Jammu and Kashmir Police
-
ఈ ఫోటోకి ఏం అవార్డు ఇస్తారు?
శ్రీనగర్: 2017లో కశ్మీర్లో టెరరిస్టులు హతమార్చిన ఒక పోలీసు ఆఫీస్ కుమార్తె ఫోటోను జమ్మూ కశ్మీర్ పోలీసు ఆఫీసర్ ఇంతియాజ్ హుస్సేన్ తన ట్వీట్టర్లో పోస్ట్ చేశారు. ఈ ఫోటోలో తన తండ్రి ఉగ్రవాదుల చేతిలో బలికావడంతో ఆ పాప ఏడుస్తోంది. ఇది చూసిన ఎవరి హృదయమయిన కరిగిపోవాల్సిందే. ఆయన ఈ ఫోటోను పోస్ట్ చేస్తూ ఈ చిత్రం రాబోయే కాలంలో కూడా మానవత్వం ఉన్న ప్రతి మనిషి మనసాక్షిని వెంటాడుతోంది. ఓదార్చడానికి కూడా వీలు లేకుండా ఏడుస్తున్న ఈ పాప 2017లో కశ్మీర్లో జరిగిన ఉగ్రదాడిలో మరణించిన పోలీసు ఆఫీసర్ కూతురు. ఈ ఫోటోకి ఏమైనా అవార్డు లభిస్తుందా? అని ఇంతియాజ్ ట్వీట్ చేశారు. This picture should haunt the conscience of humanity for times to come. An inconsolable daughter of a police officer martyred in 2017 in Kashmir. Any awards for this photograph? pic.twitter.com/TJwpZCPaF7 — Imtiyaz Hussain (@hussain_imtiyaz) May 6, 2020 తాజాగా కశ్మీర్‌కు చెందిన ముగ్గురు ఫోటో జర్నలిస్టులు చన్నీ ఆనంద్, ముక్తార్ ఖాన్, దార్ యాసిన్‌లకు జీవిత చిత్రాలను చూపించినందుకు గాను పులిట్జర్ ప్రైజ్ 2020 లభించింది. దీంతో ఇప్పుడు ఈ అధికారి చేసిన పోస్ట్ ప్రాధాన్యత సంతరించుకుంది. వీరి ముగ్గురికి అవార్డు ఇచ్చే సమయంలో పులిట్జర్ బోర్డు తన వెబ్సైట్లో ఇండియా కశ్మీర్ భూభాగంలో కమ్యూనికేషన్‌ని బ్లాక్ చేయడం ద్వారా కశ్మీర్ స్వాతంత్ర్యాన్ని పొగొట్టిన సమయంలో అక్కడవారిని జీవితాల్ని ప్రతిబింబించే ఫోటోలు ఇవి అని పేర్కొంది. ఈ విషయం మీద కాంగ్రెస్, బీజేపీల మధ్య రాజకీయ దుమారం రేగుతోంది. వీరికి అభినందనలు తెలుపుతూ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ ఒక ట్వీట్ చేశాడు. దేశం గర్వపడేలా చేశారు అంటూ వారిని పొగడ్తలతో ముంచెత్తారు. దీనిపై బీజేపీ నేతలు మండిపడుతున్నారు. Congratulations to Indian photojournalists Dar Yasin, Mukhtar Khan and Channi Anand for winning a Pulitzer Prize for their powerful images of life in Jammu & Kashmir. You make us all proud. #Pulitzer https://t.co/A6Z4sOSyN4 — Rahul Gandhi (@RahulGandhi) May 5, 2020 బీజీపీ నేత సంబిత్ పాత్ర భారత్‌కు వ్యతిరేకమైన భావాలను వర్ణించడం ద్వారా వారికి ఈ అవార్డు లభించిందని, అవార్డు అందుకున్న వారిలో ఒకరైన దార్ కశ్మీర్‌ను భారత ఆక్రమిత కశ్మీర్‌గా తన ఫోటోలలో పేర్కొన్నారని తెలిపారు. అలాంటి వారికి అవార్డు వస్తే పొడగ్తలతో ముంచేత్తుతారా? రాహుల్, కశ్మీర్ భారతదేశ భూభాగం కాదా? అని సంబిత్ పాత్ర ప్రశ్నించారు. Will Sonia Gandhi answer? Whether She and the Congress Party concur with Rahul Gandhi on the issue of Kashmir not being an integral part of India! Rahul today congratulated those who got an award for considering Kashmir as a “Contested Territory”!#AntiNationalRahulGandhi pic.twitter.com/FoAimhYPrh — Sambit Patra (@sambitswaraj) May 5, 2020 -
టెర్రర్.. ట్రాన్స్ఫర్!
