లైంగిక వేధింపులు.. ఆత్మకథతో బుక్కయ్యాడు
హాలీవుడ్ నటుడు జేమ్స్ ఫ్రాంకో పై వస్తున్న లైంగిక ఆరోపణల పర్వం మరో మలుపు తిరిగింది. అతను వేధింపులకు పాల్పడిన మాట వాస్తవమేనన్న వాదనను బలపరుస్తూ అతని ఆత్మకథలోనే పేర్కొన్న విషయాలను వెలుగులోకి తెస్తున్నారు.
కొంత మంది అమ్మాయిలతో లైంగిక వాంఛ తీర్చుకున్నట్లు స్వయంగా ఫ్రాంకో తన ఆత్మకథ పుసక్తం ‘యాక్టర్స్ అనానిమస్’ లో పేర్కొన్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితులకు అనుగుణంగా వ్యవహరించాలన్నా.. నటనలో రాణించాలన్నా కొన్ని పరిస్థితులకు సర్దుకుపోవాలి. ఈ క్రమంలో చాలా మంది అమ్మాయిలతో నేను సంబంధం పెట్టుకున్నా అని ఫ్రాంకో అందులో పేర్కొన్నాడు. ఇండస్ట్రీలో దాదాపు అందరు స్టార్లు అదే రీతిలో ఉంటారని.. కొందరైతే రోజుల తరబడి ఎంజాయ్ చేస్తుంటారని తెలిపాడు. ప్రస్తుతం పుసక్తంలో కొన్ని పేజీలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
కాగా, స్పైడర్ మ్యాన్ చిత్రం ఫేమ్ అయిన జేమ్స్ ఫ్రాంకో.. యాక్టింగ్ స్కూల్ పేరిట కొంత మంది అమ్మాయిలను లైంగికంగా వేధించాడని.. సెట్స్‌లోనే చెప్పుకోలేని అకృత్యాలకు పాల్పడ్డాడని ఐదుగురు యువతులు ఫిర్యాదు చేయటంతో అసలు వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ముఖ్యంగా న్యూడ్ సీన్ల ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో న్యూడ్ సూట్లను నిషేధించి వారిని నగ్నంగా నటించాలంటూ ఒత్తిడి తెచ్చేవాడని.. తమకు అసభ్యకరమైన సందేశాలు పంపేవాడని వారు చెప్పారు. అయితే ఆరోపణలు వచ్చిన వెంటనే వాటిని మీడియా సాక్షిగా ఖండించిన ఫ్రాంకో.. ప్రస్తుతం పరారీలో ఉన్నాడు.
From James Franco’s book Actors Anonymous pic.twitter.com/YSMNauQbxf
— Mary Sollosi (@missollosi) 10 January 2018