1 నుంచి బీజేపీ ప్రశిక్షణ తరగతులు | BJP prasiksana classes | Sakshi

1 నుంచి బీజేపీ ప్రశిక్షణ తరగతులు

Jul 28 2016 3:57 AM | Updated on Mar 29 2019 5:57 PM

1 నుంచి బీజేపీ ప్రశిక్షణ తరగతులు - Sakshi

1 నుంచి బీజేపీ ప్రశిక్షణ తరగతులు

పట్టణంలోని బాలాజీ ఫంక్షన్ హాల్‌లో ఆగస్టు 1 నుంచి 3వ తేదీ వరకు ప్రశిక్షణ తరగతులు నిర్వహిస్తున్నామని,

విజయనగరం అర్బన్ :  పట్టణంలోని బాలాజీ ఫంక్షన్ హాల్‌లో ఆగస్టు 1 నుంచి 3వ తేదీ వరకు ప్రశిక్షణ తరగతులు నిర్వహిస్తున్నామని, క్షేత్రస్థాయి కార్యకర్తలు సద్వినియోగం చేసుకోవాలని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి పైడి వేణుగోపాలం సూచించారు. స్థానిక బీజేపీ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన పార్టీ జిల్లా కోర్ కమిటీ సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ పథకాలపై అవగాహనతోపాటు పార్టీ సిద్ధాంతాలపై శిక్షణలో అవగాహన కలిగిస్తామన్నారు.
 
 పార్టీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ పెద్దింటి జగన్మోహన్‌రావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో రాష్ట్ర ప్రశిక్షణ ప్రముఖ్ కె.వి.మాధవ్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాలకపాటి సన్యాసిరాజు, జిల్లా ప్రశిక్షణా ప్రముఖ్ పి.వి.వి.గోపాలరాజు, మాజీ అధ్యక్షుడు బవిరెడ్డి శివప్రసాద్‌రెడ్డి, పార్టీ ప్రధాన కార్యదర్శి ముద్దాడ మధు, మజ్జి తలిటిరాజు, కె.ఎన్.ఎం.కృష్ణారావు, లక్ష్మీనరసింహం, పి.అశోక్, రేణుసింగ్, రెడ్డి పావని, విద్యాస్వరూప్, ఎస్.రాజు, గోపాల్‌రెడ్డి, అచ్చిరెడ్డి, రమేష్ తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Video

View all
Advertisement