37 ఏళ్ల వయసులో స్కూల్కు వెళ్లిన యాక్టర్..!
లండన్: చిన్నతనంలో నటించడంలో బీజీ అయిపోయిన స్ప్రింగ్ బ్రేక్ స్టార్ జేమ్స్ ఫ్రాంకో లేటు వయసులో స్కూలుబాట పట్టాడు. తాను 37 ఏళ్ల వయసులో 2006లో పాఠశాలకు వెళ్లడం ప్రారంభించినట్లు తెలిపాడు. యాక్టింగ్ ట్రాప్ చేసిందని అందుకే చదువుకునే ధ్యాస తనకు చిన్నతనంలో కలగలేదని చెప్పాడు.
మొదట యూసీఎల్ఏ కాలిఫోర్నియాలో చేరిన ఫ్రాంకో క్రమంగా అనేక కోర్సులను పూర్తి చేశాడు. లిటరేచర్లో తాను పీహెచ్డీ చేస్తున్న సమయంలో తనతో పాటు రీసెర్చ్ చేస్తున్న విద్యార్థులు అద్భుతమైన పేపర్లు చేసేవారని వివరించారు.