విజయనగరం: తప్పులు లేని ఓటర్ నమోదు కోసం బూత్ లెవెల్ ఆఫీసర్ల(బీఎల్‌ఓ)కు బీజేపీ శ్రేణులు సహకరించాలని బీజేపీ మాజీ అధ్యక్షుడు భవిరెడ్డి శివప్రసాద్‌రెడ్డి పిలుపునిచ్చారు. పార్టీ స్థానిక కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా గత నెల 25వ తేదీ నుంచి ఇంటింట చేపడుతున్న సర్వే ఈ నెల 20వ తేదీ ముగుస్తుందన్నారు.
ఓటరు గుర్తింపుకార్డులేని, ఓటరు పేరులేని, ఇంటిపేరులోని తప్పులు సరిచేయడం వంటి కార్యక్రమంలో క్షేత్రస్థాయి శ్రేణలు సహకరించాలని కోరారు. ఓటరు లిస్టులో తప్పులున్న కారణంగా సగానికిపైగా ఓటు హక్కు వినియోగించుకోలేక పోవడం వల్ల ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా నాయకులు పి.అశోక్, లక్ష్మీనరింహం, కుసుమంచి సుబ్బారావు, అచ్చిరెడ్డి, యువమోర్చా జిల్లా అధ్యక్షుడు మంత్రిప్రగడ విద్యాస్వరూప్ పాల్గొన్నారు.
బీఎల్‌ఓలకు బీజేపీ శ్రేణులు సహకరించాలి
Published Thu, Jun 2 2016 11:43 AM | Last Updated on Thu, Mar 28 2019 8:37 PM
Advertisement
Advertisement