janachiatanya vedika
-
బాబు దుబారా వల్లే రాష్ట్రం అప్పులో కూరుకుపోయింది
-
కొత్త ప్రభుత్వానికి బాబు ఇచ్చే గిఫ్ట్ అదే
సాక్షి, గుంటూరు : రాబోయే నూతన ప్రభుత్వానికి చంద్రబాబు ఇచ్చే గిఫ్ట్ అప్పుల భారమే అని జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ రెడ్డి విమర్శించారు. శనివారమిక్కడ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఆంధ్ర ప్రదేశ్ అప్పుల ఊబిలో కూరుకుపోయిందని తెలిపారు. దేశంలో ఏ రాష్ట్రం చేయనన్ని అప్పులు ఏపీ చేసిందన్నారు. చంద్రబాబు అధికారం చేపట్టే నాటికి రాష్ట్రానికి అప్పు రూ. 90 వేల కోట్లు ఉంటే.. ఇప్పుడది రూ.3.5 లక్షల కోట్లకు చేరిందని తెలిపారు. చేసిన అప్పులు తీర్చడానికే రాష్ట్ర ప్రభుత్వం అప్పులు చేసిందంటే.. పరిస్థితి ఎలా ఉందో అర్థమవుతుందన్నారు. పుష్కరాల పేరుతో రూ. 3200 కోట్లు ఖర్చు చేస్తే.. అందులో కనీసం రూ. 300 కోట్ల పని కూడా జరగలేదన్నారు. పోలవరం ఎర్త్ డ్యాం ఒక్కశాతం కూడా పూర్తి కాలేదని లక్ష్మణ్ రెడ్డి ఆరోపించారు. దుబారా ఖర్చులకు రాష్ట్ర ప్రభుత్వం కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిందన్నారు. అప్పు చేసి తెచ్చిన డబ్బులన్ని చంద్రబాబు దీక్షలకు, విదేశీ పర్యటనలకు, దుబారా ఖర్చులకే సరిపోయాయని విమర్శించారు. అప్పుల ఊబిలో ఆంధ్రప్రదేశ్ అనే అంశంపై ఈనెల 21వ తేదీన గుంటూరులో మేధావులతో సదస్సు నిర్వహిస్తామని తెలిపారు. సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి : బాబు దుబారా వల్లే రాష్ట్రం అప్పులో కూరుకుపోయింది -
'ముఖ్యమంత్రులు ఇలాంటి పనిచేయొచ్చా?'
విజయవాడ: డబ్బుతో అధికారంలోకి రావడం.. అధికారంలోకి వచ్చాక డబ్బు సంపాదించుకోవడం రాజకీయ పార్టీలకు అలవాటుగా మారిందని 'సాక్షి' ఎడిటోరియల్ డైరెక్టర్ కే రామచంద్రమూర్తి అన్నారు. నాయకులు అధికారంలోకి వచ్చేందుకు అలివికాని హామీలు ఇస్తున్నారని చెప్పారు. తీరా అధికారం చేజిక్కించుకున్నాక ఆ హామీలను విస్మరిస్తున్నారని ఆయన చెప్పారు. జనచైతన్య వేదిక ఆధ్వర్యంలో ఆదివారం విజయవాడ ఎంబీ భవన్లో 'పార్టీ ఫిరాయింపులు- ప్రమాదంలో ప్రజాస్వామ్యం' అనే అంశంపై సదస్సు ప్రారంభమైంది. ఈ సదస్సులో కే రామచంద్రమూర్తి మాట్లాడుతూ రాజకీయం దళారీ వ్యవస్థగా మారడం ఆందోళనకరం అని ఆయన అన్నారు. ముఖ్యమంత్రులే స్వయంగా ఫిరాయింపులను ప్రోత్సహించడం రాజ్యాంగ ఉల్లంఘనే అని, స్పీకర్లు రాజ్యాంగబద్ధంగా వ్యవహరించాలి అని సూచించారు. వెంకయ్యలాంటి వ్యక్తులు ఫిరాయింపులపై ఆందోళన వ్యక్తం చేయడమే కాకుండా రాజ్యాంగ సవరణకు ప్రయత్నం చేయాలని కోరారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో ఎమర్జెన్సీ పరిస్థితులు కనిపిస్తున్నాయని చెప్పిన ఆయన రాజమండ్రి పరిసరాల్లో పోలీసు రాజ్యం నడుస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. -
పార్టీ ఫిరాయింపులపై జనచైతన్య వేదిక సదస్సు
విజయవాడ: ఇటీవలి కాలంలో రాజకీయ నాయకులు మంచినీళ్లు తాగినంత సులభంగా ఒక పార్టీ నుంచి మరో పార్టీలోకి మారుతున్నారు. ఈ నేపథ్యంలో జనచైతన్య వేదిక ఆధ్వర్యంలో ఆదివారం విజయవాడ ఎంబీ భవన్లో 'పార్టీ ఫిరాయింపులు- ప్రమాదంలో ప్రజాస్వామ్యం' అనే అంశంపై సదస్సు నిర్వహిస్తున్నారు. 'సాక్షి' ఎడిటోరియల్ డైరెక్టర్ కె. రామచంద్రమూర్తి సదస్సును ప్రారంభించారు. మాజీ ఎమ్మెల్సీ లక్ష్మణ్‌రావు, ప్రొఫెసర్లు నూర్‌బాషా, రంగయ్య, రాజనీతి శాస్త్ర అధ్యాపకుడు అంజిరెడ్డి, లక్ష్మణ్ రెడ్డి తదితరులు ఈ సదస్సుకు హాజరయ్యారు.