jangalapalli srinivasulu
-
టీడీపీ శ్రేణులను రెచ్చగొట్టి దాడులకు ఉసిగొల్పిన చంద్రబాబు
-
వైఎస్సార్సీపీలో భారీ చేరికలు
చిత్తూరు జిల్లా : ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ వైఎస్సార్సీపీలో చేరికలు ఊపందుకున్నాయి. తాజాగా వీకోట మండలం కోడి గుట్టపల్లి, రెడ్డిపల్లి గ్రామాలకు చెందిన పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు భారీగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి వెంకటేశ్ గౌడ్, పలమనేరు మండల పార్టీ ఇంచార్జి దివికుమార్ల ఆధ్వర్యంలో సుమారు 150 మంది పార్టీలో చేరారు. వీరికి చిత్తూరు వైఎస్సార్సీపీ పార్లమెంటు ఇంచార్జ్ జంగాలపల్లి శ్రీనివాసులు పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా జంగాలపల్లి శ్రీనివాసులు మాట్లాడుతూ..ఎన్నికల్లో తినడానికి ఆరు వందలకు పైగా అబద్ధపు హామీలు ఇచ్చిన టీడీపీ అధినేత నారా చంద్ర బాబు నాయుడు అధికారంలోకి రాగానే అన్ని వర్గాల వారికి అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ చర్యలకు ప్రజలు విసిగిపోయి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ప్రజలందరూ నమ్మడం వల్లే ఈ రోజు భారీగా పార్టీలో చేరడానికి ముందుకొస్తున్నారని, ఇది ఒక శుభపరిణామంగా తాము భావిస్తున్నామని తెలిపారు. రానున్న కాలంలో వైఎస్సార్సీపీ మరింత బలోపేతం అవుతుందని, 2019 ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించి జగన్‌ను ముఖ్యమంత్రిగా చేయడమే తన లక్ష్యమని జంగాలపల్లి శ్రీనివాసులు పేర్కొన్నారు. -
చంద్రబాబుకు సొంత జిల్లాలో షాక్
వైఎస్సార్ సీపీలో చేరిన చిత్తూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడు జంగాలపల్లి అదే బాటలో ఖమ్మం జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు వనమా వెంకటేశ్వరరావు పార్టీలోకి ఆహ్వానించిన జగన్మోహన్రెడ్డి విశ్వసనీయత కలిగిన జగన్‌తోనే వైఎస్ ఆశయాలు సాకారమవుతాయన్న నేతలు హెదరాబాద్: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు ఆయన సొంత జిల్లాలోనే రాజకీయ షాక్ తగిలింది. చిత్తూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడు జంగాలపల్లి శ్రీనివాసులు ఆ పార్టీకి గుడ్‌బై చెప్పి మంగళవారం వైఎస్సార్ కాంగ్రెస్‌లో చేరారు. అలాగే తెలంగాణలోని ఖమ్మం జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా పద్నాలుగేళ్ల పాటు సేవలందించిన వనమా వెంకటేశ్వరరావు కూడా పార్టీని వీడి వైఎస్సార్ కాంగ్రెస్‌లో చేరారు. జంగాలపల్లి, వనమా ఇద్దరూ మంగళవారం వైఎస్ జగన్మోహన్రెడ్డిని ఆయన నివాసంలో విడివిడిగా కలుసుకున్నారు. తమ అనుచరులతో వచ్చిన వీరిని జగన్ సాదరంగా ఆహ్వానించి పార్టీ కండువాలను వేసి పార్టీలోకి ఆహ్వానించారు. జంగాలపల్లి శ్రీనివాసులు చేరిక సందర్భంగా రాజంపేట లోక్‌సభా నియోజకవర్గం వైఎస్సార్ సీపీ సమన్వయకర్త పి.