మనుషులే ఉండని ఊరు | No Man Living Haunted Rajasthan Village Kuldhara Abandoned For Centuries | Sakshi
Sakshi News home page

మనుషులే ఉండని ఊరు

Published Sun, Feb 12 2023 11:40 AM | Last Updated on Sun, Feb 12 2023 11:48 AM

No Man Living Haunted Rajasthan Village Kuldhara Abandoned For Centuries - Sakshi

ఊరన్నాక మనుషులు ఉండాలి కదా! మనుషులే ఉండని ఊరేమిటా అని ఆశ్చర్యపోతున్నారా? ఔను! ఆ ఊళ్లో మనుషులు ఉండరు. పాడుబడిన కట్టడాలే తప్ప అక్కడ నరమానవుల జాడ కనిపించదు. ఆ ఊరి పేరు కుల్‌ధారా. ఇది రాజస్థాన్‌లోని జైసల్మేర్‌ జిల్లాలో ఉంది. పదమూడో శతాబ్ది నాటికి ఈ ఊళ్లో ఒకప్పుడు పాలీవాల్‌ బ్రాహ్మణులు ఉండేవాళ్లు.

పంతొమ్మిదో శతాబ్ది తొలినాళ్లలో ఇక్కడి మనుషులంతా ఊరిని విడిచి, వేర్వేరు చోట్లకు వెళ్లిపోయారు. ఇక్కడి జనాలు ఊరిని ఖాళీ చేసి వెళ్లిపోవడానికి దారితీసిన కారణాలపై స్పష్టమైన సమాచారం లేదు గాని, ఈ పరిణామంపై రకరకాల కథలు ప్రచారంలో ఉన్నాయి. అప్పటి జైసల్మేర్‌ మంత్రి సలీం సింగ్‌ ఆకృత్యాలను భరించలేకనే ఇక్కడి జనాలు ఊరు ఖాళీచేసి వెళ్లిపోయారని చెబుతారు.

ఈ ఊరు నిర్మానుష్యంగా మారిన తర్వాత ఇక్కడ ప్రేతాత్మలు సంచరిస్తుంటాయనే వదంతులూ వ్యాప్తిలోకి వచ్చాయి. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత కూడా ప్రభుత్వం చాలాకాలం దీన్ని పట్టించుకోలేదు. రాజస్థాన్‌ ప్రభుత్వం 2010లో ఈ గ్రామాన్ని పర్యాటక ప్రదేశంగా మార్చాలని నిర్ణయం తీసుకుంది. పెద్దగా సౌకర్యాలేవీ అభివృద్ధి చేయనప్పటికీ, అడపా దడపా ఇక్కడకు పర్యాటకులు వస్తుంటారు. ఇక్కడి శిథిలాల మధ్య తిరుగుతూ ఫొటోలు దిగుతుంటారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement