జైళ్ల గదుల్లో జామర్లు..!
సాక్షి, ముంబై: ఇటీవల జైళ్లలో నేరస్తులు సెల్ఫోన్ల ను విని యోగించడం పెరిగిపోతుండటంతో బ్యారెక్స్‌ల్లోనూ జామర్లను ఏర్పాటుచేసేందుకు అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు అనుమతి మంజూ రు చేయాల్సిందిగా రాష్ట్ర జైళ్ల విభాగం హోం డిపార్ట్మెంట్కు ఓ లేఖ రాసింది. నిబంధనల ప్రకారం జైళ్లలో నేరస్తులు బయట వ్యక్తులతో ఎటువంటి సం బంధాలు, సంప్రదింపులు జరపకూడదు. కాగా, కొందరు జైలు సిబ్బంది నిర్వాకం వల్ల పలువురు నేరస్తులు అధికారుల కన్ను గప్పి జైళ్ల నుంచి సెల్ఫోన్ల ద్వారా తమ పనులను చక్కబెట్టుకోవడం ప్రారంభించారు.
జైళ్ల నుంచే తమ అనుచరులతో కిడ్నాప్‌లు,హత్యలు, బెదిరింపులకు పాల్పడుతుండేవారు. కొంతకాలానికి విషయం బయటపడటంతో జైళ్లలో మొబైల్ ఫోన్ల వాడకాన్ని నివారించేందుకు జామర్లను అమర్చారు. అయితే వాటిని జైళ్ల ఆవరణలోనే అమర్చడంతో అవి మొత్తం జైలు కాంపౌం డ్‌ను కవర్ చేయడంలో విఫలమయ్యాయి. దీంతో జైళ్లలో సెల్ఫోన్ల వాడకం ఏమాత్రం తగ్గలేదు. దీం తో జైళ్ల గదుల్లో కూడా జామర్లను ఏర్పాటుచేయాలని అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు జామర్ల కొనుగోలుకు అనుమతించాలని తాము రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరామనిఅడిషినల్ డెరైక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (జైళ్లు) మీరన్ బోర్వన్కర్ తెలిపారు.
ఆమోదం లభించిన వెంటనే ‘ప్రత్యేక’ బారెక్స్‌ల్లోనూ వీటి ని అమరుస్తామని ఆయన వివరించారు. జైళ్లలో చాలా మంది ఖైదీలు అనధికారికంగా సెల్ఫోన్లు ఉపయోగిస్తుండడాన్ని చాలా సందర్భాలలో గమనించామని అధికారి పేర్కొన్నారు. దీంతో విడివిడిగా బ్యారెక్సుల్లో వీటిని అమర్చేందుకు నిర్ణయిం చామని ఆయన చెప్పారు. వివిధ జైళ్లలో ఉంటున్న నేరస్తులు ఫోన్ల ద్వారా బెదిరింపు కాల్స్‌కు పాల్పడుతున్నట్లు అధికారి పేర్కొన్నారు.
కాగా, జైళ్లలో నేరస్తులు సెల్ఫోన్లు వినియోగించడాన్ని నిరోధించడానికి ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా ఫలితం ఉండటంలేదని అధికారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొందరు అవినీతి సిబ్బంది వల్ల జైళ్లలో శిక్ష అనుభవిస్తున్న బడా నేరస్తులు తమ ‘పనుల’ను సుల భంగా కానిచ్చేస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు. దీంతో వీటి వినియోగాన్ని నిరోధించాలంటే జామర్లను ఏర్పాటుచేయడమే ఉత్తమ మార్గమని తాము భావిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
గతంలో హ్యాండ్‌హెల్డ్, మెటల్ ఫ్రేమ్ డిటెక్టర్ల సహాయంతో జైళ్లలో మొబైల్ ఫోన్ల ఉపయోగాన్ని కొంత వరకు అరికట్టగలిగామన్నారు. అదే క్రమం లో కొన్ని జైళ్లలో జామర్లను కూడా అమర్చి నా వాటి లో కొన్ని పురానతమైనవి కాగా, మరికొన్ని వాడుకలో లేవన్నారు. అదేవిధంగా మరికొన్ని పని చేయ డం లేదని అధికారి తెలిపారు. కొన్ని సెంట్రల్ జైళ్ల లో ఆవరణలో నెలకొల్పిన జామర్లు మొత్తం పరిసరాలను కవర్ చేయడం లేదని ఆయన పేర్కొన్నారు.
దీంతో బడా నేరస్తుల కోసం జైళ్ల బ్యారెక్సుల్లోనూ జామర్లను ఏర్పాటు చేయడానికి నిర్ణయిం చినట్లు మీరన్ బోర్వన్కర్ తెలిపారు. కరడు గట్టిన నేరస్తులు ఎక్కువగా ఉండే ఆర్థర్రోడ్, తజోలా, నాసిక్ జైళ్లలో అక్రమ మొబైల్ ఫోన్ల వినియోగం ఎక్కువగా ఉందని బోర్వన్కర్ తెలిపారు. గతంలో గ్యాంగ్‌స్టర్ అబుసలీమ్‌పై కొందరు తలోజా జైలు లో కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. తర్వాత దేవేంద్ర జగ్‌పాత్ అనే వ్యక్తి తానే ఆ నేరం చేసినట్లు ఒప్పుకున్నాడు. కాగా, అబుసలేమ్‌ను హత్య చేయాలని గ్యాంగ్‌స్టర్ చోటా షకీల్, మరో ఇద్దరు తనను మొబైల్ ఫోన్లోనే సంప్రదించారని, వారి సూచన మేరకు అతడిపై కాల్పులు జరిపానని చెప్పాడు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకూడదంటే జామర్ల వినియోగం చాలా అవసరమని జైళ్ల అధికారులు భావిస్తున్నారు.