26, 27 తేదీల్లో ‘జన్‌కల్యాణ్ సర్వ్: బీజేపీ | 'Jan Kalyan Parv' to mark one yr of Modi Govt on May 26: BJP | Sakshi
Sakshi News home page

26, 27 తేదీల్లో ‘జన్‌కల్యాణ్ సర్వ్: బీజేపీ

Published Mon, May 25 2015 12:21 AM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM

'Jan Kalyan Parv' to mark one yr of Modi Govt on May 26: BJP

 విజయనగరం అర్బన్: ప్రధాని మోడీ ఏడాది పాలనను పురస్కరించుకొని ఈ నెల 26, 27వ తేదీల్లో  ‘జన్ కల్యాణ్ సర్వ్’ కార్యక్రమాన్ని జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తామని బీజేపీ జిల్లా కమిటీ నిర్ణయించింది. స్థానిక బీజేపీ కార్యాలయంలో ఆదివారం జరిగిన సమావేశంలో ఈ మేరకు ప్రటించారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు బవిరెడ్డి శివప్రసాద్‌రెడ్డి మాట్లాడుతూ 26న జిల్లావ్యాప్తంగా తొమ్మిది నియోజకవర్గాల పరిధిలో విజయోత్సవాలను జరుపుకుంటామని తెలిపారు.
 
 అదే విధంగా ఈ నెల 27న జిల్లా కేంద్రంలో ఉదయం 10 నుంచి సాయంత్రం వరకు జరిగే కార్యక్రమానికి మాజీ మంత్రి కావూరి సాంబశివరావు హాజరవుతున్నారని తెలిపారు. గతంలో ఏ ప్రధానీ చేయని అభివృద్ధిని ఒక ఏడాదిలో మోడీ చేసి చూపించారని, ఈ విషయాన్ని క్షేత్ర స్థాయిలో ప్రజలకు తెలియజేస్తామని తెలిపారు. కార్యక్రమంలో సీనియర్ నేతలు పాకలపాటి సన్యాసిరాజు, డాక్టర్ పెద్దింటి జగన్మోహనరావు, ఇందుకూరి రఘురాజు, నిమ్మక జయరాజ్, పీవీవీ గోపాలరాజు, పి.అశోక్, ఎం.మధు, కెఎన్‌ఎం కృష్ణారావు, కుసుమంచి సుబ్బారావు, లక్ష్మీనరసింహం తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement