17న ఓటర్ల తుది జాబితా ప్రచురణ
సాక్షి, హైదరాబాద్: భారత ఎన్నికల కమిషన్ ప్రత్యేకంగా చేపట్టిన ఓటర్ల సవరణ (ఫొటో ఎలక్టోరల్ రోల్స్)ల తో కూడిన తుది జాబితా ప్రచురణ తేదీని మార్చారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఈనెల 16వ తేదీన దీనిని ప్రచురించాల్సి ఉంది. ఈ తేదీని మారుస్తూ 17వ తేదీన తుది జాబితాను ప్రచురించనున్నట్లు ఇన్చార్జ్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ అనూప్‌సింగ్ ఒక ప్రకటలో తెలిపారు.