సాక్షి, జగిత్యాల: టెర్రరిస్టు లింకులపై విచారణలో భాగంగా జమ్మూకశ్మీర్ పోలీసులు జగిత్యాల జిల్లా మల్లాపూర్ పోలీస్‌స్టేషన్‌కు రావడం స్థానికంగా కలకలం రేపింది. మల్లాపూర్ మండలం కుస్తాపూర్ గ్రామానికి చెందిన సరికెల లింగన్నను రెండు రోజులుగా పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే.. జమ్మూ జిల్లాలోని అర్నియా పట్టణంలో ఉన్న ఆర్మీ బేస్ క్యాంపులో కూలీగా పనిచేసే రాకేశ్‌కుమార్‌పై ఆర్మీ అంతర్గత సమాచారాన్ని ఉగ్రవాదులకు చేరవేస్తున్నాడన్న ఆరోపణలతో జనవరి 5న కేసు నమోదైంది. రాకేశ్‌ను జమ్మూ పోలీసులు అదే నెల 20న అదుపులోకి తీసుకుని విచారించారు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్న పోలీసులు.. జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం కుస్తాపూర్‌కు చెందిన సరికెల లింగన్న బ్యాంకు ఖాతా నుంచి రాకేశ్‌కుమార్ ఖాతాకు ఫిబ్ర వరి 13న రూ.ఐదు వేలు, 25న రూ.4 వేల చొప్పున రెండు సార్లు నగదు జమ అయినట్లు గుర్తించారు. విచారణ నిమిత్తం సోమవారం ఉదయం జిల్లాకు చేరుకున్న జమ్మూ పోలీసుల బృందం లింగన్నను అదుపులోకి తీసుకుని విచారిస్తోంది. లింగన్న బావ శ్రీనివాస్‌ది మల్లాపూర్ మండలం మొగిలిపేట శ్రీనివాస్ పదేళ్లుగా దుబాయ్‌లో ఉంటున్నాడు. అక్కడ తనకు తెలిసిన ఓ పాక్ మిత్రుడు డబ్బు అవసరమని కోరితే శ్రీనివాస్ విన్నపం మేరకు లింగన్న తేజ్ యాప్ ద్వారా రెండుసార్లు డబ్బులు పంపినట్లు లింగన్న కుటుంబ సభ్యులు చెబుతున్నారు. హానీట్రాప్ కలకలం జమ్మూ జిల్లాలోని అర్నియా ఆర్మీ క్యాంపు సమీపంలోని పావల్‌కు చెందిన రాకేశ్‌కుమార్ ఆర్మీ శిబిరంలోనే కూలీ పనులు చేస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో అనితజెట్టి అనే మహిళ రాకేశ్‌కుమార్‌తో ఫేస్బుక్లో పరిచయం అయినట్లు తెలుస్తోంది. తనకు తాను జర్నలిస్టుగా పరిచయం చేసుకున్న అనితజెట్టి వృత్తిరీత్యా ఆర్మీకి సంబంధించిన సమాచారం తనకు ఇవ్వాలని కోరడంతోపాటు డబ్బు ఆశ చూపినట్లు సమాచారం. ఆమె ట్రాప్‌లో పడ్డ రాకేశ్‌కుమార్.. ఆర్మీక్యాంపు ప్రాంతంలో ఉన్న ఎత్తయిన ప్రాంతాలు, వాటర్ ట్యాంకులు, రైల్వేలైన్లు, రోడ్లు తదితర కీలక సమాచారం, ఫొటోలను ఫేస్బుక్ ద్వారా అనితజెట్టికి పంపడంతోపాటు తన ఫేస్బుక్ ఖాతాలో పోస్టు చేశాడు. ఈ విషయాన్ని గుర్తించిన పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. విచారణ సాగుతోంది: ఎస్ఐ ఆర్మీ క్యాంపు సమాచారం ఇతరులకు చేరవేసినందుకు జనవరి 5న రాకేశ్‌కుమార్‌పై జమ్మూలోని అర్నియాలో కేసు నమోదైంది. రాకేశ్‌కుమార్ బ్యాంకు ఖాతాకు మల్లాపూర్ మండలం కుస్తాపూర్‌కు చెందిన లింగన్న ఖాతా నుంచి రెండుసార్లు నగదు జమైనట్లు తేలడంతో జమ్మూ పోలీసులు విచారణ చేపడుతున్నారు. కేసు దర్యాప్తు ఇంకా కొనసాగుతోంది. –రవీందర్, ఎస్సై, మల్లాపూర్) -
పోలీసులతో ఘర్షణ; అలాంటిదేం లేదు..!
