖలో విద్యార్థులు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. చిత్తూరు జిల్లా తిరుపతి తుడా సర్కిల్లో ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి, పార్టీ నేతలు టపాకాయలు కాల్చుతూ సంబరాలు చేసుకున్నారు. మదనపల్లెలో ఎమ్మెల్సీ దేశాయ్ తిప్పారెడ్డి ఆధ్వర్యంలో అభిమానులు, పార్టీ కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. పలమనేరులో మాజీ ఎమ్మెల్యే అమరనాథరెడ్డి ఆధ్వర్యంలో 5 వేల మందితో భారీ ర్యాలీ నిర్వహించారు. కృష్ణా జిల్లా విజయవాడలోని వైఎస్సార్సీపీ కార్యాలయం ముందు నేతలు, కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. అనంతపురం జిల్లాలో పార్టీ కార్యకర్తలు ‘ఈరోజే అచ్చమైన దీపావళి’ అంటూ బాణసంచా కాల్చుతూ ఆనందం వ్యక్తంచేశారు. రాయదుర్గంలో ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి, ఆయన సతీమణి కాపు భారతి నేతృత్వంలో ర్యాలీ జరిగింది. నెల్లూరు, పశ్చిమగోదావరి, తూర్పుగోదావరి, విజయనగరం, కర్నూలు, ప్రకాశం శ్రీకాకుళం జిల్లాల్లో సంబరాలు మిన్నంటాయి. వరంగల్ జిల్లా జనగామ, స్టేషన్‌ఘన్‌పూర్, వర్ధన్నపేట, నర్సంపేట, ములుగు, మహబూబాబాద్‌లో కార్యకర్తలు టపాసులు కాల్చి, స్వీట్లు పంపిణీ చేశారు. కరీంనగర్, రంగారెడ్డి, నిజామాబాద్ జిల్లాలోని అనేక ప్రాంతాలు సంబరాలతో హోరెత్తిపోయాయి. మహబూబ్‌నగర్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాలో కార్యకర్తలు ఆనందంలో మునిగిపోయారు. నల్లగొండ జిల్లావ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. జగన్ అక్రమ అరెస్టును నిరసిస్తూ ఆ పార్టీ నాయకులు యాదగిరిగుట్టలో చేపట్టిన దీక్షలు సోమవారం నాటికి ఏకధాటిగా 483 రోజుల పాటు కొనసాగాయి. జగన్ విడుదలయ్యేంత వరకు దీక్ష కొనసాగిస్తామని చెప్పినట్టుగానే చివరిదాకా దీక్షలు నిర్వహించారు. మంగళవారం పార్టీ జిల్లా నేతల ఆధ్వర్యంలో దీక్షలు విరమించాలని నిర్ణయించారు. మెదక్ జిల్లా సంగారెడ్డిలో కార్యకర్తలు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. సిద్దిపేట అంబేద్కర్ సర్కిల్లో పార్టీ నేతలు బాణసంచా కాల్చారు. తమిళనాడు, కర్ణాటకలోనూ.. జగన్‌కు బెయిల్ మంజూరు కావడంతో తమిళనాడులోని చెన్నైలో అభిమానులు సంబరాలు చేసుకున్నారు. వైఎస్ఆర్సీపీ తమిళనాడు విభాగం నేతలు శరత్, శరవణన్, జాకీర్‌హుస్సేన్ తదితరులు భారీ జనసందోహంతో రోడ్లపైకి చేరుకున్నారు. కర్ణాటకలో కూడా అభిమానులు హర్షం వ్యక్తంచేశారు. బెంగళూరులోని యలహంక, బొమ్మనహళ్లి, మారతహళ్లి, ఎలక్ట్రానిక్ సిటీ కత్రిగుప్పెలతో పాటు బళ్లారి, హొసూరు తదితర ప్రాంతాల్లో అభిమానులు స్వీట్లు పంచుకున్నారు. సమైక్య భేరిలో జగన్నినాదం అనంతపురంలోని శ్రీకృష్ణదేవరాయవర్సిటీలో సోమవారం నిర్వహించిన సమైక్య భేరిలో జై.. జగన్ నినాదాలు మార్మోగాయి. సమైక్య భేరి జరుగుతున్న సమయంలో ఓ విద్యార్థి సభాస్థలి వద్దకు వచ్చి..నాంపల్లి సీబీఐ కోర్టు జననేత వైఎస్ జగన్మోహన్రెడ్డికి బెయిల్ మంజూరు చేసిందన్న విషయం ప్రకటించగానే.. అక్కడున్న విద్యార్థులు ఒక్కసారిగా పైకి లేచి పెద్ద ఎత్తున జై జగన్ అంటూ నినదించారు. సమైక్యాంధ్ర కోసం జైల్లో కూడా జగన్ ఆమరణ నిరాహార దీక్ష చేశారని గుర్తు చేసుకుంటూ జైజై జగన్ అని వేలాది గొంతులు నినదించడంతో వర్సిటీ ప్రాంగణం దద్దరిల్లింది.