jail officials
-
పండుగ పూట పచ్చి అసత్యాలతో చంద్రబాబు 'నకిలీ' విన్యాసాలు
-
ఆ జైలు భలే భలే.. అడిగినప్పుడల్లా వీడియో కాల్.. కోరినప్పుడల్లా..
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: కోరినప్పుడల్లా బిర్యానీ.. ప్రత్యేక మెనూతో భోజనాలు.. అడిగిన వెంటనే వీడియోకాల్.. బోర్ కొడితే ఆసుపత్రిలో హెల్త్ చెకప్ పేరుతో బయట షికార్లు.. సంగారెడ్డి జిల్లా జైలులో రిమాండ్‌లో ఉన్న కొందరు ఖరీదైన ఖైదీలకు అందుతున్న రాజభోగాలివి.. ఈ సౌకర్యాలు కల్పించినందుకు జైలులో కొందరు అధికారులకు పెద్ద మొత్తంలో ముడుపులు ముట్టినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ ముడుపుల పంపకాల్లో తేడాలు రావడంతో ఇద్దరు అధికారులు పరస్పరం ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసుకున్నారు. ఈ వ్యవహరంపై ఇటీవల అంతర్గత విచారణ చేపట్టిన జైళ్లశాఖ డీఐజీ మురళీబాబు ఆ శాఖ ఉన్నతాధికారులకు నివేదిక అందించారు. ఈ నివేదిక మేరకు త్వరలో సంబంధిత అధికారులపై చర్యలుండే అవకాశాలున్నట్లు ఆశాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. చదవండి: ఎంతటి విషాదం.. స్కూటీపై వెళుతుండగానే గుండెపోటు.. అక్కడికక్కడే ♦వరంగల్ జైలు ఎత్తివేయడం, ఇటీవల కాలంలో ఎన్డీపీఎస్ కేసులు పెరిగిపోవడంతో రాష్ట్రంలో వివిధ జైళ్లలో రిమాండ్ ఖైదీల సంఖ్య భారీగా పెరిగింది. దీంతో చర్లపల్లి, కూకట్పల్లి జైలు నుంచి కొందరు రిమాండ్ ఖైదీలను సంగారెడ్డి జైలుకు తరలిస్తున్నారు. దీంతో ఈ జైలు రిమాండ్ ఖైదీలతో కిక్కిరిసిపోయింది. ♦సుమారు 300 మంది నుంచి 350 వరకు ఖైదీల సామర్థ్యం కలిగిన ఈ జైలులో ప్రస్తుతం 600 పైగా ఖైదీలున్నారు.హైదరాబాద్ పరిధిలో వివిధ కేసుల్లో రిమాండ్ తరలించిన ఖరీదైన ఖైదీల తాకిడి పెరిగింది. ♦ఇది ఇక్కడి జైలు అధికారులకు వరంగా మారింది. వారికి నిబంధనలకు విరుద్ధంగా సకల సౌకర్యాలు కల్పిస్తూ పెద్ద మొత్తంలో ముడుపులు దండుకుంటున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ♦ఇటీవల కూకట్‌పల్లికి చెందిన ఓ రియల్టర్ రిమాండ్ నిమిత్తం ఈ జైలుకు తలిస్తే జైలులోకి కొందరు అధికారులు రియల్టర్ రిమాండ్ ఖైదీకి సకల సౌకర్యాలు కల్పించారనే ఆరోపణలు గుప్పుమన్నాయి. ♦ఓ పారిశ్రామికవేత్త హత్యకేసులో నిందితులను కూడా ఈ జైలుకే రిమాండ్‌లో ఉంచినట్లు తెలుస్తోంది. ఖరీదైన ఈ నిందితులకు కూడా రాజభోగాలు కల్పించి పెద్ద మొత్తంలో దండుకున్నారనే విమర్శలున్నాయి. జైలు నుంచే మొరం తవ్వకాలు ♦ఈ జైలు ఆవరణ నుంచి పెద్ద మొత్తంలో మొరం అక్రమ తవ్వకాలు జరిగాయి. భద్రతా