మిథున్‌రెడ్డి కూడా ఉన్నారు. బాబుకు విశ్వసనీయత లేదు: జంగాలపల్లి చంద్రబాబు ఏ మాత్రం విశ్వసనీయత లేని నాయకుడని, అసలు ఆయనకు మనుషులంటే అభిమానం లేదని, ఎవరినీ ఆదరించే రకం కాదని జంగాలపల్లి శ్రీనివాసులు విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశ్వసనీయతకు వారసత్వంగా ఉన్న నాయకుడు జగన్ ఒక్కరేనని, అందుకే ఆయన నాయకత్వంలో పని చేయాలని టీడీపీ అధ్యక్ష పదవిని వదులుకుని వైఎస్సార్ సీపీలో చేరానని మీడియాకు తెలిపారు. చిత్తూరు జిల్లాలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో చంద్రబాబు అనుసరిస్తున్న అస్తవ్యస్త విధానాలను పార్టీ నేతలు, కార్యకర్తలందరూ ముక్త కంఠంతో ఖండిస్తున్నామని, ఆయన చేసిన తప్పులను, అన్యాయాలను తప్పకుండా ప్రజలకు చాటి చెబుతామని అన్నారు. చంద్రబాబులో విశ్వసనీయత లేదని, జగన్‌లో విశ్వసనీయత ఉందని, ఇదొక్కటే తాను వైఎస్సార్ సీపీలో చేరడానికి కారణమని చెప్పారు. ‘ఇకపై జగన్ ఏం చెబితే జిల్లాలో అది చేస్తాం. ఆయన ముఖ్యమంత్రి అయ్యేందుకు అన్ని విధాలా గట్టిగా కృషి చేస్తాం’ అని శ్రీనివాసులు స్పష్టం చేశారు. వైఎస్ పథకాల వల్ల బడుగులకు మేలు: వనమా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాల వల్ల రాష్ట్రంలోని బడుగు బలహీన వర్గాల వారికి ఎంతో మేలు జరిగిందని, ఆయన వల్ల లబ్ధి పొందిన వారు తెలంగాణలో కూడా లక్షల సంఖ్యలో ఉన్నారని వనమా వెంకటేశ్వరరావు తెలిపారు. పార్టీలో చేరిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వైఎస్సార్ ఆశయాల అమలుకు కృషి చేసే నాయకుడు జగన్ మాత్రమేనన్న నమ్మకంతో వైఎస్సార్ కాంగ్రెస్‌లో చేరానన్నారు. పద్నాలుగేళ్లు నిబద్ధతతో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా పని చేసిన తనను కాంగ్రెస్ పార్టీ చివరి దశలో మోసం చేసిందన్నారు. కాంగ్రెస్, సీపీఐ రెండూ నిబద్ధత లేని పార్టీలని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఖమ్మం లోక్‌సభా స్థానం పార్టీ సమన్వయకర్త పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ వనమా పార్టీలో చేరినందుకు తమకు ఆనందంగా ఉందని, ఆయన చేరిక తెలంగాణలో వైఎస్సార్సీపీ ప్రభంజనం సృష్టిస్తుందనడానికి సంకేతమని అన్నారు. తెలంగాణ పునర్నిర్మాణంలో మిగిలిపోయిన సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం పూర్తి చేసేందుకు తమ పార్టీ కృషి చేస్తుందని చెప్పారు. -
బాబుకు జేఎంసీ షాక్
సాక్షి, చిత్తూరు: తెలుగుదేశం పార్టీ చిత్తూరు జిల్లా అధ్యక్షులు జంగాలపల్లి శ్రీనివాసులు(జేఎంసీ) ఆ పార్టీ అధినేత చంద్రబాబుకు గట్టి షాక్ ఇచ్చారు. చంద్రబాబు నిరంకుశ పోకడలు, నమ్మకద్రోహానికి నిరసనగా ఆ పార్టీ పదవికి, సభ్యత్వానికి రాజీనామా చేశారు. మంగళవారం హైదరాబాద్‌లో వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో వైఎస్సార్ సీపీలో చేరారు. టీడీపీ జిల్లా పగ్గాలు తీసుకునేందుకు ఎవరూ ముందుకు రాని సమయంలో, కష్టకాలంలో ఆ పార్టీ భారం మోసిన జం గాలపల్లి శ్రీనివాసులుకు చంద్రబాబు చిత్తూరు ఎమ్మెల్యే టికెట్టు ఇస్తానని హామీ ఇచ్చి, ఇప్పు డు డీకే కుటుంబానికి టికెట్టు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. దీంతో తన అభిప్రాయానికి విలువ ఇవ్వని పార్టీలో కొనసాగలేక జంగాలపల్లి శ్రీనివాసులు బయటకు వచ్చారు. జిల్లా తెలుగుదేశం నాయకులకు కూడా ఒకరకంగా ఇది పెద్దషాకే. పార్టీలో కష్టపడి పని చేస్తూ జిల్లా అధ్యక్ష స్థానం లో ఉన్న వ్యక్తికే విలువ ఇవ్వకపోతే రేపు ఎన్నికల్లో కష్టపడి పనిచేసినా తమకెంతమాత్రం గౌరవమిస్తారనే ప్రశ్న వ్యక్తమవుతోంది. చిత్తూరులో తొలి నుంచి ట్రస్టు ద్వారా ఉచిత మంచినీటి సరఫరా, ఇతర సేవా కార్యక్రమాలు చేస్తున్నారని ప్రజల్లో జంగాలపల్లికి పేరుంది. గతంలో సుదీర్ఘకాలం టీడీపీలో కొనసాగారు. 