Jamm and Kashmir
-
జమ్ముకశ్మీర్‌లో ఎన్కౌంటర్.. ఉగ్రవాది హతం
శ్రీనగర్: జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదులు, భద్రతా దళాలకు శుక్రవారం తెల్లవారుజామున ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. కుల్గాం జిల్లాలో బీఎస్‌ఫ్ జవాన్లు ప్రయాణిస్తున్న వాహనంపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ క్రమంలో ఉగ్రవాదులకు బద్రతా బలగాలకు మధ్య ఎదురు కాల్పలు జరిగాయి. ఈ ఎన్కౌంటర్లో లష్కరే తొయిబా ఉగ్రవాదిని భద్రతా బలగాలు మట్టుబెట్టగా. .మరో ఉగ్రవాది తప్పించుకున్నాడు. ఈ ఘటనలో ఇద్దరు బీఎస్‌ఫ్ అధికారులకు, మరో ఇద్దరు స్థానిక పౌరులకు గాయాలయ్యాయి. -
షెహ్లా రషీద్ దేశ ద్రోహి: బీజేపీ నేత రవీందర్ రైనా
సాక్షి, ఢిల్లీ: జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయ విద్యార్థి షెహ్లా రషీద్‌పై తన తండ్రి అబ్దుల్ షోరా చేసిన తీవ్రమైన ఆరోపణలు నేపథ్యంలో ఆమె వాక్చాతుర్యాన్ని కొనసాగిస్తున్నారు. తన కుమార్తె దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతుందని రషీద్ షోరా పోలీసులకు లేఖ రాశారు. ఇప్పుడు దీనిపై జమ్మూకశ్మీర్ బీజేపీ ఛీఫ్ రవీందర్ రైనా ఘాటు వ్యాఖ్యలు చేశారు. జమ్మూకశ్మీర్‌లో అశాంతిని వ్యాప్తి చేయడానికి షెహ్లా రషీద్‌కు హవాలా ద్వారా డబ్బులు వస్తున్నాయని రవీందర్ రైనా ఆరోపించారు. రవీందర్ గతంలో కూడా వేర్పాటువాద నాయకులపై, జమ్మూకశ్మీర్ నాయకులపై తీవ్రమైన ఆరోపణలు చేశారు. చదవండి: (ఎన్డీయేకు మరో మిత్రపక్షం గుడ్‌బై..) తన కుమార్తెకు ప్రాణాలకు ముప్పు ఉందని, ఆమె దేశ వ్యతిరేక చర్యలకు పాల్పడ్డారని లేఖలో పేర్కొన్నారు. అమెరికా వెళ్లిన తర్వాత షెహ్లా పార్టీని ఏర్పాటు చేశారని షెహ్లా రషీద్ తండ్రి అబ్దుల్ షోరా చెప్పారు. ఆ పార్టీకి నిధులన్నీ యాంటీ నేషనల్ ఫోర్స్ నుండి వస్తున్నాయి, ఏ జాతీయ పార్టీ వారికి నిధులు ఇవ్వలేదని పేర్కొన్నారు. ఈ డబ్బు మూలాన్ని కనుగొనాలని, అలాగే తనకు భద్రత కల్పించాలని డిజికి విజ్ఞప్తి చేసినట్లు చెప్పారు. ఈ లేఖపై జమ్మూ కాశ్మీర్ పోలీసులు కూడా చర్యలు తీసుకున్నారు. అబ్దుల్ రషీద్ షోరా ఆరోపణలను ధృవీకరించడానికి వీలుగా ఈ విషయాన్ని పరిశీలించాలని ఎస్ఎస్పి శ్రీనగర్‌కు ఆదేశించినట్లు కాశ్మీర్ ఐజి విజయ్ కుమార్ తెలిపారు. మరోవైపు తన తండ్రి ఆరోపణలపై షెహ్లా వివరణ ఇచ్చారు. తనపై వచ్చిన ఆరోపణలన్నీ 'నిరాధారమైన, అసహ్యకరమైనవి' అని అభివర్ణించారు. తన తండ్రి చేసినట్లు కుటుంబంలో ఇది జరగదని షెహ్లా ట్విట్టర్లో ఒక ప్రకటన విడుదల చేశారు. తనతోపాటు తన తల్లి, సోదరిపై నిరాధారమైన ఆరోపణలు చేశారని చెప్పారు. -
