సాక్షి, జంగారెడ్డిగూడెం: ఉభయగోదావరి జిల్లాల్లో చోరీలకు పాల్పడుతున్న నలుగురు సభ్యుల అంతర్ జిల్లా దొంగల ముఠాను పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. జంగారెడ్డిగూడెం, ఉండ్రాజవరం, రాజమండ్రి, భీమవరం, ఉండి, బొమ్మూరు, తడికలపూడి, ద్వారకా తిరుమల, దెందులూరు, గణపవరం, భీమవరం రూరల్ పోలీసు స్టేషన్ల పరిధిలో పలు దొంగతనాలకు పాల్పడ్డారు. వీరి నుంచి 190 గ్రాముల బంగారు ఆభరణాలు, 35 గ్రాముల వెండి, రెండు బైక్‌లు, 20 మేలు జాతి కోడిపుంజులను స్వాధీనం చేసుకున్నారు. 13,33,700 రూపాయల చోరీ సొత్తును పోలీసులు రీకవరీ చేశారు. వీరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment