jarkand
-
అప్పు తీర్చిన చీమ
జార్ఖండ్‌లో పాలము అనే జిల్లా ఉంది. పాలములో మెదినీనగర్ అనే బ్లాక్ ఉంది. మెదినీనగర్లో తన్వా అనే గ్రామం ఉంది. ఆ గ్రామంలో హస్రత్ బానో అనే చీమ ఉంది. ఆ చీమ ఇప్పుడైతే బాగుంది కానీ, ఏడేళ్ల క్రితం అస్సలేం బాగోలేదు. చీమ భర్త కూలి పనికి వెళ్లేవాడు. చీమ ఇంట్లోనే ఉండేది. చీమ భర్త ఏదో అవసరం మీద ఓ ఏనుగు దగ్గర అప్పు చేస్తే ఆ అప్పు వడ్డీమీద వడ్డీగా పెరుగుతూ 10000 రూపాయలు అయింది! ఊళ్లో వాళ్లకు అప్పులిచ్చి, వడ్డీల వసూల కోసం రోజంతా ఘీంకరిస్తూ తిరుగుతుండే ఏనుగులలో ఓ ఏనుగు దగ్గర ఈ భర్త చీమ అప్పు చేసింది. తీర్చలేకపోయింది. పదివేలు అయిందంటే అది ఇక ఎప్పటికీ తీరే అప్పుకాదని భార్య చీమకు అర్థం అయింది. అదొక్కటే కాదు, వడ్డీ వసూలుకు ఏనుగు వచ్చిన ప్రతిసారీ భర్త చీమ తను ఇంట్లో లేనని భార్య చీమతో చెప్పిస్తోంది. ‘ఆయన ఇంట్లో లేరు’ అని భార్య చీమ తలువు చాటు నుంచి చెబుతున్న ప్రతిసారీ భార్య చీమను ఏనుగు అదోలా, ఏదోలా చూస్తోంది. ఆడవాళ్లు మాత్రమే గ్రహించగలిగే అదోలా లు, ఏదోలా లు అవి. భర్త చీమకు ఆ సంగతి చెప్పలేదు భార్య చీమ. సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ వాళ్ల దగ్గర అప్పు తీసుకుని ఏనుగు అప్పు మొత్తం తీర్చేసింది. తీర్చాక, ‘ఆ అప్పులవాడు ఇక మన ఇంటికి రాడు’ అని భర్త చీమకు చెప్పింది. భర్త చీమ సంతోషించింది. ‘ఇక మీదట అప్పు చెయ్యను’ అని భార్య చీమ చేతిలో చెయ్యి వేసి మాట ఇచ్చింది. భర్త కళ్లల్లో ఆనందం చూసి భార్య చీమ కళ్లకు నీళ్లొచ్చాయి. తర్వాత భార్య చీమ అదే సెల్ఫ్ హెల్ప్ గ్రూపు దగ్గర 80000 అప్పు చేసింది. మొదటి అప్పు తీర్చడానికి రోజుకు ఐదు రూపాయలు చొప్పున ఆరేళ్లు పట్టింది రెండు చీమలు. అప్పు కట్టినట్లే లేదు, అప్పంతా తీరిపోయింది. ఆ ధైర్యంతోనే భార్య చీమ ఈసారి ఎనభై వేలు అప్పు తీసుకుంది. ఆ డబ్బుతో ఒక పిండి మిల్లు పెట్టింది. చెప్పుల దుకాణం పెట్టుకుంది. నెలకు ఇప్పుడు 20 వేలు సంపాదిస్తోంది! జార్ఖండ్ లోని మారుమూల గ్రామాల్లో సొంత చేతులపై కుటుంబాన్ని నిలబెట్టిన ఇలాంటి డేరింగ్ అండ్ డ్యాషింగ్ ఉమన్ చీమలు 30 లక్షల వరకు ఉన్నాయి! ఆ చీమలదండుకు బాస్ లెవరూ లేరు. ‘అజ్విక’ అనే గ్రూప్ పేరుతో వాళ్లలో వాళ్లే ఎవరు దాచుకున్న డబ్బుతో వాళ్లు ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటున్నారు. మెడలో తళతళ మెరిసే గోల్డ్ చైన్ వేసుకుని ధడ్ ధడ్ ధడ్ మని బులెట్ బండి మీద అప్పులు ఇవ్వడానికి వచ్చే ఏనుగులు ఇప్పుడు అక్కడ కనిపించడం లేదు. భర్త చీమలు ఇంటికి ఇచ్చిన దాంట్లోంచే కొంత తీసి కొండల్ని కూడబెట్టే భార్య చీమలకు ఇంటి బయటికి వచ్చి సంపాదించే సహకారాన్ని ఇంట్లోవాళ్లు మనస్ఫూర్తిగా అందిస్తే డబ్బుల కొండపై ఇల్లు కట్టుకున్నట్లేనని చెప్పే ఒకానొక చీమ కథ.. హస్రత్ బానో కథ ఇది. -
కొనసాగుతున్న జార్ఖండ్ ఓట్ల లెక్కింపు
-
జార్ఖండ్ ప్రచారంలో ‘మందిర్’
