Jakir
-
ఘరానా జకీర్ !
=సుదర్శన్ అన్న పేరుతో బెదిరింపులు =రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన 47 కేసుల్లో ఇతను నిందితుడు =సిటీలో 14 నాన్-బెయిలబుల్ వారెంట్లు పెండింగ్ =పీటీ వారెంట్‌పై తెచ్చేందుకు పోలీసుల సన్నాహాలు సాక్షి, సిటీబ్యూరో: ‘హలో... నేను పీపుల్స్ వార్ గ్రూప్ జిల్లా కమాండర్ సుదర్శన్ అన్నని మాట్లాడుతున్నాను... నేను చెప్పినట్లు చేయకపోతే నీ కుటుంబాన్నే లేపేస్తా...’ నకిలీ నక్సలైట్ మహ్మద్ రఫీయుద్దీన్ అలియాస్ జకీర్ బెదిరింపుల నైజమిది. ఆదివారం రాజమండ్రి పోలీసులు అరెస్టు చేసింది ఈ ఘరానా నిందితుడినే. రాష్ట్ర వ్యాప్తంగా కార్యకలాపాలు సాగించే ఇతడిపై వివిధ జిల్లాల్లో 47 కేసులు నమోదయ్యాయి. గతంలో పలుమార్లు సిటీ పోలీసులకు చిక్కి బెయిల్‌పై విడుదలైన జకీర్ కోర్టు వాయిదాలకు హాజరుకాకపోవడంతో 14 నాన్-బెయిలబుల్ వారెంట్లు పెండింగ్‌లో ఉన్నాయి. దీంతో జకీర్‌తో పాటు అతడి భార్యనూ ప్రిజనర్స్ ట్రాన్సిట్ (పీటీ) వారెంట్‌పై సిటీకి తీసుకొచ్చేందుకు నగర పోలీసులు సన్నాహాలు చేస్తున్నారు. భార్యతో కలిసే నేరాలు... కరీంనగర్ జిల్లా జగిత్యాలకు చెందిన జకీర్ నగరంలోని టోలిచౌకీలో నివాసముంటున్నాడు. భార్య జమీదున్నిస్సా బేగం అలియాస్ షకీలా సోహానీతో కలిసి 2001 నుంచీ నేరాలు చేస్తూ అనేకసార్లు జైలుకెళ్లి వచ్చాడు. ‘నకిలీ నక్సల్స్ పేరుతో వసూళ్లు’ అనే వార్తను పేపర్లో చదివి ఈ దందా ప్రారంభించానని జకీర్ గతంలో నగర పోలీసులకు చిక్కినప్పుడు చెప్పాడు. టాస్క్‌ఫోర్స్ పోలీసులు 2008 జూన్‌లో జకీర్‌తో పాటు భార్యనూ అరెస్టు చేశారు. బెయిల్‌పై అదే ఏడాది సెప్టెంబర్‌లో జైలు నుంచి బయటకు వచ్చారు. బెయిల్ కోసం చేసిన ఖర్చులు వసూలు చేయడానికి మళ్లీ పాత దందానే ప్రారంభించారు. జకీర్ ఈసారి తన భార్యతోపాటు మరికొందరితో కలిసి ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, కరీంనగర్, వరంగల్ జిల్లాల్లో వందల మందికి బెదిరింపు ఫోన్లు చేశాడు. వీరిలో కొందరి నుంచి డబ్బు వసూలు చేశారు. దీంతో టాస్క్‌ఫోర్స్ పోలీసులు 2009 జనవరి 23న అరెస్టు చేసి జైలుకు పంపారు. ఆదివారం రాజమండ్రి పోలీసులు అరెస్టు చేసిన ముగ్గురిలో జకీర్‌తో పాటు అతడి భార్య షకీలా కూడా ఉంది. ప్రతిసారీ ఓ కొత్త ముఠా... 2009లో అరెస్టైన జకీర్ 13 నెలల పాటు జైల్లో ఉండి 2010 మార్చిలో బయటకొచ్చాడు. పాత ముఠాను పక్కన పెట్టి కొత్తగా కరీంనగర్ జిల్లాకు చెందిన మహ్మద్ జఫర్ సో మహ్మద్ ఆజం, మహ్మద్ మాజిద్ అలీలతో కలిసి గ్యాంగ్ ఏర్పాటు చేశాడు. బోగస్ ధ్రువీకరణ పత్రాలతో సిమ్‌కార్డులు కొనుగోలు చేసి సుదర్శన్ అన్న, రమేష్ అన్న, సంతోష్ అన్న పేర్లతో బెదిరింపు ఫోన్లు ప్రారంభించాడు. బాధితులను