Jaisalmer district
-
మనుషులే ఉండని ఊరు
ఊరన్నాక మనుషులు ఉండాలి కదా! మనుషులే ఉండని ఊరేమిటా అని ఆశ్చర్యపోతున్నారా? ఔను! ఆ ఊళ్లో మనుషులు ఉండరు. పాడుబడిన కట్టడాలే తప్ప అక్కడ నరమానవుల జాడ కనిపించదు. ఆ ఊరి పేరు కుల్ధారా. ఇది రాజస్థాన్‌లోని జైసల్మేర్ జిల్లాలో ఉంది. పదమూడో శతాబ్ది నాటికి ఈ ఊళ్లో ఒకప్పుడు పాలీవాల్ బ్రాహ్మణులు ఉండేవాళ్లు. పంతొమ్మిదో శతాబ్ది తొలినాళ్లలో ఇక్కడి మనుషులంతా ఊరిని విడిచి, వేర్వేరు చోట్లకు వెళ్లిపోయారు. ఇక్కడి జనాలు ఊరిని ఖాళీ చేసి వెళ్లిపోవడానికి దారితీసిన కారణాలపై స్పష్టమైన సమాచారం లేదు గాని, ఈ పరిణామంపై రకరకాల కథలు ప్రచారంలో ఉన్నాయి. అప్పటి జైసల్మేర్ మంత్రి సలీం సింగ్ ఆకృత్యాలను భరించలేకనే ఇక్కడి జనాలు ఊరు ఖాళీచేసి వెళ్లిపోయారని చెబుతారు. ఈ ఊరు నిర్మానుష్యంగా మారిన తర్వాత ఇక్కడ ప్రేతాత్మలు సంచరిస్తుంటాయనే వదంతులూ వ్యాప్తిలోకి వచ్చాయి. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత కూడా ప్రభుత్వం చాలాకాలం దీన్ని పట్టించుకోలేదు. రాజస్థాన్ ప్రభుత్వం 2010లో ఈ గ్రామాన్ని పర్యాటక ప్రదేశంగా మార్చాలని నిర్ణయం తీసుకుంది. పెద్దగా సౌకర్యాలేవీ అభివృద్ధి చేయనప్పటికీ, అడపా దడపా ఇక్కడకు పర్యాటకులు వస్తుంటారు. ఇక్కడి శిథిలాల మధ్య తిరుగుతూ ఫొటోలు దిగుతుంటారు. -
వీడియో: నీళ్లు తాగాలంటే ఇంత చేయాలా.. ఎక్కడో కాదు మన దేశంలోనే..
ఎంతో మంది తమకు తెలియకుండానే నీటిని చాలా వరకు వృథా చేస్తుంటారు. ఫ్రీగా వచ్చాయి కదా అని.. కులాయి ఆన్‌చేసి కొద్దిపాటి అవసరానికి కూడా పెద్ద మొత్తంలో నీటిని పారబోస్తుంటారు. అలాంటి ఈ వీడియో తప్పనిసరిగా చూడాల్సిందే.. దేశంలో మంచినీరు దొరకని ప్రాంతాలు చాలానే ఉన్నాయి. ఇలాంటి ప్రాంతాల్లో రాజస్థాన్ కూడా ఒకటి. కాగా, రాజస్థాన్‌లోని ఎడారి సమీపంలో నివసించే ప్రజలు మంచినీటి కోసం ప్రతీరోజు ఎంత కష్టాన్ని ఎదుర్కొంటారో ఈ వీడియోలో చూడొచ్చు. దీనికి సంబంధించిన వీడియోను ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్ ఆఫీసర్ సామ్రాట్ గౌడ సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో, ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక, ఈ వీడియోలో ఎడారి ప్రాంతంలో ఉన్న ఓ బావి వద్ద ఓ వ్యక్తి కొన్ని సంచులతో చేసిన ఓ కుండలాంటి వస్తువును తయారుచేశాడు. అనంతరం.. దాన్ని బావిలోకి వదులుతాడు.. తర్వాత ఆ తాడును రెండు ఒంటెలు లాగేలా ఉన్న పరికరానికి తగిలిస్తాడు. దీంతో, ఆ రెండు ఒంటెలు తాడును తాగుతూ ముందుకు వెళ్లగానే సంచిలో నీరుపైకి వస్తుంది. అనంతరం, ఆ నీటిని పక్కనే ఉన్న ఓ సంపులో భద్రపరుచుకుంటున్నారు. ఇక, ఈ వీడియోకు ఐఎఫ్ఎస్ ఆఫీసర్ సామ్రాట్ గౌడ.. నీరు చాలా విలువైనది, చాలా జాగ్రత్తగా వాడండి అంటూ క్యాప్షన్ ఇచ్చాడు. Water is very precious resource......use it carefully 💦 pic.twitter.com/g6UNIFwEnk — Dr.Samrat Gowda IFS (@IfsSamrat) December 1, 2022 ఈ వీడియోపై పలువురు నెటిజన్లు స్పందించారు. వీడియో జైసల్మేర్‌కి చెందినదని ఓ నెటిజన్ పేర్కొన్నారు. మరో నెటిజన్ స్పందిస్తూ.. రాజస్థాన్ బోర్డర్లో ఉన్న వారికి వేసవిలో బీఎస్ఎఫ్ జవాన్లు వాటర్ అందిస్తారని చెప్పుకొచ్చారు. మరో నెటిజన్.. అనుభవం మాత్రమే పాఠాన్ని నేర్పుతుంది. నీటి విషయంలో మనం తెలుసుకునేలోపే జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. అది మనిషి స్వభావం అంటూ ఘాటు కామెంట్స్ చేశారు. Only the practical experience will teach the lesson. Anything for instance as long as you get in surplus we ont realise. By the time we realise everything is over. That's human nature Sir. — T. Chandrasekar (@TChandr64295322) December 1, 2022 -
'రాజస్థాన్' ఆధారాలతో డైనోసార్స్ గుట్టు రట్టు!
న్యూఢిల్లీ: ఒకప్పుడు భూగోళంపై తమదైన ఆధిపత్యం చలాయించిన డైనోసార్లు (రాక్షసబల్లులు) ఎలా అంతరించాయనే విషయంపై సైంటిస్టులు ఇంకా కచ్చితమైన నిర్ధారణకు రాలేదు. భారత్ లో ఇటీవల లభ్యమైన డైనోసార్ల అవశేషాల పరిశీలతో ఆ జీవులు అంతరించిపోవడానికి గల కారణాలు వెలుగులోకి వెలుగులోకి రానున్నాయి. రాజస్థాన్ లోని జైసల్మేర్ జిల్లా అటవీ ప్రాంతంలో జియాలజిస్టులు సేకరించిన డైనోసార్ పాదముద్రలపై పరిశోధనలు జరుపుతున్నామని, త్వరలోనే సంచలన ఫలితాలు వెల్లడయ్యే అవకాశం ఉందని జైనారాయణ్ వ్యాస్ యూనివర్సిటీ జియాలజీ విభాగం ప్రొఫెసర్ డాక్టర్ సురేశ్ చంద్ర మాథుర్ చెప్పారు. జైసల్మేర్ లో డైనోసార్ అవశేషాల వెలికితీతలో ప్రధాన పాత్రపోషించింది ఈయనే. సుమారు ఆరు కోట్ల సంవత్సరాల కిందట సంభవించిన విస్పోటనం వల్లే డైనోసార్లు అంతరించిపోయాయని శాస్త్రవేత్తలు మొదట్లో విశ్వసించేవారు. అయితే ఇటీవలి పరిశోధనల ఫలితాలను బట్టి.. ఆ ప్రతిపాదనలు సరికావేమోనని, విస్ఫోటనం జరగడానికి ముందే డైనోసార్లు అంతరించే ప్రక్రియ మొదలై ఉంటుందని కొందరు సైంటిస్టులు అంటున్నారు. 2010లో దీనికి సంబంధించిన మరో ఆసక్తికరమైన ప్రతిపాదన వెలుగులోకి వచ్చింది. దాదాపు 10 కిలోమీట్లర వైశాల్యం ఉన్న ఓ ఉల్క మెక్సికో ప్రాంతంలో పడిపోవడం, దాంతో భారీ ఎత్తున దుమ్ము, దూళి, బూడిదలు పైకిలేశాయని, తద్వారా భూ వాతావరణంలో విపరీత మార్పులు సంభవించాయని, ఆ కారణంగానే డైనోసార్లు అంతరించి ఉంటాయనే నివేదికలు రూపొందించారు. తర్వాత మూడేళ్లకు కాలిఫోర్నియా, బర్క్ లీ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు మరో విశ్వసనీయ ప్రతిపాదనను ముందుకు తెచ్చారు. దాని ప్రకారం 6,60,38,000 ఏళ్ల కిందట ఉల్క భూమనిని ఢీకొట్టిందని, అది.. భూమి ఇప్పుడున్న స్థితికి రావడానికి జరిగిన చివరి మార్పు అని తేల్చిచెప్పే ప్రయత్నం చేశారు.