janga reddy gudem
-
మద్దిలో పాము హల్చల్
సాక్షి, జంగారెడ్డిగూడెం : మండలంలోని గుర్వాయిగూడెం మద్ది ఆంజనేయస్వామి ఆలయంలో సోమవారం పాము హల్చల్ చేసింది. ఆలయ పరిసరాల్లో పాము తిరిగాడటంతో సిబ్బంది స్నేక్ సేవియర్స్ సొసైటీ వ్యవస్థాపకులు చదలవాడ క్రాంతికుమార్‌కి సమచారం ఇచ్చారు. ఆయన ఇక్కడకు వచ్చి పామును పట్టుకుని జనావాసాలు లేని అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు. -
జంగారెడ్డిగూడెంలో టీడీపీకి షాక్!
సాక్షి, జంగారెడ్డిగూడెం: పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం లో టీడీపీకి షాక్ తగిలింది. టీడీపీ, కాంగ్రెస్ పార్టీల నుంచి మూడు వందల మంది కార్యకర్తలు గురువారం వైఎస్సార్ సీపీలోకి చేరారు. చింతలపూడి ఎమ్మెల్యే ఎలీజా వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నేతలు వందనపు సాయి బాలపద్మ, పొల్నాటి బాబ్జి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఎలీజా మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రవేశపెట్టిన నవరత్నాల పథకాలకు ఆకర్షితులై వందలాదిగా వైఎస్సార్సీపీలోకి చేరుతున్నారని తెలిపారు. ఆరు నెలల కాలంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా వైఎస్ జగన్ పాలన చేశారని పేర్కొన్నారు. ఎంతో మంది నాయకులు అవకాశాలు ఉంటేనే సేవ చేస్తారని.. కానీ సీఎం జగన్ అవకాశం కల్పించుకుని సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతున్నారని చెప్పారు. ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపటినప్పటి నుండి రోజుకోక పథకం ప్రవేశపెడుతున్నారన్నారు. దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని సాహసోపేత నిర్ణయాలు తీసుకుని చరిత్ర సృష్టిస్తున్నారన్నారు. మహిళల కోసం మద్యపాన నిషేధం తో పాటు, బీసీ మహిళలకు చేయూతనిచ్చే పథకాలు అమలు చేస్తున్నారని వివరించారు. జంగారెడ్డిగూడెం ను గ్రీన్ సిటిగా తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు. జంగారెడ్డిగూడెం వంద పడకల ప్రభుత్వాసుపత్రి ఆధునీకరణ కోసం తొమ్మిది కోట్ల రూపాయలు విడుదల చేశామని వెల్లడించారు. ఆరు కోట్ల రూపాయలతో డ్రైయిన్ల నిర్మాణం చేపడతామని ఎమ్మెల్యే ఎలీజా పేర్కొన్నారు. -
అంతర్ జిల్లా దొంగల ముఠా అరెస్ట్
సాక్షి, జంగారెడ్డిగూడెం: ఉభయగోదావరి జిల్లాల్లో చోరీలకు పాల్పడుతున్న నలుగురు సభ్యుల అంతర్ జిల్లా దొంగల ముఠాను పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. జంగారెడ్డిగూడెం, ఉండ్రాజవరం, రాజమండ్రి, భీమవరం, ఉండి, బొమ్మూరు, తడికలపూడి, ద్వారకా తిరుమల, దెందులూరు, గణపవరం, భీమవరం రూరల్ పోలీసు స్టేషన్ల పరిధిలో పలు దొంగతనాలకు పాల్పడ్డారు. వీరి నుంచి 190 గ్రాముల బంగారు ఆభరణాలు, 35 గ్రాముల వెండి, రెండు బైక్‌లు, 20 మేలు జాతి కోడిపుంజులను స్వాధీనం చేసుకున్నారు. 13,33,700 రూపాయల చోరీ సొత్తును పోలీసులు రీకవరీ చేశారు. వీరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