తీవ్రంగా బెదిరించడం ద్వారా డబ్బు, బంగారం డిమాండ్ చేశాడు. వాటిని నిర్మానుష్య ప్రాంతాలకు తీసుకురమ్మని చెప్పి అనేక చోట్ల తిప్పుతాడు. చివరకు ఓ ప్రాంతంలోని రాళ్ల కింద లేదా మరో చోట ఆ డబ్బు పెట్టమని చెప్పి.. వాటిని తీసుకుంటాడు. ఆర్ఎంపీ డాక్టర్లు, ఎల్ఐసీ ఉద్యోగులు, అధికారులు ఇలా అనేక మందిపై ఈ ట్రిక్కు ప్రయోగించాడు. తూర్పుగోదావరి జిల్లాలో వ్యవహారానికి తన భార్యతో పాటు అన్వర్ షరీఫ్‌ను వినియోగించాడు. విలాసవంతమైన జీవితం... బెదిరింపుల ద్వారా వసూలు చేసిన సొమ్మును జకీర్ విలాసాల కోసమే ఎక్కువగా ఖర్చు చేసేవాడు. ఖరీదైన హోటళ్లలో బస, భోజనాలతో పాటు అనేక విలాసాలు చేస్తారు. జకీర్ ధరించే దుస్తులు, బూట్లు, వినియోగించే సెల్‌ఫోన్ సైతం అత్యంత ఖరీదైనవే. షర్టు రూ. 3600, ప్యాంట్ రూ. 4200, బూట్లు దాదాపు రూ. ఆరు వేలు, సెల్‌ఫోన్ రూ. 20 వేలకుపైనే ఖరీదు చేసేవి వాడతాడు. కొన్నాళ్ల క్రితం తన కుమారుడి పుట్టినరోజును దుబాయ్‌లో నిర్వహించాడు. అత్యంత విలాసవంతంగా జరిగిన ఈ తతంగానికి జకీర్ రూ. 9 లక్షలు ఖర్చు చేసినట్లు పోలీసుల విచారణలో బయటపెట్టాడు. సిటీలో నమోదైన కేసుల్లో జకీర్, అతడి భార్యపై ఉన్న నాన్-బెయిలబుల్ వారెంట్లు ఎగ్జిక్యూట్ చేసేందుకు సిటీకి తేనున్నారు. దీనికి సంబంధించి తూర్పుగోదావరి జిల్లా అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నారు. -
నకిలీ నక్సలైట్ల అరెస్టు
ఆల్కాట్‌తోట(రాజమండ్రి), న్యూస్‌లైన్ : నగరాల్లో ప్రముఖ వ్యక్తులను నక్సలైట్లమని బెదిరించి, లక్షల రూపాయలను వసూలు చేసిన, పాత నేరస్తులైన ముగ్గురు నకిలీ నక్సలైట్లను రాజమండ్రి అర్బన్‌జిల్లా పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి కారు, 4 సెల్ఫోన్లు, సిమ్‌కార్డులు, రూ.2.70 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. కేసు వివరాలను అర్బన్‌జిల్లా ఎస్పీ టి.రవికుమార్‌మూర్తి విలేకరుల సమావేశంలో వెల్లడించారు. హైదరాబాద్‌లోని టోలీచౌకి ప్రాంతానికి చెంది న పాత నేరస్తుడు మొహమ్మద్ రఫీవుద్దీన్ అలియా స్ జాకిర్, అతడి రెండో భార్య జమీదున్నీసాబేగం అలియాస్ షకీలా సోహానీ తాము నక్సలైట్లమని ప్రముఖులను బెదిరించి, సొమ్ము వసూలు చేస్తుం టారు. ఇంటర్ చదివిన జాకిర్ 1993 నుంచి 1999 వరకు గల్ఫ్, రియాద్, 2001 నుంచి దుబాయ్‌లోను పనిచేశాడు. 2006-07లో కరీంనగర్ జిల్లాలో హా ర్వెస్ట్ ట్రాక్టర్ కొని, వ్యవసాయ పనులకు అద్దెకివ్వడంతో నష్టం వచ్చింది. తన సహచరులతో కలిసి నక్సలైట్లుగా బెదిరించి డబ్బు సంపాదించాలని పథకం పన్నారు. ఇందుకు డాక్టర్లు, వ్యాపారులు, సంపన్నుల ఫోన్ నంబర్లు సేకరించారు. నకిలీ అడ్రస్సులతో సిమ్‌కార్డులు తీసుకున్నారు. 