japan prime minister AbeShinzo
-
నోబెల్ శాంతి పురస్కారానికి ట్రంప్ నామినేట్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిష్ఠాత్మక నోబెల్ శాంతి పురస్కారానికి నామినేట్ అయ్యారు. జపాన్ ప్రధాని షింజో అబే ఆయన పేరును నోబెల్ కమిటీకి సిఫారసు చేసినట్లు ట్రంప్ శుక్రవారం వెల్లడించారు. ఉత్తర కొరియాతో శాంతి చర్చలు జరిపినందుకు షింజో అబే తనను ఈ పురస్కారానికి నామినేట్ చేసినట్టు ట్రంప్ తెలిపారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ షింజో అబే తనకు ఐదే పేజీల ఉత్తరాన్ని కూడా రాసినట్లు చెప్పారు. జపాన్ ప్రజల తరఫున తనను ఈ పురస్కారానికి నామినేట్ చేశారని, తనకు నోబెల్ శాంతి బహుమతిని ఇవ్వాల్సిందిగా నోబెల్ కమిటీని కోరుతున్నట్టు ఆ లేఖలో పేర్కొన్నారని ట్రంప్ తెలిపారు. ఈ విషయమై షింజో అబేకి ధన్యవాదాలు తెలిపినట్టు ట్రంప్ ప్రకటించారు. జపాన్ ప్రధాని సిపారసుపై అమెరికా అధ్యక్షుడు స్పందిస్తూ.. ‘‘గతంలో ఈ పురస్కారాన్ని బరాక్ ఒబామాకు ఇచ్చారు. ఆయనకు పురస్కారాన్ని ఎందుకు ఇచ్చారో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. ప్రపంచ శాంతి కోసం నేను ఎంతో కృషి చేశాను. వేలాది మంది ప్రాణాలను కాపాడాను. సిరియాలో 30 లక్షల మంది ప్రజల ఊచకోతను ఆపాను. దీని గురించి ఎవరూ మాట్లాడటంలేదు.’’ అని అభిప్రాయపడ్డారు. -
తొలి బుల్లెట్ రైలుకు ఒప్పందం
న్యూఢిల్లీ : భారత్-జపాన్ మధ్య శనివారం కీలక ఒప్పందాలు కుదిరాయి. భారత ప్రధాని నరేంద్ర మోదీ, జపాన్ ప్రధానమంత్రి షింజో అబే ఒప్పందాలపై సంతకాలు చేశారు. పౌర అణు ఒప్పందంతోపాటు భారత్‌లో తొలి బుల్లెట్ రైలు ట్రాక్ కోసం రూ.98వేల కోట్ల డీల్, స్మార్ట్‌సిటీలకు సహకారం, పలు మౌలికవసతుల ప్రాజక్టులపై ఇరువురు ప్రధానులు ఒప్పందాలు చేసుకున్నారు. రూ. 98 వేల కోట్లతో చేపట్టనున్న భారత బుల్లెట్ రైలు ప్రాజెక్టు కోసం జపాన్ ఒక ట్రిలియన్ యెన్లు (రూ. 54వేల కోట్లు) రుణంగా ఇవ్వనుంది. కాగా అహ్మదాబాద్-ముబైల మధ్య మొదటి బుల్లెట్ రైలు ప్రారంభం కానుంది. అలాగే రక్షణ రంగంలో టెక్నాలజీ బదిలీకి జపాన్ అంగీకారం తెలిపింది. మార్చి 1వ తేదీ నుంచి వ్యాపారం కోసం వచ్చే జపాన్ దేశస్తులకు వీసా ఆన్ అరైవల్ జారీ చేస్తామని మోదీ వెల్లడించారు.