సిబ్బంది కాపలా కాసే గోడకు అత్యంత సమీపంలోని జైలు స్థలం నుంచి భారీ యంత్రాలతో తవ్వకాలు చేపట్టినా ఈ జైలు ఉన్నతాధికారులు కిమ్మనలేదు. ♦ఈ వ్యవహారంలో కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు రావడంతో మొక్కుబడిగా స్థానిక పోలీసులకు జైలు అధికారులు ఫిర్యాదు చేసి చేతులు దులుపుకున్నారు. ఇప్పుడు ఆ కేసు ఊసేలేదు. సంబంధిత అధికారిపై కనీస చర్యలు లేవు. అంతర్గత విచారణ ♦అక్రమాలకు నిలయంగా మారిన సంగారెడ్డి జైలులో జరుగుతున్న వ్యవహారాలపై ఆశాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదులు అందినట్లు సమాచారం. దీంతో ఆశాఖ డీఐజీ ఇటీవల అంతర్గత విచారణ చేపట్టి ఉన్నతాధికారులకు నివేదిక ఇచ్చినట్లు తెలుస్తోంది. ♦ఈ అంతర్గత విచారణ తూతూ మంత్రంగా సాగిందా, జైలులో జరుగుతున్న అక్రమాలపై విచారణ పకడ్బందీగా జరిగిందా అనేది ఆశాఖ తదుపరి చర్యలబట్టి స్పష్టమవుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. నివేదిక ఇచ్చాం సాధారణ తనిఖీల్లో భాగంగా సంగారెడ్డి జిల్లా జైలును ఇటీవల ఆకస్మిక తనిఖీ చేశాం. ఇద్దరు అధికారుల మధ్య సమన్వయం లేకపోవడంతో ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకున్నారు. విచారణ చేపట్టి, ఉన్నతాధికారులకు నివేదిక ఇచ్చాం. నిబంధనల మేరకు జైలు క్యాంటీన్లో బిర్యానీ ఇస్తారు. వీడియోకాల్, హెల్త్ చెకప్‌లు ఉంటాయి. నిబంధనలు అతిక్రమించి ఈ సౌకర్యాలు కల్పించినట్లు మా దృష్టికైతే రాలేదు. – మురళీబాబు, జైళ్లశాఖ డీఐజీ -
జైలర్ దారుణం.. ఇనుప చువ్వ కాల్చి ఖైదీ వీపుపై ‘ఆత్వాది’ అని..
చండీగఢ్: పంజాబ్‌లోని బర్నాల జిల్లా జైలు అధికారి ఓ ఖైదీ పట్ల వ్యవహరించిన తీరు విస్మయానికి గురిచేస్తోంది. జైలులో కనీస హక్కులకోసం ఎదురు తిరిగిన కరమ్‌జిత్ సింగ్ (28) అనే ఖైదీపై జైలు సూపరింటెండెంట్ బల్బీర్ సింగ్ అమానుష చర్యకు పాల్పడ్డారు. అతని వీపుపై ‘ఆత్వాది’ (పంబాబీలో టెర్రరిస్టు) అనే అక్షరాలను ఇనుప చువ్వను కాల్చి వాతలు పెట్టి చెక్కారు. డజనుకుపైగా కేసుల్లో దోషిగా తేలిన బాలామ్‌ఘర్‌కు చెందిన కరమ్‌జిత్ జిల్లా జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. తాజాగా డ్రగ్స్ కేసుకు సంబంధించి కోర్టులో వాదనలు జరిగినప్పుడు అతను తన గోడును వెళ్లబోసుకున్నాడు. జైలు సూపరింటెండెంట్ బల్బీర్ సింగ్ తనపై విచక్షణా రహితంగా దాడి చేసి.. ఒంటిపై ‘ఆత్వాది’ అని ఇనుప చువ్వతో కాల్చాడని కోర్టు దృష్టికి తేవడంతో విషయం వెలుగుచూసింది. (చదవండి: CID Show: సీఐడీ షో స్ఫూర్తి: దారుణానికి పాల్పడ్డ మైనర్లు) అయితే, ఈ ఆరోపణలను జైలు సూపరింటెండెంట్ తోసిపుచ్చారు. కరమ్‌జిత్ తరచూ నేరాలు చేసి జైలుకొస్తాడని, సానుభూతి కోసం కట్టు కథలు చెబుతాడని అన్నారు. ఇక ఈ విషయంపై పంజాబ్ ఉప ముఖ్యమంత్రి సుఖ్జిందర్ రణ్‌ధావా విచారణకు ఆదేశించారు. ఫిరోజ్‌పూర్ డీఐజీ తేజింద్ సింగ్ మౌర్‌ను విచారణ అధికారిగా నియమించారు. మరోవైపు సిక్కులపై కాంగ్రెస్ ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని, ఘటనకు బాధ్యుడైన జైలు సూపరింటెండెంట్‌ను సస్పెండ్ చేయాలని అకాలీదళ్ అధికార ప్రతినిధి మన్జిందర్ సింగ్ సిర్సా డిమాండ్ చేశారు. (చదవండి: పండుగ పూట విషాదం: కల్తీ మద్యం తాగి 10 మంది మృతి.. మరో 14 మంది..) A jail inmate in Barnala, Karamjit Singh beaten brutally by Jail Superintendent. The word “Attwadi” meaning TERRORIST engraved on his back! This is disgusting and a serious violation of human rights. We demand strict possible action against officials involved @CHARANJITCHANNI Ji https://t.co/mYKcWyPWMh pic.twitter.com/icmiIiBSit — Manjinder Singh Sirsa (@mssirsa) November 3, 2021 -
తీహార్ జైలుకు వెళ్లాలనుకుంటున్నారా..!
న్యూఢిల్లీ: జైలు జీవితం ఎలా ఉంటుందో ప్రత్యక్షంగా చూసి తెలుసుకోవాలని చాలామందికి ఆసక్తి ఉంటుంది. కారాగారంలో ఖైదీల జీవనం ఎలా ఉంటుంది? కరుడుగట్టిన తీవ్రవాదులు జైలులో ఎలా ఉంటారు? వీటన్నింటినీ తెలుసుకోవడంతోపాటు నేరగాళ్లను ప్రత్యేక్షంగా చూడటానికి ఆసియాలోనే అతిపెద్దదైన తీహార్ జైలు సరికొత్త కార్యక్రమాన్ని చేపట్టబోతుంది. ‘తీహార్ టూరిజం’ పేరుతో జైలు చూడాలనే ఆసక్తి ఉన్న సందర్శకులకు అనుమతి ఇవ్వనుంది. దీంతో సందర్శకులు జైలులో ఉండే ఖైదీలను, వారు రోజువారిగా చేసే పనులను, జైలు పరిసరాలను ప్రత్యక్షంగా చూడవచ్చని తీహార్ జైలు అధికారులు తెలిపారు. జైలును సందర్శించి,అక్కడే ఒక రోజుకు పాటు ఖైదీలతో ఉండాలనే ఆసక్తి ఉన్న సందర్శకులకు రూ.500 సాధారణ ఫీజుతో అనుమతి ఇవ్వడానికి కారాగార ఉన్నతాధికారులు నియమ నిబంధనలను రూపొందిస్తున్నారు. ‘సందర్శకులు జైల్లో ఇతర ఖైదీలు ఉన్నట్టుగానే సాధారణంగా ఒక రోజు వారితో జైలు గదిలో ఉండాలి. నేలపైనే నిద్రించాలి. ఉదయాన్నే లేచి వంట చేసుకోవాలి. తమ ప్రాంగణాన్ని శుభ్రపరచాలి. యోగా, ధ్యానం, పెయింటింగ్ వంటి కార్యక్రమాల్లో పాల్గొనాలి. సందర్శకులను ఎప్పటికప్పుడు తనిఖీ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా జైలు లోపలికి సెల్ఫోన్లను అనుమతించబోమని’ తీహార్ జైలు ఉన్నతాధికారి తెలిపారు. కాగా ఖైదీల ప్రవర్తన ఆధారంగా మంచి వారిని మాత్రమే సందర్శకులతో ఉండే విధంగా జాగ్రత్తలు తీసుకుంటామన్నారు. అదే విధంగా ఖైదీలకు ఎటువంటి ఇబ్బందులు కలించరనే నమ్మకం ఉన్న సందర్శకులకు మాత్రమే జైలును సందర్శించే అనుమతి కల్పిస్తామని అధికారులు వెల్లడించారు. సుమారు 400 ఎకరాల విస్తీర్ణంలో 16వేల మంది ఖైదీలున్న తీహార్ జైలు దేశంలో ఉన్నపెద్ద కారాగారం అన్న విషయం తెలిసిందే. ఇటువంటి కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట్రంలోని సంగారెడ్డిలో ‘ఫీల్ ద జైల్’ పేరుతో కారాగాన్ని సందర్శించి అక్కడే ఒక రోజుపాటు ఖైదీలతో ఉండే అవకాశాన్ని జైలు ఉన్నతాధికారులు కల్పిస్తున్న విషయం తెలిసిందే. -
ఇంట్లో కంటే జైలులోనే సకల సౌకర్యాలు
చెన్నై : టీవీలు, బెడ్స్, మొబైల్ఫోన్లు, రుచికరమైన ఆహారం .. ఇవన్నీ ఇంట్లోనే అనుకుంటున్నారా? జైలులో కూడా అనుభవించవచ్చట. చైన్నైలోని పుజ్హల్ కేంద్ర కారాగార ఖైదీలు ఇంట్లో కంటే జైలులోనే ఎక్కువ సౌకర్యాలు అనుభవిస్తున్నారు. పుజ్హల్ కేంద్ర కారాగారానికి సంబంధించి ఫొటోలు ఈ విషయాన్ని రుజువు చేస్తున్నాయి. జైలు అథారిటీలు ఓ ఖైదీ వాడుతున్న ఫోన్‌ను సీజ్ చేయగా... ఈ ఫోటోలు వెలుగులోకి వచ్చాయి. జైలులో ఉన్న తోటి ఖైదీలకు ఈ సౌకర్యాలు కల్పించడంతో పాటు, దానికింద పెద్ద మొత్తంలో డబ్బులు కూడా వసూలు చేస్తున్నట్లు తెలిసింది. జైలులో ఉన్న ఖైదీలు తమ ఇంట్లో ఉండే మాదిరి, సాధారణ దుస్తులు ధరించడంతో పాటు, రుచికరమైన భోజనం, సౌకర్యవంతమైన బెడ్స్, ఎలక్ట్రిక్ కుక్కర్లు, యూపీఎస్ బ్యాటరీలు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు వాడుతున్నట్లు ఈ ఫోటోల ద్వారా తెలిసింది. సెల్ఫోన్లు మినహాయించి ‘ఏ’ క్లాస్ కేటగిరీ ఖైదీలకు ఆ సౌకర్యాలన్నీ అందిస్తారని జైలు అధికారులు తెలుపుతున్నారు. అయితే జైలులో సెల్‌ఫోన్ వాడకంపై వివాదాస్పదమైంది. జైలులో సెల్ఫోన్ల వాడకం పూర్తిగా నిబంధనలకు విరుద్ధం. ‘అందరికి పడకలు ఎప్పుడో అందించాం. ఒక్కో బ్లాక్‌కు ఓ టీవీ కూడా ఉంది. ఇవేవీ అసాధారణం కాదు. కానీ, సెల్ఫోన్లు వాడటమే నిబంధనలకు విరుద్ధం. గత వారం ఏడు ఫోన్లను స్వాధీనం చేసుకున్నాం. దానికి సంబంధించిన విచారణ జరుగుతోంది. ఇవి లోపలికి ఎలా వచ్చాయో అన్నదానిపై దృష్టి సారించాం. దీనిలో ఏ అధికారి ప్రమేయమైనా ఉందని తేలితే తప్పక చర్య తీసుకుంటాం’ అని ఏడీజీపీ అశుతోష్ శుక్లా వెల్లడించారు. పండగ సమయాల్లో ప్రత్యేక ఆహారం తినడానికి అనుమతి ఉందని, ఏ క్లాస్ ఖైదీలకు వాటిపై నిషేధం లేదని అధికారులు వెల్లడించారు. -