2008 నుంచి కరీంనగర్, ఆదిలాబాద్, మహబూబ్‌నగర్, నిజామాబాద్, హైదరాబాద్ సిటీ, కర్నూలు, నల్గొండ, తూర్పుగోదావరి, విశాఖ జిల్లాల్లో ప్రముఖులను బెదిరించి, సొమ్ము వసూలు చేశారు. కొన్ని కేసుల్లో పట్టుబడి జైలుకు కూడా వెళ్లారు. మరో నిందితుడు మొహమ్మద్ అన్వర్‌షరీఫ్ మాత్రం కాబోయే అల్లుడు కావడంతో మొదటిసారిగా వీరితో కలి శాడు. ఈ నెల 16న రాజమండ్రికి చెందిన బిల్డర్ మన్యం ఫణికుమార్‌కు జాకిర్, షకీలా సోహానీ, అన్వర్‌షరీఫ్ కలిసి సుదర్శన్ పేరుతో ఫోన్ చేశారు. నక్సలైట్లమని చెప్పి.. పేలుడు పదార్థాలు కావాలని అతడిని బెదిరించారు. లేనిపక్షంలో రూ.రెండు లక్ష లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీంతో ఫణికుమార్ రూ.60 వేలు ఇచ్చేందుకు అంగీకరించాడు. వారి సూచన మేరకు లాలాచెరువు-ఆటోనగర్ మధ్య ఓ ప్రదేశంలో ఆ నగదు పెట్టాడు. రాజమండ్రిలోని ఓ కార్డియాలజిస్ట్ వద్ద రూ.లక్ష, కాకినాడలోని రాచూరి రాఘవేంద్రరావు అనే వ్యక్తి ని బెదిరించి రూ.70 వేలు, విశాఖపట్నంలోని డాక్టర్ కామేశ్వరరావును బెదిరించి రూ.లక్ష కాజేశారు. విశాఖపట్నంలోనే మరో ముగ్గురిని బెదిరించారు. నింది తులు ఈ నెల 17న రాత్రి తునిలో బస చేసి, 18న ఉదయం హైదరాబాద్‌కు బయలుదేరారు. విజయవాడ వరకు వెళ్లిన తర్వాత రాజమండ్రికి చెందిన బి ల్డర్ ఫణికుమార్‌కు ఫోన్ చేశారు. రూ.రెండు లక్షలు అడిగితే రూ.60 వేలే ఇచ్చావని, మిగిలిన సొమ్ము ఇవ్వాలని బెదిరించారు. దీంతో రూ.40 వేలు ఇచ్చేందుకు ఫణికుమార్ ఒప్పుకున్నాడు. ఈ క్రమం లో నిందితులు రాజమండ్రి వచ్చారు. ఈ మేరకు ఫణికుమార్ స్థానిక ప్రకాష్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో, ఇన్స్పెక్టర్ బీవీ సుబ్బారావు కేసు నమోదు చేశారు. అర్బన్‌జిల్లా ఎస్పీ టి.రవికుమార్ మూర్తి పర్యవేక్షణలో క్రైం డీఎస్పీ పి.ఉమాపతివర్మ, తూర్పు మండల డీఎస్పీ ఆర్.సత్యానందం,ప్రకాష్‌నగర్, కడియం,క్రైం ఇన్స్పెక్టర్లు సుబ్బారావు, కె.వరప్రసాద్, జి.కెనెడీ, ఎస్.గంగరాజు వలపన్నారు. రూ.40 వేలు తీసుకునేందుకు రావాలని ఫణికుమార్ చెప్పగా, ఆటోనగర్-లాలాచెరువుల మధ్య డబ్బు పెట్టాలని జాకిర్ సూచించాడు. నిందితులు కారులో దివాన్‌చెరువు రోడ్డులోకి రాగానే, పోలీసులను గమనించి కోరుకొండలోని ఖాళీ ప్రదేశంలో కారు విడిచి పరారయ్యారు. ఆదివారం రాజమండ్రిలోని ఓ వైద్యుడిని బెదిరించేందుకు వచ్చిన ముగ్గురు నిందితులను ప్రకాష్‌నగర్ ఇన్స్పెక్టర్ సుబ్బారావు అరెస్టు చేశారు. వీరు విడిచిపెట్టిన కారులో రూ.2.70 లక్షలను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను పట్టుకున్న పోలీసు అధికారులు, సిబ్బందికి ఎస్పీ రవికుమార్ మూర్తి రివార్డులు ప్రకటిం చారు. -
నన్నంతా జూనియర్ షారుక్ అంటుంటారు - జాకీర్
