తొలి బుల్లెట్ రైలుకు ఒప్పందం
న్యూఢిల్లీ : భారత్-జపాన్ మధ్య శనివారం కీలక ఒప్పందాలు కుదిరాయి. భారత ప్రధాని నరేంద్ర మోదీ, జపాన్ ప్రధానమంత్రి షింజో అబే ఒప్పందాలపై సంతకాలు చేశారు. పౌర అణు ఒప్పందంతోపాటు భారత్‌లో తొలి బుల్లెట్ రైలు ట్రాక్ కోసం రూ.98వేల కోట్ల డీల్, స్మార్ట్‌సిటీలకు సహకారం, పలు మౌలికవసతుల ప్రాజక్టులపై ఇరువురు ప్రధానులు ఒప్పందాలు చేసుకున్నారు.
రూ. 98 వేల కోట్లతో చేపట్టనున్న భారత బుల్లెట్ రైలు ప్రాజెక్టు కోసం జపాన్ ఒక ట్రిలియన్ యెన్‌లు (రూ. 54వేల కోట్లు) రుణంగా ఇవ్వనుంది. కాగా అహ్మదాబాద్-ముబైల మధ్య మొదటి బుల్లెట్ రైలు ప్రారంభం కానుంది. అలాగే రక్షణ రంగంలో టెక్నాలజీ బదిలీకి జపాన్ అంగీకారం తెలిపింది. మార్చి 1వ తేదీ నుంచి వ్యాపారం కోసం వచ్చే జపాన్ దేశస్తులకు వీసా ఆన్ అరైవల్ జారీ చేస్తామని మోదీ వెల్లడించారు.