ఆ జైలు గదిలో సకల సౌకర్యాలు
ముంబై: గోడకు 40 అంగుళాల ఎల్సీడీ టీవీ, వెస్ట్రన్ స్టైల్ టాయిలెట్, 6 ట్యూబ్‌లైట్లు, 3 ఫ్యాన్లు, బట్టలు ఉతుక్కోవడానికి ప్రత్యేక చోటు, గాలి వెలుతురు బాగా వచ్చేలా పెద్ద కిటికీలు, వాకింగ్ కోసం ఆవరణ, సెల్ నుంచి నేరుగా లైబ్రరీకి వెళ్లడానికి దారి. కింగ్‌ఫిషర్ అధినేత విజయ్‌మాల్యా కోసం మహారాష్ట్ర జైలు అధికారులు చేసిన ఏర్పాట్లు ఇవి. బ్యాంకులకు రూ. 9 వేల కోట్లకు పైగా రుణాలను ఎగ్గొట్టి లండన్ పారిపోయిన మాల్యాను వెనక్కి రప్పించిన తరువాత ఆయన్ని ఉంచే జైలును సీబీఐ సిద్ధం చేసి, దాని వీడియోను బ్రిటన్ కోర్టుకు పంపింది. భారత్‌లో జైళ్లు శుభ్రంగా ఉండవని, అందుకే తాను వెళ్లనంటూ మాల్యా ఆరోపించడం తెల్సిందే. దీంతో మాల్యాను ఉంచబోయే జైలు గదిని వీడియో తీసి పంపించాలంటూ లండన్ కోర్టు ఆదేశించింది. మహారాష్ట్ర అధికారులు ముంబై ఆర్థర్ రోడ్ జైలులోని 12వ నంబర్ బ్యారెక్‌ను ముస్తాబు చేశారు. గదిలో ప్రతీది తెలిసేలా 8 నిమిషాల వీడియో తీసి లండన్ కోర్టుకు ఇచ్చారు. మంచంపై మెత్తటి పరుపు, శుభ్రంగా ఉతికిన దుప్పట్లు, దిండ్లు ఉంచారు. టీవీలో ఆంగ్ల, మరాఠీ చానెల్స్ వచ్చే ఏర్పాట్లు చేశారు. మాల్యాను ఉంచబోయే బ్యారెక్ లోపల, బయట రేయింబవళ్లు గార్డులు కాపలా ఉంటారు. సీసీటీవీ కెమెరాల నిఘా ఉంటుంది. ఇక్కడ పేరు ప్రఖ్యాతులున్న ఖైదీలను, ప్రాణహానీ ఉన్న వారిని ఉంచుతారు. -
పిల్లల ముఖాలపై స్టాంపులు
భోపాల్ సెంట్రల్ జైలు సిబ్బంది నిర్వాకం వివరణ కోరిన హెచ్చార్సీ భోపాల్: మధ్యప్రదేశ్ జైలు అధికారులు చేసిన నిర్వాకంపై తీవ్ర విమర్శలు ఎదురవుతున్నాయి. జైల్లో ఉన్న తమ తండ్రిని కలిసేందుకు వచ్చిన ఇద్దరు మైనర్ల ముఖాలపై విజిటింగ్ స్టాంపులేశారు. ఆ ఫోటోలు సోషల్‌మీడియా, ప్రముఖ పత్రికల్లో రావడం, పలువురు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయటం జరిగిపోయాయి. దీనిపై స్పందించిన రాష్ట్ర మానవహక్కుల సంఘం.. జైలు అధికారులను ఘటనపై వివరణ కోరింది. ఇది ముమ్మాటికీ మానవ, బాలల హక్కుల ఉల్లంఘనే అవుతుందని హెచ్చార్సీ అభిప్రాయపడింది. అయితే జైలు అధికారులు మాత్రం అది అనుకోకుండా జరిగి ఉండొవచ్చని భావిస్తున్నారు. రక్షాబంధన్ సందర్భంగా ఆ ఇద్దరు పిల్లలు జైల్లో ఉన్న తమ తండ్రిని చూడటానికి వచ్చారు. ఆ రోజు సుమారు 8,500 మంది జైలులో ఉన్న తమ బంధువులను సందర్శించారు. అందులో ఎక్కువగా పిల్లలు, మహిళలే ఉన్నారని జైలు సూపరిండెంట్ దినేశ్ నర్గేవ్ తెలిపారు. సాధారణంగా అయితే అలా వచ్చిన సందర్శకుల చేతిపై స్టాంపు వేస్తారు. కానీ, ఈ ఇద్దరు చిన్నారుల ముఖంపై మాత్రం స్టాంప్ వేయటం ఇక్కడ విడ్డూరం. ఈ ఘటన ఎందుకు జరిగిందో విచారణ చేపట్టామని అధికారులు తెలిపారు. కావాలని చేసిన పనే అయితే కఠిన చర్యలు ఉంటాయని దినేశ్ వెల్లడించారు. -
పోలీసులు-ఖైదీల మధ్య ఘర్షణ
-
రాజంపేట సబ్‌జైలుకు కన్నం
రాజంపేట, న్యూస్‌లైన్ : రాజంపేట సబ్‌జైలుకు కన్నం వేశారని ఆదివారం పట్టణంలో కలకలం రేగింది. దీంతో జైలు అధికారులు ఆ కన్నంను పరిశీలించారు. ఆకతాయిలే ఈ పని చేసి ఉంటారని భావించారు. ఇటీవల సబ్‌జైలును కొత్తగా నిర్మించారు. ఈ జైలుకు ప్రహారీ గోడ ఆఫీసర్స్ క్లబ్‌కు సమీపంలో ఉంది. ఈ గోడ అవతలి వైపు జైలులో ఉన్న వినాయకస్వామి గుడికి వస్తుంది. ఆ తర్వాత ఖైదీలు ఉండే గదులు, బాత్ రూములు ఉన్నాయి. ఈ గోడకు రంధ్రం ఎందుకు వేశారనే అన్న సందేహాలు వెలువడుతున్నాయి. జైలు ప్రహరీకి రంధ్రం పడిన విషయం తెలుసుకున్న జైలు సూపరిండెంట్ బీ.రవిశంకర్‌రెడ్డి తమ సిబ్బందితో పరిశీలించారు. కన్నం కాదని, ఇది ఆకతాయిలు చేసిన పని అని వివరించారు. -
జైలు అధికారుల తీరుపై ఎమ్మెల్యే ఆగ్రహం
చంచల్గూడా జైలు అధికారుల తీరుపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత ప్రవీణ్ రెడ్డి సోమవారం మండిపడ్డారు. తమ పార్టీ అధ్యక్షుడు, లక్షలాది మందికి ప్రతినిధి అయిన వైఎస్.జగన్మోహన్రెడ్డి జైల్లో దీక్ష చేస్తుండగా ఆయన ఆరోగ్యపరిస్థితిని బాహ్య ప్రపంచానికి తెలియజేయాల్సిన అవసరం అధికారులకు వుందన్నారు. వాటిపై దృష్టి పెట్టకపోగా జగన్ దీక్ష చేస్తున్నారన్న నెపంతో మిగిలిన వారితో ములాఖాత్‌లు రద్దు చేయడం దారుణమన్నారు. తన బంధువైన సునీల్‌రెడ్డిని కలిసేందుకు చంచల్‌గూడ జైలుకు వచ్చిన ప్రవీణ్‌రెడ్డికి, ములాఖాత్‌కు అనుమతించక పోవడంతో వెనుతిరిగారు. నిరవధిక నిరహార దీక్ష చేస్తున్న వైఎస్ జగన్‌కు మద్దతు తెలిపేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, అభిమానులు చంచల్‌గూడకు చేరుకుంటున్నారు. వైఎస్ జగన్‌కు మద్దతుగా పెద్దపెట్టున నినాదాలు చేశారు. కొందరు మహిళలు మోకాళ్లపై నడుస్తూ నిరసన వ్యక్తం చేశారు. సీబీఐ, కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దాంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు పుత్తా ప్రతాప్ రెడ్డి, చల్లా మధుసూదన్‌రెడ్డి, ముక్కా రూపానందరెడ్డిల సహా పలువురిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారితో పాటు మరో 400 మందిని పోలీసులు అరెస్ట్ చేసి కంచన్‌బాగ్ పోలీసు స్టేషన్‌కు తరలించారు. -
చంచల్‌గూడ జైల్ అధికారుల పై ప్రవీణ్‌రెడ్డి ఆగ్రహం