శ్రీనగర్ : ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్మూకశ్మీర్‌లో అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ఉండేందుకు కేంద్రం తగు జాగ్రత్తలు తీసుకుంది. ఈ నేపథ్యంలో దాదాపు 40 వేల మంది భద్రతా సిబ్బందిని అక్కడ బందోబస్తుకు వినియోగించుకుంటోంది. అయితే, జమ్మూకశ్మీర్ పోలీసులకు, సీఆర్పీఎఫ్ జవాన్లకు మధ్య ఘర్షణలు తలెత్తాయని వార్తలు బయటికొచ్చాయి. కర్ఫ్యూ పాస్ లేదని ఓ గర్భిణీని అడ్డుకోవడంతో రాష్ట్ర పోలీసు సిబ్బంది, సీఆర్పీఎఫ్ జవాన్ల మధ్య తీవ్ర ఘర్షణ చోటుచేసుకుందనీ.. రాష్ట్ర పోలీస్ సిబ్బంది ఒకరు కాల్పులు జరపడంతో ఐదురుగు జవాన్లు చనిపోయారనే వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. వాజ్ ఎస్ ఖాన్ పేరుతో ఓ పాకిస్తానీ ఈ ప్రచారానికి పూనుకున్నాడు. ఈ వార్తలో ఎంతమాత్రం నిజం లేదని సీఆర్పీఎఫ్, కశ్మీర్ పోలీసు దళం కొట్టిపారేశాయి. పుకార్లను నమ్మొద్దని స్పష్టం చేశాయి. రక్షణ దళాలేవైనా దేశం కోసం.. సుహృద్భావం వాతావరణంలో పనిచేస్తాయని చెప్పాయి. కోట్లాది భారతీయుల రక్షణ కోసం త్రివర్ణ పతాకం నీడలో తామంతా దేశ సేవకు అంకితమవుతామని.. తమ మధ్య ఎలాంటి భేదాలుండవని వెల్లడించాయి. యూనిఫారమ్‌లు వేరైనా మా లక్ష్యం దేశ రక్షణే అని సీఆర్పీఎఫ్ ట్వీట్ చేసింది. కొందరు నకీలీ కశ్మీరీలు ఉన్నతాధికారుల పేర్లతో ఫేక్ అకౌంట్లు సృష్టించి తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారని కశ్మీర్ పోలీస్ అధికారి ఇంతియాజ్ హస్సేన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జమ్మూ కశ్మీర్లో శాంతియుత వాతావరణం నెలకొనడంతో కొన్ని దుష్ట శక్తులు తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. ఇప్పటికైనా కల్పనలో ఉండకుండా వాస్తవంలోకి రావాలని హితవు పలికారు. The malicious content of this tweet is absolutely baseless and untrue. As always, all the security forces of India are working with coordination and bonhomie. Patriotism and our tricolour lie at the core of our hearts and existence, even when the color of our uniforms may differ. pic.twitter.com/1Rhrm09dPN — 🇮🇳CRPF🇮🇳 (@crpfindia) 12 August 2019 -
7 నెలల్లో 102 టెర్రరిస్టుల హతం
జమ్మూ: భద్రతా దళాలు, జమ్మూకశ్మీర్ పోలీసులు కలిపి ఈ ఏడాది ప్రారంభం నుంచి 102మంది ఉగ్రవాదులను మట్టుబెట్టారు. ఈ ఏడేళ్లలో జనవరి–జూలై నెలల్లో ఈ స్థాయిలో ఉగ్రవాదులను అంతంచేయడం ఇదే తొలిసారి. లష్కరే, హిజ్బుల్, జైషే వంటి ఉగ్రసంస్థల ప్రముఖుల జాబితాలను సిద్ధం చేసి వేట కొనసాగిస్తున్నారు. ఆపరేషన్ ‘హంట్ డౌన్’ పేరుతో చేపడుతున్న ఈ వేటలోనూ హిట్ లిస్ట్ ఆధారంగానే ముందుకెళ్తున్నట్లు కశ్మీర్ పోలీసు ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. 2010లో జనవరి–జూలై మధ్యలో గరిష్టంగా 156 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టారు. జూన్ 16న ఏడుగురు పోలీసులపై కాల్పులు జరిపి చంపిన ఘటన, అదేనెల 22న డిప్యూటీ ఎస్పీ మహ్మద్ అయూబ్ పండిట్‌పై దాడిచేసి చంపిన ఘటనల్లో పాల్గొన్న వారిని ఇప్పటికే భద్రతా బలగాలు అంతమొందించాయి. ఎక్కువ ఎన్కౌంటర్లు దక్షిణ కశ్మీర్‌లోని పుల్వామా, షోపియాన్, అనంత్‌నాగ్ జిల్లాల్లోనే జరిగాయి. -
'పాక్' యువతిని పెళ్ళాడిన శ్రీనగర్ పోలీస్..
