Janipalli Srinivasa Rao
-
కత్తి శీనుతో కొత్త డ్రామా!
సాక్షి, విశాఖపట్నం: ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డిపై విశాఖ ఎయిర్‌పోర్టులో హత్యాయత్నానికి పాల్పడిన నిందితుడు జనుపల్లి శ్రీనివాసరావుతో మరో డ్రామాకు రంగం సిద్ధమైంది. ప్రస్తుతం విశాఖ కేంద్ర కారాగారంలో రిమాండ్ ఖైదీగా ఉన్న నిందితుడు శ్రీనివాసరావు ‘మార్పు కోసం’ పేరుతో ఓ పుస్తకాన్ని రాసేందుకు సిద్ధమైనట్లు సమాచారం. ప్రతిపక్ష నేతను అంతమొందించేందుకు పథకం వేసిన పెద్దలే తాజా నాటకానికీ సూత్రధారులనే ప్రచారం జరుగుతోంది. శ్రీనివాసరావు రాసినట్లుగా చెబుతున్న 11 పేజీల లేఖలో పేర్కొన్న అంశాలనే ఓ పుస్తకంగా ముద్రించి నిందితుడికి ప్రచారం కల్పించాలని భావిస్తున్నట్లు తెలిసింది. మరోవైపు తాను చెప్పదలుచుకున్న అంశాలను శ్రీనివాసరావు 22 పేజీల నోట్‌బుక్‌లో రాసినట్టు అతడి తరపు న్యాయవాది ఎ.సలీం ‘సాక్షి’కి తెలిపారు. దీన్ని విడుదల చేసేందుకు అనుమతి ఇవ్వాలని హోంశాఖ మంత్రి, జైళ్ల శాఖ డీఐజీ, డీజీలకు లేఖ రాస్తానని చెప్పారు. పుస్తకం పేరుతో శ్రీనివాసరావు కాగితాలపై రాసిన విషయాన్ని జైళ్ల శాఖ ఉన్నతాధికారులు, ప్రభుత్వానికి తెలియజేస్తానని విశాఖ కేంద్ర కారాగారం సూపరింటెండెంట్ రాహుల్ తెలిపారు. ప్రభుత్వ అనుమతి లేనిదే ఖైదీలు రాసిన పుస్తకం విడుదలకు వీలు కాదని స్పష్టం చేశారు. -
నేటితో ముగియనున్న శ్రీనివాస్ కస్టడీ
-
నేటితో ముగియనున్న శ్రీనివాస్ కస్టడీ
విశాఖపట్నం: వైఎస్సార్సీపీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై హత్యాయత్నం చేసిన శ్రీనివాస్ పోలీసు కస్టడీ నేటితో ముగియనుంది. పోలీసులు గత ఆరు రోజులుగా శ్రీనివాస్‌ను విచారించడంతో పాటు, అతని కాల్ డేటాను విశ్లేషించారు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటి వరకు 40 మందిని విచారించారు. శ్రీనివాస్ నుంచి అదనంగా ఎలాంటి సమాచారాన్ని సిట్ రాబట్టలేకపోయినట్లు తెలిసింది. శ్రీనివాస్ పోలీసు కస్టడీ పొడిగింపు కోసం సిట్, కోర్టులో పిటిషన్ వేసే ఆలోచనలో ఉంది. విచారణ తీరు పరిశీలిస్తే కుట్ర కోణంలో సిట్ దర్యాప్తు సాగుతున్నట్లు కనపడం లేదని ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున ఆరోపిస్తున్నాయి. ఈ కేసులో కీలక నిందితుడు జానిపల్లి శ్రీనివాస్ తనకు ప్రాణహాని ఉందంటూ చెప్పడంతో ఏపీ డీజీపీ ఆర్పీ ఠాకూర్, విశాఖపట్నం సీపీలకు జాతీయ ఎస్సీ కమిషన్ నోటీసులు కూడా జారీ చేసింది. నిందితుడు శ్రీనివాస్‌కు ప్రాణహానిపై ఎస్సీ కమిషన్ నివేదిక కూడా కోరింది. 30 రోజుల్లో నివేదిక ఇవ్వాలని నోటీసులో పేర్కొంది. -