జమ్మూకశ్మీర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతం
శ్రీనగర్: జమ్మూకశ్మీర్ కుల్గాం జిల్లాలోని వాన్‌పోరాలో శనివారం భద్రతా బలగాలు జరిపిన కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. ఈ సందర్బంగా జమ్మూ కాశ్మీర్ పోలీస్ ఇన్స్పెక్టర్ జనరల్ (కాశ్మీర్ జోన్) విజయ్ కుమార్ మాట్లాడుతూ.. ‘వాన్‌పోరా ప్రాంతంలో ముష్కరులు ఉన్నట్లు మాకు సమాచారం అందింది. దాంతో ఆర్మీ, సీఆర్పీఎఫ్ బలగాలు సంయుక్తంగా నిర్బంధ తనిఖీలు నిర్వహించాయి. అనుమానిత ప్రాంతానికి వచ్చే సరికి ఉగ్రవాదులు పోలీసులపై కాల్పులకు తెగబడ్డారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. భద్రతా బలగాలు ఇద్దరు ఉగ్రవాదులను మట్టుబెట్టాయి. ఘటనాస్థలి నుంచి ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నాయి. మిగతా ఉగ్రవాదుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి’ అని తెలిపారు. -
వీర సైనికా నీకు వందనం
జైపూర్: ఆరున్నర సంవత్సరాలు కష్టపడి 13 సార్లు ప్రయత్నించి ఆర్మీలో చేరారు ఆయన. దేశం కోసం పోరాడాలి అన్న ఆలోచన తప్ప మరే ఆలోచన లేని ఆయన ఎట్టకేలకు ఎంతో కష్టపడి భారత సైన్యంలో చేరారు. భారత సైన్యం నిర్వహించిన ఎన్నో ఆపరేషన్లలో పాల్గొన్నారు. ఆర్మీలో చేరిన తరువాత వెనుదిరిగి చూసుకోవలసిన అవసరం లేకుండా అంచెలంచెలుగా ఎదిగి కల్నల్‌స్థాయికి చేరారు. ఆయన మరెవరో కాదు ఆదివారం జమ్మూ కశ్మీర్‌లోని హంద్వారా జరిగిన ఉగ్రదాడిలో అమరులైన కల్నల్ ఆశుతోష్ శర్మ. ఆయన మృతదేహాన్నిస్వగ్రామమైన జైపూర్‌కు తీసుకురానున్నారు. సోమవారం సాయంత్రం కల్లా ఆయన శరీరాన్ని జైపూర్‌లో ఉంటున్న ఆయన తల్లిదండ్రులకు అందించనున్నారు. మంగళవారం ఆయన అంత్యక్రియలు సైనికవందనంతో జరగనున్నాయి. (కల్నల్ సహా ఐదుగురు జవాన్ల వీరమరణం) కల్నల్ శర్మ భార్య పల్లవి, కూతురు తమన్నాతో కలిసి ఉంటున్నారు. ఆయన భార్య పల్లవి మాట్లాడుతూ తన భర్త ఒక గొప్ప కారణంతో ప్రాణాలు త్యాగం చేశారని, అశుతోష్‌ని చూసి గర్వపడుతున్నానని తెలిపారు. ఆయనని చూసి ఏడవనని తెలిపారు. చివరిగా కల్నల్‌తో మే 1 న మాట్లాడానని చెప్పారు. ఆయన కూతురు తమన్నా మాట్లాడుతూ ఆపరేషన్ ముగియగానే ఇంటికి తిరిగి వస్తానని చెప్పిన నాన్నకి ఇలా జరిగిందని