లక్నో : దేశంలోని ప్రతి కుటుంబం రామమందిర నిర్మాణానికి 11రూపాయలతో పాటు ఒక ఇటుకను ఇవ్వాలని యూపీ ముఖ్యమంత్రి యోగీ అధిత్యనాథ్ కోరారు. జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీ అభ్యర్థి నాగేంద్ర మహతోకు మద్దతుగా భాగోదర్ ర్యాలీలో సీఎం యోగీ ఆదిత్యనాథ్ ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోదీ చేసిన కృషి వల్లే 500 సంవత్సరాల వివాదం పరిష్కారమైందన్నారు. కాంగ్రెస్, ఆర్జేడీ, సీపీఐ-ఎంఎల్ లాంటి రాజకీయ పార్టీలకు వివాదం పరిష్కారమవ్వడం ఇష్టం లేదన్నారు. అయోధ్యలో రామ్‌మందిర్ నిర్మాణం త్వరలోనే సాకారమవుతుందన్నారు. జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు బీజేపీని గెలిపించాలని కోరారు. జైశ్రీరాం నినాదాలతో ఆయన ప్రజలను ఉత్తేజపరిచారు. తాను రాముడి స్వస్థలం నుంచి వచ్చానన్నారు. రాముడి పాలనంతా రామరాజ్యమేనని కొనియాడారు. సమాజంలోని పేద, యువత, మహిళలు సహా అన్ని వర్గాలను అభివృద్ధి పరచమే తమ అభిమతమని తెలిపారు. నరేంద్ర మోదీ పాలనలో అన్ని వర్గాలు సంతృప్తికరంగా ఉన్నాయని అన్నారు. ఏ వర్గానికి న్యాయం చేయకుండానే కాంగ్రెస్, జార్ఖండ్ ముక్తి మోర్చా(జేఎమ్ఎమ్) లాంటి రాజకీయ పార్టీలు అధికారం కోసం తాపత్రయపడుతున్నారని విమర్శించారు. ఉగ్రవాదాన్ని అణిచివేయడంలో కాంగ్రెస్, ఆర్జేడీ, జేఎమ్ఎమ్ పార్టీలు విఫలమయ్యావని మండిపడ్డారు. ఆర్టికల్ 370 వల్ల దేశంలో ఉగ్రవాదం పెరుగుతుందని భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ హెచ్చరించిన విషయాన్ని గుర్తు చేశారు. మోదీ కోరుకుంటున్న ఏక్ భారత్ శ్రేష్ట భారత్ ఆశయాన్ని బలపరచాలని యోగీ అధిత్యనాథ్ తెలిపారు. -
అతడి భార్యకు 5 లక్షల నష్ట పరిహారం
రాంచి : జార్ఖండ్ మూకదాడిలో మృతి చెందిన తబ్రేజ్ అన్సారీ కుంటుబానికి రూ. 5 లక్షల నష్ట పరిహారం అందజేస్తామని ఢిల్లీ వక్ఫ్ బోర్డు చైర్మన్, ఆప్ ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్ గురువారం ప్రకటించారు. మృతుడి భార్యకు ఈ మొత్తాన్ని ఇస్తామన్నారు. తబ్రేజ్ అన్సారీ భార్యకు ఢిల్లీ వక్ఫ్ బోర్డులో ఉద్యోగంతో పాటు న్యాయ సహాయం అందించనున్నట్టు తెలిపారు. గతవారం జార్ఖండ్‌లోని సెరైకేలా ఖర్సావన్ జిల్లాలో తబ్రేజ్ అన్సారీని దొంగగా భావించి కొంతమంది అతన్ని స్తంభానికి కట్టేసి కర్రలతో చితకబాదుతూ మూకదాడి చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. జై శ్రీరామ్’, ‘జై హనుమాన్’ నినాదాలు చేయాలంటూ తబ్రేజ్‌పై అల్లరి మూక దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ బుధవారం రాజ్యసభలో స్పందించారు. ఈ మూకదాడి తనను బాధించిందన్నారు. దాడి చేసిన నేరస్తులను కఠినంగా శిక్షిస్తామన్నారు. ప్రతిపక్షాలు ఈ ఘటనను ఆసరాగా తీసుకొని జార్ఖండ్ ‘మూకదాడులకు నిలయం’ అంటూ విమర్శించడం సరికాదన్నారు. జార్ఖండ్ రాష్ట్రాన్ని కించపరిచే హక్కు ఎవరికీ లేదని తెలిపారు. ఈ ఘటనలో 11 మందిని అరెస్టు చేసి దర్యాప్తు కోసం సిట్ ఏర్పాటు చేశారు. -
ఝార్ఖండ్‌లో ఘోర ప్రమాదం; 9 మంది మృతి
-
సెలవులో కలెక్టర్
సాక్షి ప్రతినిధి, కరీంనగర్ : కలెక్టర్ నీతూప్రసాద్ వారం రోజులు సెలవుపై వెళ్తున్నారు. తన సొంత రాష్ట్రమైన జార్ఖండ్ వెళ్లేందుకు ఈనెల 14 వరకు సెలవు పెట్టారు. అప్పటివరకు జాయింట్ కలెక్టర్ శ్రీదేవసేన ఇన్చార్జిగా వ్యవహరించనున్నారు. తిరిగి ఈనెల 15న నీతూప్రసాద్ మళ్లీ డ్యూటీలో చేరనున్నట్లు తెలిసింది.