బడ్జెట్‌కూ కులం రంగా?: లోక్‌సత్తా
సాక్షి, హైదరాబాద్: అందరి అభివృద్ధిని సమానంగా చూడాల్సిన ప్రభుత్వం బడ్జెట్‌ను కూడా కుల బడ్జెట్‌గా మార్చడం శోచనీయమని లోక్‌సత్తా పార్టీ తెలంగాణ శాఖ ధ్వజ మెత్తింది. తెలంగాణ వస్తే బతుకులు బాగుపడతాయని భావిస్తే బార్లు, వైన్‌షాపులకు లైసెన్స్‌లు ఇస్తూ, భిన్నత్వంలో ఏకత్వంగా ఉన్న ప్రజలను కుల భవనాల పేరిట విచ్ఛిన్నం చేస్తున్నారంది. బడ్జెట్లో విద్య,ఆరోగ్యరంగాలకు ఎక్కువ మొత్తంలో నిధులు కేటాయించకపోవడం బాధాకరమని ఆ పార్టీ ప్రధానకార్యదర్శి జన్నేపల్లి శ్రీనివాసరెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు.