jashwanth
-
ఆ నిచ్చెన మీ ఉసురు తీస్తుందనుకోలేదు కొడకా..!
తూర్పుగోదావరి: అభం శుభం తెలియని ఇద్దరు చిన్నారులు నీటి ట్యాంకులో పడి దుర్మరణం చెందిన విషాద ఘటన తూర్పు గోదావరి జిల్లా రాజానగరం మండలం చక్రద్వారబంధం గ్రామంలో గురువారం జరిగింది. ఈ సంఘటనలో గట్టిం వినిత (4), కమ్మిల జస్వంత్ (4) మృత్యువాత పడ్డారు. గ్రామానికి చెందిన గట్టిం శ్రీనివాస్, దేవి దంపతులు, కమ్మిల రాము, గణేశ్వరి దంపతులు పక్కపక్కనే ఉన్న ఇళ్లల్లో నివసిస్తున్నారు. శ్రీనివాస్ దంపతులకు వినిత పెద్ద కుమార్తె. ఆమె తరువాత ఒక కుమార్తె, కుమారుడు ఉన్నారు. రాము దంపతులకు జస్వంత్‌తో పాటు ఒక కుమార్తె కూడా ఉంది. వినిత, జస్వంత్ నర్సరీ చదువుతున్నారు. కాన్వెంట్కు వెళ్లి వచ్చిన తరువాత వీరిద్దరూ సాయంత్రం వినిత్ ఇంటి పైన ఉన్న వాటర్ ట్యాంకుకు ఉన్న నిచ్చెన ఎక్కి, ప్రమాదవశాత్తూ ఆ ట్యాంకులో పడిపోయారు. పిల్లలిద్దరూ చాలాసేపు కనిపించకపోవడంతో వారి తల్లిదండ్రులు వారి కోసం వెతికారు. చివరకు వాటర్ ట్యాంకులో చూడగా చిన్నారులిద్దరూ విగతజీవులై ట్యాంకులో తేలుతూ కనిపించారు. వెంటనే వారిని ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు చెప్పారు. కళ్ల ముందు ఆడుతూ పాడుతూ చలాకీగా తిరిగే పిల్లల జీవితం విషాదాంతం కావడంతో ఇద్దరు చిన్నారుల తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. చిన్నారి వినిత తండ్రి శ్రీనివాస్ వాటర్ ట్రాక్టర్లపై ట్యాంకర్లు విక్రయిస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే తన ఇంటి వాటర్ ట్యాంకుకు నిచ్చెన ఏర్పాటు చేసుకున్నాడు. ఆ నిచ్చెనే పిల్లల ఉసురు తీస్తుందనుకోలేదంటూ అతడి కుటుంబ సభ్యులు విలపిస్తున్నారు. మరో మృతుడు జస్వంత్ తండ్రి రాము వ్యవసాయ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. కొడుకు బాగా చదువుకుని వృద్ధిలోకి వస్తాడనుకున్నామని, ఇంతలోనే తమ బిడ్డ జీవితం అర్ధాంతరంగా ముగిసిపోయిందని వారు రోదిస్తున్నారు. ఇవి కూడా చదవండి: కొడుకును పొడిచి.. పురుగు మందు తాగి -
సీఎం జగన్‌ను అడిగిన 6 రోజుల్లోనే వైద్యానికి రూ.12లక్షలు
సాక్షి, అమలాపురం టౌన్: పట్టణంలోని నారాయణపేటకు చెందిన 9 ఏళ్ల దంగేటి జశ్వంత్ తలసేమియా వ్యాధితో బాధపడుతున్న పరిస్థితిపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తక్షణమే స్పందించి తొలి విడతగా రూ.12 లక్షలను గురువారం మంజూరు చేశారు. జశ్వంత్ శస్త్ర చికిత్సకు రూ.21 లక్షలు ఖర్చువుతుందని, అంత ఖర్చు భరించే స్తోమత ఆ కుటుంబానికి లేదని, మీరే ఆదుకోవాలని ఈ నెల 4న తూర్పుగోదావరి జిల్లా పర్యటనకు వచ్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి దృష్టికి సెంట్రల్ డెల్టా బోర్డు చైర్మన్ కుడుపూడి బాబు తీసుకుని వెళ్లిన సంగతి తెలిసిందే. చలించిన ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి తక్షణమే సంబంధిత అధికారులను చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కుడుపూడి బాబు సీఎం దృష్టికి ఈ విషయాన్ని తీసుకుని వెళ్లిన మర్నాడే తాడేపల్లి సీఎం కార్యాలయం నుంచి ఒక ప్రతినిధి అమలాపురంలోని రోగి జశ్వంత్ ఇంటికి వెళ్లి అతని వైద్య రికార్డులను పరిశీలించి వెళ్లారు. జశ్వంత్ తండ్రి కనకరాజును తాడేపల్లికి గురువారం వచ్చి సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి మంజూరు చేసిన రూ.12 లక్షల చెక్‌ను తీసుకుని వెళ్లాలని వర్తమానం వచ్చిది. కనకరాజు గురువారం తాడేపల్లి వెళ్లి ఆ చెక్‌ను తీసుకున్నారు. హైదరాబాద్‌లోని అమెరికన్ అంకాలజీ ఇనిస్టిట్యూట్ కేన్సర్ సెంటరు పేర చెక్ ఇచ్చారు. మిగిలిన రూ.9 లక్షలను జశ్వంత్‌కు శస్త్ర చికిత్స అయిన తర్వాత ఆ ఆస్పత్రి ఇచ్చిన పత్రాలకు అనుగుణంగా మంజూరు చేస్తామని అక్కడి అధికారులు తెలిపారు. సీఎంకు జశ్వంత్ కుటుంబీకులు, కుడుపూడి బాబు కృతజ్ఞతలు తెలిపారు. చదవండి: (అన్ని విధాల మైనార్టీలకు న్యాయం చేస్తున్నాం: సీఎం జగన్) -
క్రికెట్లో చెలరేగుతున్న బుడతడు
హైదరాబాద్ సిటీ: బ్యాట్ అంత ఎత్తు లేకున్నా క్రికెట్ ఆటలో సంచలనాలు సృష్టిస్తున్నాడు నగరానికి చెందిన బుడతడు. మాటలు రాకముందే బ్యాటింగ్ చేయడం మొదలు పెట్టాడు. ఏడేళ్ల చిన్నోడు క్రికెట్ చూసేవారికి ఔరా అనిపించక మానడు. కొంపల్లిలో అక్టోబర్ 24వ తేదిన నిర్వహించిన అండర్ 14 క్రికెట్ టోర్నమెంట్లో యాప్రాల్‌కు చెందిన ఏడేళ్ల విద్యార్థి జశ్వంత్ కు బెస్ట్ ప్లేయర్ సర్టిఫికెట్ సైతం అందుకున్నాడు. 2013లో భవన్స్‌లో నిర్వహించిన అండర్14 క్రికెట్ టోర్నమెంట్లో మ్యాన్ఆఫ్ది మ్యాచ్‌గా నిలిచి అందరిని ఆశ్చర్యపరిచాడు. బుడతడి వివరాల్లొకి వెళ్తే... యాప్రాల్‌కు చెందిన సాయికుమార్ యాదవ్, శ్రీచందనల దంపతులకు ఇద్దరు కుమారులు. వీరిలో మొదటి వాడైన జశ్వంత్‌కుమార్ ఏడాదిన్నరకే నర్సరిలో అడుగెట్టాడు. ఈ చిచ్చరపిడుగు తన రెండవ ఏటనే బ్యాట్ చేత పట్టాడు. జశ్వంత్ ఆసక్తిని గమనించిన తల్లిదండ్రులు అప్పటినుంచే భవన్స్‌లో కోచింగ్ ఇప్పిస్తున్నారు. అదే పాఠశాలలో ఈ చిన్నారి రెండవ తరగతి విద్యార్థి చదువుతున్నాడు. ప్రతిరోజు సాయంత్రం గంటన్నర పాటు క్రికెట్లో ఈ బుడతడు తర్ఫీదు పొందుతున్నాడు. ఉదయం వేళల్లో చదువుల బాట, సాయంత్రం వేళల్లో క్రికెట్ బాట పడుతూ ఆటలో చెలరేగిపోతున్నాడు. క్రికెట్లో తీసుకోవల్సిన జాగ్రత్తలు.. శిరస్త్రాణం (హెల్మెట్), మొకాళ్లకు ప్యాడ్లు, చేతికి గ్లౌవ్స్ పెట్టుకుని క్రికెట్ ఆడుతుంటాడు. వన్డేలు, టెస్ట్ మ్యాచ్‌లు, ట్వంటీ ట్వంటీ మ్యాచ్‌లు ఏకాగ్రతతో చూస్తూ ఆటలోని మెలకువలు నేర్చుకోవడం తన వంతుగా మార్చుకున్నాడు ఈ చిన్నారి. ఈ బుడతడు మున్ముందు క్రికెట్లో మరింతగా రాణించాలని ఆశిద్దాం.