శ్రీనగర్ః ఓ పక్క కశ్మీర్ లోయలో పాకిస్థాన్ అనుకూల నిరసనలు కొనసాగుతుండగా.. శ్రీనగర్ కు చెందిన ఓ యువ పోలీస్ అధికారి.. పాక్ అమ్మాయిని పెళ్ళాడటం కొంత సంచలనం రేపింది. జమ్మూ కశ్మీర్ కు చెందిన పోలీస్ సబ్ ఇనస్పెక్టర్ ఒవైస్ జిలానీ.. పాక్ ఆక్రమిత కశ్మీర్ లోని ముజఫరాబాద్ కు చెందిన ఫైజా జిలానీని వివాహమాడటం సర్వత్రా చర్చనీయాంశమైంది. అయితే ఆందోళనల నేపథ్యంలో ఆ వివాహ వేడుకకు వధూవరుల దగ్గరి బంధువులు మాత్రమే హాజరు కావాల్సి వచ్చింది. లోయలో దాదాపు రెండు నెలలపాటు అశాంతి నెలకొనడానికి తోడు.. నిరసనకారులు ఆగ్రహావేశాల్లో ఉండగా స్థానికంగా ఉన్న ఓ హోటల్ లో వివాహ కార్యక్రమం ప్రశాంతంగా జరిగింది. అయితే వధూవరులిద్దరూ దగ్గరి బంధువులే అయినా.. ఆ రెండు కుటుంబాలూ పాకిస్థాన్ విభజన సందర్భంలో విడిపోయాయి. అనంతరం శాంతి కారవాన్ పేరిట శ్రీనగర్ నుంచి ముజఫరాబాద్ మధ్య బస్ సేవలు ప్రారంభమవ్వడంతో.. వరుని తండ్రి షబీర్ జిలానీ.. 2014 లో పాక్ ఆక్రమిత కశ్మీర్ లోని తమ బంధువులను కలసి 'నిఖా' చేసుకున్నారు. వివాహం కుదుర్చుకున్న అనంతరం అనేక మార్లు క్రాస్ లాక్ బస్సు రద్దు కావడంతో వివాహం కూడా రద్దు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. చివరికి ఇటీవల సదరు బస్ సర్వీసులను పునరుద్ధరించడంతో వధువు సహా ఆమె సన్నిహిత కుటుంబ సభ్యులు వచ్చి శ్రీనగర్ లోని ఓ హోటల్ లో వివాహ కార్యక్రమాన్ని జరిపించారు. సీనియర్ జిలానీ కూడా పోలీస్ డిపార్ట్ మెంట్ లో పనిచేసి రిటైర్ అయ్యారు. దీంతో ఇస్లామాబాద్ నేషనల్ యూనివర్శిటీలో ప్లానింగ్ అండ్ మేనేజ్మెంట్ లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన కుమార్తె.. ఫైజీ జిలానీకి, కశ్మీర్ లో పోలీస్ సబ్ ఇనస్పెక్టర్ గా పనిచేస్తున్న.. తమ బంధువైన ఒవైస్ జిలానీతో.. వివాహం జరిపించారు.