కన్నీటి పర్యంతం అయ్యింది. అశుతోష్ తల్లి దండ్రులు మాట్లాడుతూ తమ కొడుకుని చూస్తుంటే గర్వంగా ఉందన్నారు. (హంద్వారా అమరులకు మహేష్ నివాళి) ఆయన సోదరుడు పీయూష్ శర్మ మాట్లాడుతూ ‘మా సోదరుడు చాలా ధైర్యవంతుడు, దేశభక్తి కలవాడు. నా సోదరుడి లాగానే నా కొడుకు కూడా ఆర్మీలో జాయిన్ అవ్వాలనుకుంటున్నాడు. ఆయన మా అందరికి ఆదర్శం’ అని తెలిపారు. కల్నల్ అశుతోష్ శర్మ స్వగ్రామం ఉత్తరప్రదేశ్‌లోని బులందర్‌షహర్ కాగా ఆయన అంత్యక్రియలు మాత్రం జైపూర్‌లో జరగనున్నట్లు ఆయన సోదరుడు తెలిపారు. ఆదివారం కశ్మీర్‌లోని హాంద్వారా ప్రాంతంలో భారత సైన్యం నిర్వహించిన ఆపరేషన్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతమవ్వగా, ఉగ్రమూకలు దొంగదెబ్బ తీయడంతో ఒక కల్నల్, ఒక మేయర్, ఇద్దరు జవాన్లతో పాటు జమ్మూకశ్మీర్ పోలీసు ఒకరు మరణించిన సంగతి తెలిసిందే. -
జమ్మూ కశ్మీర్లో కాల్పులు.. నలుగురు హతం
న్యూఢిల్లీ: జమ్ము కశ్మీర్లో మరోసారి తుపాకుల మోతమోగింది. ఆదివారం సాయంత్రం చోటు చేసుకున్న ఎన్కౌంటర్లో నాలుగురు ఉగ్రవాదులు మృతి చెందారు. జమ్మూ కశ్మీర్ కుల్గాం జిల్లాలోని గుద్దర్ గ్రామ సమీప దేవ్సర్ ప్రాంతంలో ఈ ఎన్కౌంటర్ జరిగినట్లు కుల్గాం పోలీసు సూపరింటెండెంట్ తెలిపారు. దేవ్సర్ ప్రాంతంలో ఉగ్రవాదులు సంచరిస్తున్నారనే సమాచారం అందటంతో భద్రత దళాలు, స్థానిక పోలీసులు వారి కోసం గాలించారు. ఈ క్రమంలో పోలీసులపై ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. పోలీసులకు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో నాలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. ప్రస్తుతం ఆ ప్రాంతంతో ఉద్రిక్తత వాతావరణం కొనసాగుతోంది. గడిచిన వారం రోజుల్లో దక్షిణ కశ్మీర్లో ఇది నాలుగో ఎన్కౌంటర్ కావటం గమనార్హం. ఇక ఈ నాలుగు ఎదురు కాల్పుల్లో భద్రతా దళాలు 14 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టారు. ఏప్రిల్ మాసంలో చోటుచేసుకున్న అన్ని ఎన్కౌంటర్లలో 26 మంది మృతి చెందారు. ఈ ఏడాదిలో ఇప్పటివరకు మొత్తంగా 58 మంది ఉగ్రవాదులు భద్రతా దళాల చేతిలో మృతి చెందినట్లు తెలుస్తోంది. -
మందుల కోసం కశ్మీర్ నుంచి ఢిల్లీకి