పదేళ్లు.. ఎనిమిది సినిమాలు. జాకీర్ సాధించిన స్కోర్ ఇది. చేసిన సినిమాల సంఖ్య చాలా చాలా తక్కువ. కానీ జాకీర్ మాత్రం ఫేమస్. అది తన అదృష్టం అంటారాయన. జాకీర్ తొలి చిత్రం ‘బ్యాచిలర్స్’. ఆ చిత్రంలో ఓ హీరోగా నటించి, ఆ తర్వాత ‘కుచ్చి కుచ్చి కూనమ్మ’, ‘ది ఎండ్’ తదితర చిత్రాల్లో నటించారు. ‘కుచ్చి కుచ్చి..’కి నంది అవార్డు కూడా సాధించారు. నటుడిగానే కాకుండా ‘బ్యాచిలర్స్ 2’ ద్వారా దర్శకుడిగా కూడా మారారు. ప్రస్తుతం ‘విడుదల’ అనే చిత్రానికి దర్శకత్వం వహిస్తూ, నటిస్తున్నారు. ఇక... జాకీర్‌తో మాట్లాడదాం... *** పదేళ్లల్లో పట్టుమని పది సినిమాలు కూడా చేయలేకపోయారు.. అసంతృప్తి ఏమైనా ఉందా? అసంతృప్తి లేదు. సినిమాలంటే చాలా ఇష్టం. ఎప్పటికీ ఈ రంగంలోనే ఉండాలని ఫిక్స్ అయ్యాను. ఏమీ సాధించలేకపోయాం అని బాధపడిపోవడానికి నా కెరీర్‌కి ఫుల్స్టాప్ పడలేదు. ప్రస్తుతం వంశీగారు దర్శకత్వం వహిస్తున్న ‘తను మొన్నే వెళ్లిపోయింది’ చిత్రంలో మంచి పాత్ర చేస్తున్నాను. అంత పెద్ద దర్శకుడి సినిమాలో అవకాశం రావడం హ్యాపీ. *** మరి.. ఎందుకు ఎక్కువ సినిమాలు చేయలేకపోయారు? ‘బ్యాచిలర్స్’ తర్వాత చాలా అవకాశాలొచ్చాయి. కానీ ఏది చెయ్యాలి? ఏది వదులుకోవాలి? అనే విషయంపై స్పష్టమైన అవగాహన ఉండేది కాదు. దాంతో సినిమాల ఎంపిక విషయంలో కొంచెం పొరపాటు చేశాను. సరైన గెడైన్స్ లేకపోవడంవల్ల సరైన నిర్ణయాలు తీసుకోలేకపోయాను. *** ‘బ్యాచిలర్ 2’ ద్వారా దర్శకుడిగా మారడానికి కారణం? నా మనసులో ఉన్న ఆలోచనలను తెరపై చూసుకోవాలనుకున్నాను. అందుకే ఆ సినిమాకి దర్శకత్వం వహించాను. ఇప్పుడు ‘విడుదల’ అనే సినిమా దర్శకత్వం వహించాను. ఇందులో నేనే లీడ్ రోల్ చేశాను. జైలు నుంచి విడుదలైన తర్వాత, ఓ వ్యక్తి జీవితం ఎలాంటి మలుపు తీసుకుంటుంది? అనేది ఈ చిత్రం కథాంశం. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతోంది. *** ఒకవైపు డెరైక్షన్.. మరోవైపు యాక్టింగ్.. ఈ రెంటిలో దేనికి ప్రాధాన్యం? కచ్చితంగా నటనకే. యాక్టింగ్ మీద ఇంట్రస్ట్‌తోనే పరిశ్రమకు వచ్చాను. మంచి కథ కుదరడంతో ‘బ్యాచిలర్స్ 2’కి, ఇప్పుడు ‘విడుదల’కు దర్శకత్వం వహించాను. ఇకముందు ఎప్పుడైనా మంచి కథ కుదిరితే డెరైక్షన్ చేస్తాను. ప్రధానంగా యాక్టింగ్పైనే దృష్టి. *** హీరోగా, కేరెక్టర్ ఆర్టిస్ట్‌గా మాత్రమేనా.. విలన్‌గా చేసే ఉద్దేశం ఉందా? చేయాలనే ఉంది. మన తెలుగు పరిశ్రమలో తెలుగు మాట్లాడే విలన్లు పెద్దగా లేరు. నాలాంటి వాళ్లకి అవకాశం ఇస్తే.. విలన్‌గా కూడా నిరూపించుకోవడానికి శాయశక్తులా కృషి చేస్తాం. *** మీరు జూనియర్ షారుక్ ఖాన్‌లా ఉంటారని ఎవరైనా అన్నారా? చాలామంది అంటుంటారు. బాలీవుడ్ బాద్షా అనిపించుకున్న షారుక్‌తో పోల్చడం ఆనందమే.