జంక్‌ఫుడ్ అదే పనిగా తింటే రొమ్ముక్యాన్సర్ ముప్పు ఎక్కువ! | Jankphud constantly greater than the risk of breast! | Sakshi
Sakshi News home page

జంక్‌ఫుడ్ అదే పనిగా తింటే రొమ్ముక్యాన్సర్ ముప్పు ఎక్కువ!

Published Mon, May 23 2016 10:52 PM | Last Updated on Sun, Apr 7 2019 4:36 PM

జంక్‌ఫుడ్ అదే పనిగా తింటే రొమ్ముక్యాన్సర్ ముప్పు ఎక్కువ! - Sakshi

జంక్‌ఫుడ్ అదే పనిగా తింటే రొమ్ముక్యాన్సర్ ముప్పు ఎక్కువ!

పరిపరిశోధన
 

టీనేజీలో పిల్లల్లో అదేపనిగా బర్గర్లు, జంక్‌ఫుడ్ తినే అలవాటు మరీ ఎక్కువైతే, అది భవిష్యత్తులో రొమ్ముక్యాన్సర్‌కు దారితీయవచ్చని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. కౌమార వయసులోని పిల్లలు తీసుకునే జంక్‌ఫుడ్స్, కేక్స్, బిస్కెట్ల వంటి పదార్థాల్లోని కొవ్వులు, నూనెల వల్ల వారు పెద్దయ్యాక అనర్థాలు కనిపించే అవకాశం ఉందని యూనివర్సిటీ ఆఫ్ మేరీల్యాండ్‌కు చెందిన నిపుణుల అధ్యయనంలో తేలింది. ఆ యూనివర్సిటీలోని స్కూల్ ఆఫ్ మెడిసిన్ విభాగం వారు 1998లో దాదాపు పదేళ్ల వయసుకు అటూ ఇటూగా ఉన్న కొంతమంది పిల్లల డేటాను సేకరించారు. అప్పటి నుంచి వారి ఆరోగ్య వివరాలను తరచూ నమోదు చేస్తూ ఉన్నారు. ‘డయటరీ ఇంటర్వెన్షన్ స్టడీ ఇన్ చిల్డ్రెన్’ (డిస్క్) పేరిట తమకు అందుబాటులో ఉన్న సమాచారాన్ని విశ్లేషించారు.


ఆ డేటా ఆధారంగా... టీనేజీ సమయంలో స్వాభావికమైన కొవ్వు పదార్థాలు, వెజిటబుల్ నూనెలు లాంటి అన్ని రకాల కొవ్వులు తీసుకునేవారిలో పెద్దయ్యాక రొమ్ముక్యాన్సర్ వచ్చే రిస్క్ పెరుగుతుందని తెలిసింది. అంతేకాదు, పిల్లల కౌమార వయసులో ఉండే అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లకు, పెద్దయ్యాక ఆల్కహాల్ కూడా తోడైతే ఆ ముప్పు మరింత ఎక్కువ అని తేలింది. ఆ అధ్యయన వివరాలన్నీ అమెరికా అసోసియేషన్ ఫర్ క్యాన్సర్ రీసెర్చ్ జర్నల్ అయిన ‘క్యాన్సర్ ఎపిడెమియాలజీ, బయోమార్కర్స్ అండ్ ప్రివెన్షన్’లో ప్రచురితమయ్యాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement