Jankphud
-
జంక్ ఫుడ్‌తో మనసుకూ నష్టమే
కేకులు..పిజ్జా బర్గర్లతో రోజులు గడిపేస్తూంటే.. కొంచెం జాగ్రత్త. ఈ జంక్‌ఫుడ్ మీ ఒంటికే కాదు.. మనసుకూ చేటు చేస్తుందని హెచ్చరిస్తున్నారు మాంఛెస్టర్ మెట్రోపాలిటన్ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు. కొలెస్ట్రాల్, సంతప్త కొవ్వులు పిండిపదార్థాలు ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవడం వల్ల మనో వ్యాకులత (డిప్రెషన్) వచ్చే అవకాశాలు 40 శాతం వరకూ పెరుగుతాయని వీరు జరిపిన అధ్యయనం ఒకటి చెబుతోంది. పదహారేళ్ల నుంచి 72 ఏళ్ల మధ్యవయస్కులు దాదాపు లక్ష మందిపై జరిగిన పదకొండు అధ్యయనాల ఫలితాలను విశ్లేషించడం ద్వారా తాము ఈ అంచనాక వచ్చినట్లు ఈ పరిశోధనలో పాల్గొన్న శాస్త్రవేత్త స్టీఫెన్ బ్రాడ్‌బర్న్ తెలిపారు. అమెరికాతోపాటు యూరప్, ఆస్ట్రేలియా, మధ్యాప్రాచ్య దేశాల్లోని స్వచ్ఛంద కార్యకర్తలతో ఈ అధ్యయనం జరిగిందని మనోవ్యాకులత లేదా దాని లక్షణాలు ఉన్న వారి ఆహారపు అలవాట్లను సేకరించి.. అవి శరీరంలో మంట/వాపు కలిగించేందుకు ఉన్న అవకాశం ఆధారంగా ఒక సూచీ సిద్ధం చేశామని వివరించారు. సూచీలో ఎక్కువ స్థాయిలో ఉన్న వారు వారి వయసు, ప్రాంతాలతో సంబంధం లేకుండా జంక్‌ఫుడ్ తీసుకుంటున్నట్లు స్పష్టమైందని అన్నారు. డిప్రెషన్‌కు సరికొత్త ఆహారం ఆధారంగా చికిత్స పద్ధతులను అభివద్ధి చేసేందుకు ఈ పరిశోధన ఉపయోగపడుతుందని తెలిపారు. ఈ పరిశోధన వివరాలు క్లినికల్ న్యూట్రీషన్ తాజా సంచికలో ప్రచురితమయ్యాయి. -
జంక్‌ఫుడ్ అదే పనిగా తింటే రొమ్ముక్యాన్సర్ ముప్పు ఎక్కువ!
పరిపరిశోధన టీనేజీలో పిల్లల్లో అదేపనిగా బర్గర్లు, జంక్‌ఫుడ్ తినే అలవాటు మరీ ఎక్కువైతే, అది భవిష్యత్తులో రొమ్ముక్యాన్సర్‌కు దారితీయవచ్చని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. కౌమార వయసులోని పిల్లలు తీసుకునే జంక్ఫుడ్స్, కేక్స్, బిస్కెట్ల వంటి పదార్థాల్లోని కొవ్వులు, నూనెల వల్ల వారు పెద్దయ్యాక అనర్థాలు కనిపించే అవకాశం ఉందని యూనివర్సిటీ ఆఫ్ మేరీల్యాండ్‌కు చెందిన నిపుణుల అధ్యయనంలో తేలింది. ఆ యూనివర్సిటీలోని స్కూల్ ఆఫ్ మెడిసిన్ విభాగం వారు 1998లో దాదాపు పదేళ్ల వయసుకు అటూ ఇటూగా ఉన్న కొంతమంది పిల్లల డేటాను సేకరించారు. అప్పటి నుంచి వారి ఆరోగ్య వివరాలను తరచూ నమోదు చేస్తూ ఉన్నారు. ‘డయటరీ ఇంటర్వెన్షన్ స్టడీ ఇన్ చిల్డ్రెన్’ (డిస్క్) పేరిట తమకు అందుబాటులో ఉన్న సమాచారాన్ని విశ్లేషించారు. ఆ డేటా ఆధారంగా... టీనేజీ సమయంలో స్వాభావికమైన కొవ్వు పదార్థాలు, వెజిటబుల్ నూనెలు లాంటి అన్ని రకాల కొవ్వులు తీసుకునేవారిలో పెద్దయ్యాక రొమ్ముక్యాన్సర్ వచ్చే రిస్క్ పెరుగుతుందని తెలిసింది. అంతేకాదు, పిల్లల కౌమార వయసులో ఉండే అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లకు, పెద్దయ్యాక ఆల్కహాల్ కూడా తోడైతే ఆ ముప్పు మరింత ఎక్కువ అని తేలింది. ఆ అధ్యయన వివరాలన్నీ అమెరికా అసోసియేషన్ ఫర్ క్యాన్సర్ రీసెర్చ్ జర్నల్ అయిన ‘క్యాన్సర్ ఎపిడెమియాలజీ, బయోమార్కర్స్ అండ్ ప్రివెన్షన్’లో ప్రచురితమయ్యాయి.