2009లో పీఆర్పీ నుంచి చిత్తూరు ఎమ్మెల్యేగా పోటీ చేసి సీకే బాబు చేతిలో 1500 ఓట్ల తేడాతో ఓడిపోయూ రు. తర్వాత టీడీపీలో చేరారు. జిల్లా నాయకత్వం తీసుకునేందుకు, పార్టీ కోసం డబ్బులు ఖర్చుచేసేందుకు అందరూ వెనుకాడుతున్న తరుణంలో జిల్లా బాధ్యతలను తలకెత్తుకుని పనిచేశారు. అయినా చంద్రబాబు సామాజికవర్గం తొలి నుంచి చిత్తూరు టికెట్టు రానివ్వకుండా జంగాలపల్లికి అడ్డుపడుతూ వచ్చింది. ఈ నేపథ్యంలో ఆయన ఆ పార్టీ నుంచి బయటకు రావాలని నిర్ణయం తీసుకున్నారు. చిత్తూరులో బలోపేతమైన వైఎస్సార్సీపీ జంగాలపల్లి శ్రీనివాసులు వైఎస్సార్సీపీలో చేరడంతో చిత్తూరు, పలమనేరు నియోజకవర్గాల్లోని ఆయన అనుచరవర్గం, బంధువులు వైఎస్సార్సీపీ వైపు రానున్నారు. తద్వారా సార్వత్రిక ఎన్నికల్లో చిత్తూరు నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ బలపడుతుంది. అంతేగాక గెలుపుదిశగా పయనించడానికి అవకాశం ఉంది. అదే సమయంలో టీడీపీలోని బలిజ సామాజికవర్గానికి చెందిన ప్రధానమైన వర్గం వైఎస్సార్సీపీ వైపు మరలనుంది. ఇప్పటికే ఏఎస్ మనోహర్‌ను ఇక్కడ బలిజ సామాజికవర్గం నుంచే పార్టీ సమన్వయకర్తగా వైఎస్ జగన్మోహన్రెడ్డి నియమించారు. ఇప్పుడు అదే సామాజికవర్గానికి ఇంకా ప్రాధాన్యం ఇచ్చి మరొక ముఖ్య నాయకుడిని పార్టీలో చేర్చుకున్నారు. ఈ క్రమంలో చిత్తూరు నియోజకవర్గంలో ఓట్లపరంగా అధిక సంఖ్యలో ఉన్న బలిజ సామాజికవర్గం వైఎస్సార్సీపీకి మద్దతుగా నిలవనుంది. మరికొంత మంది వైఎస్సార్సీపీ బాట బాబు వైఖరితో విసిగిపోయిన ఇంకొంతమంది తెలుగుదేశం పార్టీ జిల్లా నాయకులు కూడా త్వరలో వైఎస్సార్సీపీ బాట పట్టనున్నారు. సొంత జిల్లాలో చంద్రబాబుకు ఇది దిమ్మతిరిగి మైండ్ బ్లాక్ అయ్యే విషయమే. ఇప్పటికే మదనపల్లెలో అసెంబ్లీ టికెట్టు బీజేపీకి వదిలేసిన కారణంగా తమ్ముళ్ల తిరుగుబాటు చంద్రబాబుకు సమస్యగా ఉంది. ఈ క్రమంలో చిత్తూరు నియోజకవర్గంలోనూ పార్టీ కోసం రూ.కోట్లు ఖర్చుపెట్టగలిగే వారికే టికెట్టు ఇవ్వాలని నిర్ణయం తీసుకుని, జంగాలపల్లి శ్రీనివాసులుకు మొండిచేయి చూపడంతో ఆయన జిల్లా అధ్యక్ష పదవికి, పార్టీకి రాజీనామా చేశారు. పార్టీ పగ్గాలు చంద్రబాబుకు చేతికి వచ్చిన తర్వాత సొంత జిల్లాలో ఇంత పెద్ద స్థాయిలో షాక్ ఇవ్వడం ఇదే తొలిసారి అని, ఎన్నికల ముందు ఇప్పటికిప్పుడు టీడీపీ జిల్లా అధ్యక్షునిగా ఉండేందుకు ఎవరూ ముందుకు వచ్చే పరిస్థితి లేదని తెలుగు తమ్ముళ్లు చెబుతున్నారు. ఇప్పుడు జిల్లా అధ్యక్ష పదవి తీసుకుంటే చేతి నుంచి నిర్వహణ ఖర్చులు, ఇతర ఖర్చులు వారే పెట్టుకోవాల్సి వస్తుంది. దీంతో ఆ దిశగా ఆలోచన చేయూలంటేనే టీడీపీ నాయకులు వెనుకంజ వేస్తున్నారు. ఈ క్రమంలో సార్వత్రిక ఎన్నికల నామినేషన్ దాఖలు కార్యక్రమం ఏప్రిల్ 12 నుంచి ప్రారంభం కానుంది. ఇప్పుడు చంద్రబాబు సొంత జిల్లాలోనే జంగాలపల్లి రాజీనామాతో టీడీపీ చుక్కాని లేని నావలాగా తయారైనట్లే. -
వైసీపీలో చేరిన జంగాలపల్లి శ్రీనివాసులు