సాక్షి, న్యూఢిల్లీ : కశ్మీర్‌కు చెందిన 26 ఏళ్ల ప్రముఖ జానపద గాయకుడు అలీ సఫుద్దీన్ ఆస్తమాతో బాధ పడుతున్న తన 78 ఏళ్ల తల్లికి మందులు కొనుక్కు పోవడానికి శ్రీనగర్ నుంచి గురువారం నాడు ఢిల్లీకి విమానంలో బయల్దేరి వచ్చారు. ‘ఆగస్టు 4వ తేదీ నుంచి కశ్మీర్ అంతటా అప్రకటిత కర్ఫ్యూ కొనసాగుతోంది. మందుల షాపులతో సహా అన్ని దుకాణాలు, మార్కెట్లు మూతపడ్డాయి. మొబైల్, ల్యాండ్ లైన్లు మూగబోయాయి. ఇంటర్నెట్ సౌకర్యం, కేబుల్ ప్రసారాలు నిలిచిపోయాయి. స్కూళ్లు, కాలేజీలు నిరవధికంగా మూసివేత. వీధుల్లో భారీగా సైనిక దళాల మొహరింపు. ఎక్కడికక్కడే బారికేడ్లు. అక్కడక్కడ ఆడుకునే ఒకలిద్దరు పిల్లలు తప్పా అంతా నిర్మానుష్యం’ అని సఫుద్దీన్ కశ్మీర్ పరిస్థితి గురించి మీడియాకు వివరించారు. సభలూ, సమావేశాలు నిషేధిస్తూ ప్రభుత్వం 144వ సెక్షన్ కింద నిషేధాజ్ఞలు విధించగా, అక్కడ పరిస్థితేమో కర్ఫ్యూను తలిపిస్తోంది. ఢిల్లీ యూనివర్శిటీలో డిగ్రీ చదివిన సఫుద్దీన్ కశ్మీర్ యూనివర్శిటీ నుంచి ‘మాస్ కమ్యూనికేషన్స్’లో పీజీ చేశారు. ఆ తర్వాత సొంతంగా ఓ చిన్న రికార్డింగ్ స్టూడియోను ప్రారంభించి సొంతంగా కశ్మీర్ పాటల్ ఆల్బమ్‌ను విడుదల చేశారు. 16వ శతాబ్దానికి చెందిన ప్రముఖ కశ్మీర్ కవి హబ్బా ఖతూన్ రాసిన ఓ కవితను ఆయన గానం చేశారు. దాన్ని ఇటీవల విడుదలైన ‘నో ఫాదర్స్ ఇన్ కశ్మీర్’ అనే సినిమాలో ఉపయోగించారు. ప్రస్తుం కశ్మీర్ ప్రజల మనోభావాల గురించి ప్రశ్నించగా 1990 దశకంలో అక్కడ స్వతంత్య్ర బీజం పడిందని, అది మొక్కై పెరిగి, ఇప్పుడు వృక్షమైందని చెప్పారు. ఢిల్లీకి రద్దీ ఎక్కువగా ఉండడం వల్ల విమానం టిక్కెట్ నాలుగువేలయిందని చెప్పారు. మూడు వందల రూపాయల మెడిసిన్ కోసం పది వేల రూపాయలు ఖర్చు చేయాల్సి వచ్చిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సఫుద్దీన్ లాంటి వారు ఢిల్లీకి రాగలిగారుగానీ, ఆస్పత్రులకు వెళ్లేందుకు ఎలాంటి వాహనాలు లేక, వెళితే మందులు లేక స్థానిక ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. సాధారణ వేళల్లో శ్రీనగర్ ప్రభుత్వ ఆస్పత్రికి 800 నుంచి 900 మంది రోగులు వచ్చేవారని, గత ఐదు రోజులుగా రెండు వందలకు మించి రావడం లేదని అక్కడి ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. -
అసిఫా దోషులను శిక్షించాలి
తిరుపతి అర్బన్ /కల్చరల్ : జమ్ము కాశ్మీర్ కథువాలో చిన్నారి అసిఫాపై అత్యాచారం చేసి హత్య చేసిన దుర్మార్గులను కఠినంగా శిక్షించాలని మహిళా కాంగ్రెస్ నాయకురాళ్లు మంగళవారం రాత్రి కొవ్వొత్తుల ర్యాలీ చేపట్టారు. మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు రుద్రరాజు శ్రీదేవి, నగర అధ్యక్షురాలు బుర్రా సావిత్రియాదవ్ ఆధ్వర్యంలో అంబేడ్కర్ విగ్రహం నుంచి నగర వీధుల్లో ర్యాలీగా నిర్వహించి గాంధీ విగ్రహం వద్ద ముగించారు. మహిళలపై అత్యాచారాలు పెరిగిపోతున్నా, నిర్భయ చట్టం అమలులో ఉన్నా ఫలితం లేకపోవడం దారుణమన్నారు. ఈ కార్యక్రమంలో మహిళా కాంగ్రెస్ రాష్ట్ర నాయకురాలు ప్రమీలమ్మ, రిటైర్డ్ ప్రిన్సిపాల్ స్వరాజ్య లక్ష్మి, వివిధ మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు. క్రైస్తవుల ఆధ్వర్యంలో దేశ వ్యాప్తంగా బీజేపీ ప్రభుత్వం వచ్చాక మహిళలపై పెరిగిపోతున్న అత్యాచారాలు, అరాచకాలను అరికట్టాలని అసీఫా దోషులను శిక్షించాలని, పాస్టర్ అరుళ్ అరసు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. చిన్నారి అసీఫా హత్యను ఖండిస్తూ ఆమె ఆత్మకు శాంతి కలగాలని కోరుతూ తిరుపతి క్రైస్తవ సంఘాల ఆధ్వర్యంలో మంగళవారం రాత్రి తిరుపతి నగరంలో కొవ్వొత్తుల ర్యాలీ చేపట్టారు. మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం నుంచి నాలుగు కాళ్ల మండపం వరకు ర్యాలీ సాగింది. ఈ ర్యాలీలో పాస్టర్స్ రాజేంద్రన్, భీమిరెడ్డి, విజయకుమార్, డానియేల్, జాన్‌పాల్, దీలీప్, జయపాల్, ప్రమీల, జమిలా, క్రైస్తవులు, చిన్నారులు పాల్గొన్నారు. -
భారీ ఎన్కౌంటర్.. నలుగురు ఉగ్రమూక హతం
-
భారీ ఎన్కౌంటర్.. నలుగురు ఉగ్రమూక హతం
జమ్మూకశ్మీర్‌లో చొరబడేందుకు మరోసారి ఉగ్రవాదులు పెద్ద ఎత్తున ప్రయత్నించారు. దీంతో కుల్గాం జిల్లాలోని యారిపుర-ఫ్రిజల్ ప్రాంతంలో ఆదివారం ఉదయం భద్రతా దళాలు-ఉగ్రవాదుల మధ్య భారీ ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఎదురుకాల్పుల్లో నలుగురు ఉగ్రవాదులు మృతిచెందారు. ఇద్దరు భద్రతా సిబ్బంది కూడా ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు గాయపడ్డారు. స్థానికుడు కూడా ఒకరు చనిపోయినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం భద్రతాదళాలు-ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. మృతి చెందిన ఇద్దరు ఉగ్రవాదుల మృతదేహాలను భద్రతా దళాలు స్వాధీనం చేసుకున్నాయి. ఈ ప్రాంతంలో ఉగ్రవాదులు సంచరిస్తున్నారన్న సమాచారం అందండంతో భద్రతాదళాలు రంగంలోకి దిగాయి. యారిపుర-ఫ్రిజల్ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకొని ఆపరేషన్ ప్రారంభించాయి. మరో ముగ్గురు ఉగ్రవాదులు కూడా గాయపడ్డారని, వారు తప్పించుకునేందుకు ప్రయత్నిస్తున్నారని, కాల్పులు కొనసాగుతున్నాయని భద్రతా దళాలు తెలిపాయి.