26, 27 తేదీల్లో ‘జన్‌కల్యాణ్ సర్వ్: బీజేపీ
విజయనగరం అర్బన్: ప్రధాని మోడీ ఏడాది పాలనను పురస్కరించుకొని ఈ నెల 26, 27వ తేదీల్లో ‘జన్ కల్యాణ్ సర్వ్’ కార్యక్రమాన్ని జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తామని బీజేపీ జిల్లా కమిటీ నిర్ణయించింది. స్థానిక బీజేపీ కార్యాలయంలో ఆదివారం జరిగిన సమావేశంలో ఈ మేరకు ప్రటించారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు బవిరెడ్డి శివప్రసాద్‌రెడ్డి మాట్లాడుతూ 26న జిల్లావ్యాప్తంగా తొమ్మిది నియోజకవర్గాల పరిధిలో విజయోత్సవాలను జరుపుకుంటామని తెలిపారు.
అదే విధంగా ఈ నెల 27న జిల్లా కేంద్రంలో ఉదయం 10 నుంచి సాయంత్రం వరకు జరిగే కార్యక్రమానికి మాజీ మంత్రి కావూరి సాంబశివరావు హాజరవుతున్నారని తెలిపారు. గతంలో ఏ ప్రధానీ చేయని అభివృద్ధిని ఒక ఏడాదిలో మోడీ చేసి చూపించారని, ఈ విషయాన్ని క్షేత్ర స్థాయిలో ప్రజలకు తెలియజేస్తామని తెలిపారు. కార్యక్రమంలో సీనియర్ నేతలు పాకలపాటి సన్యాసిరాజు, డాక్టర్ పెద్దింటి జగన్మోహనరావు, ఇందుకూరి రఘురాజు, నిమ్మక జయరాజ్, పీవీవీ గోపాలరాజు, పి.అశోక్, ఎం.మధు, కెఎన్ఎం కృష్ణారావు, కుసుమంచి సుబ్బారావు, లక్ష్మీనరసింహం తదితరులు పాల్గొన్నారు.