అంతర్రాష్ట్ర కారు దొంగల అరెస్ట్
జంగారెడ్డిగూడెం: కార్ల దొంగతనానికి పాల్పడుతోన్న ఇద్దరు దొంగలను పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. వీరిని పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డి గూడెంలో పట్టుకున్నారు. పట్టుబడిన నిందితుల పేర్లు వాసా చంద్రశేఖర్, దంతులూరి కృష్ణంరాజుగా గుర్తించారు. వీరి వద్ద నుంచి రూ. 3 లక్షల 40 వేల నగదు, మూడు మారుతీ బ్రెజా కార్లు స్వాధీనం చేసుకున్నారు. ఢిల్లీలో దొంగతనం చేసిన కార్లు కొని వాటికి నకిలీ ఆర్సీలు సృష్టించి బహిరంగ మార్కెట్లో నిందితులు అమ్ముతున్నట్లుగా పోలీసులు గుర్తించారు. కొండపల్లి ప్రసాద్ అనే వ్యక్తి తాను కొన్న బ్రెజా కారును సర్వీస్ నిమిత్తం మారుతీ సర్వీస్ సెంటర్‌కు తీసుకెళ్లారు. సర్వీస్ సెంటర్ నిర్వాహకులు ఆన్లైన్లో చెకింగ్ చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
వైఎస్ విజయమ్మ రోడ్‌షోను జయప్రదం చేయండి
జంగారెడ్డిగూడెం, న్యూస్‌లైన్ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ మంగళవారం సాయంత్రం జంగారెడ్డిగూడెం పట్టణంలో నిర్వహించనున్న రోడ్‌షోను జయప్రదం చేయాలని చింతలపూడి నియోజకవర్గ సమన్వయకర్త మద్దాల రాజేష్‌కుమార్ కోరారు. సోమవారం సాయంత్రం జంగారెడ్డిగూడెం క్యాంపు కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ విజయమ్మ రోడ్‌షో సాయంత్రం ఖమ్మం జిల్లా నుంచి జంగారెడ్డిగూడెం మండలం శ్రీనివాసపురంలో ప్రవేశిస్తుందన్నారు. అక్కడి నుంచి ప్రభుత్వ డిగ్రీ కళాశాల మీదుగా పొట్టి శ్రీరాములు విగ్రహం, గంగానమ్మ గుడి సెంటర్ మీదుగా బోసుబొమ్మ సెంటర్‌కు రోడ్‌షో చేరుతుందని, సాయంత్రం ఆరు గంటలకు విజయమ్మ ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమానికి నగర పంచాయతీ పరిధిలో ఉన్న వార్డు కౌన్సిల్‌గా పోటీ చేస్తున్న అభ్యర్థులు, నియోజకవర్గంలోని జెడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో పట్ణణ పార్టీ కన్వీనర్ చనమాల శ్రీనివాసరావు, వైసీపీ మండల కన్వీనర్ నులకాని వీరాస్వామి నాయుడు, నాయకులు మండవల్లి సొంబాబు, పోల్నాటి బాబ్జి, బీవీఆర్ చౌదరి, కనమతరెడ్డి శ్రీనివాసరెడ్డి, మంగా రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. కార్యకర్తలు భారీగా తరలిరావాలి మంగళవారం సాయంత్రం జంగారెడ్డిగూడెంలో జరిగే వైసీపీ రాష్ట్ర గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ పర్యటనను విజయవంతం చేయాలని ఆ పార్టీ జిల్లా బీసీసెల్ కన్వీనర్ పాశం రామకృష్ణ తెలిపారు. విజయమ్మ రోడ్‌షో కార్యక్రమానికి మహిళలు పెద్ద సంఖ్యలో తరలిరావాలని వైసీపీ జంగారెడ్డిగూడెం పట్టణ మహిళా విభాగం కన్వీనర్ వందనపు సాయిబాల పద్మ ఓ ప్రకటనలో కోరారు.