జగన్‌పై హత్యాయత్నం ఘటన కేసు రెండోరోజు విచారణ
-
జగన్‌పై హత్యాయత్నం: రెండోరోజు సిట్ విచారణ
సాక్షి, విశాఖపట్నం : వైఎస్ జగన్‌పై హత్యాయత్నం కేసు విచారణ రెండోరోజూ కొనసాగింది. నిందితుడు శ్రీనివాస్‌ను సిట్ అధికారులు విచారించారు. అతనితోపాటు రమాదేవి, రేవతీపతి, విజయదుర్గను కూడా అధికారులు విచారించారు. నిందితుడి కాల్ డేటానుబట్టి సమాచారాన్ని రాబట్టే యత్నం చేశారు. నిందితుడి టాబ్లోని సమాచారాన్ని కూడా పోలీసులు రాబడుతున్నారు. రెండోరోజు ముగ్గుర్ని మాత్రమే సిట్ అధికారులు అదనంగా విచారించారు. ఇక, జనవరిలోనే ఎయిర్‌పోర్ట్‌లోకి కత్తి తీసుకొచ్చినట్టు గుర్తించారు. అప్పటినుంచి టీడీపీ నేత హర్షవర్ధన్ హోటల్లోనే కత్తి ఉంది. హత్యాయత్నం జరిగిన రోజు హోటల్ నుంచే నిందితుడు కత్తి తీసుకొచ్చాడని నిర్దారించారు. మరోవైపు శ్రీనివాస్‌కు చెందిన విజయా బ్యాంక్, ఆంధ్రా బ్యాంక్, స్టేట్‌బ్యాంకు ఖాతాల్లోని లావాదేవీలను పోలీసులు పరిశీలిస్తున్నారు. లంకలో కోటి రూపాయల విలువచేసే భూమి కొనుగోలు చేసేందుకు శ్రీనివాస్ బేరమాడినట్టు గుర్తించారు. భూముల లావాదేవీలపై ఆరా తీస్తున్న పోలీసులు కుట్రకోణంపై మాత్రం దృష్టిపెట్టడం లేదు. సీసీ కెమెరాల దృశ్యాల పరిశీలన.. వైఎస్ జగన్‌పై హత్యాయత్నం కేసులో ఎయిర్‌పోర్ట్‌లోని సీసీ కెమెరాల దృశ్యాలను సిట్ అధికారులు పరిశీలిస్తున్నారు. ఎయిర్‌పోర్ట్‌లోని 32 కెమెరాల ఫుటేజీని 4 హార్డ్ డిస్క్‌లలోకి సేకరించారు పోలీసులు. ఘటన జరిగిన ప్రాంతంలో మాత్రం సీసీ కెమెరాలు లేవు. నిందితుడు శ్రీనివాస్ కదలికలపై సీసీ కెమెరాల ఆధారంగా విచారణ చేపట్టారు. సీఐఎస్ఎఫ్, పోలీస్ సిబ్బందితో శ్రీనివాస్ చనువుగా మెలిగినట్టు గుర్తించారు. విచారణలో భాగంగా కర్నూల్‌కు బదిలీ అయిన ఫకీరప్పకు కొన్ని బాధ్యతలు అప్పగించారు. పోలీసులు నిందితుడి కాల్ డేటాను విచారిస్తున్నారు. 9 ఫోన్లు మార్చిన శ్రీనివాస్ 10వేల ఫోన్ కాల్స్, 397 ఫోన్ నెంబర్లతో మాట్లాడినట్టు గుర్తించారు. కొంతమందితో తరుచూ మాట్లాడినట్టు గుర్తించిన పోలీసులు అదే క్యాంటీన్లో పనిచేస్తున్న ముగ్గురిని పిలిచి విచారించారు.