Jaspal Singh
-
వారియర్స్.. వారసులు..
ఢిల్లీ జైత్పూర్లో ఒక వృద్ధురాలు కన్నుమూసింది. అంత్యక్రియలు చేయవలసిన కుమారుడు మానసిక వికలాంగుడు. ఇరుగుపొరుగుని పిలిచినా వచ్చే అవకాశం లేదు. బంధువులెవరూ ఢిల్లీలో లేరు. 66 సంవత్సరాల భర్త జస్పాల్ సింగ్కు ఏం చేయడానికీ దిక్కు తోచలేదు. పోలీసులకు ఫోన్ చేసి తన పరిస్థితి వివరించారు. మరుక్షణంలో పోలీసులు జస్పాల్ సింగ్ ఇంటికి చేరుకున్నారు. అంత్యక్రియలకు కావలసిన ఏర్పాట్లన్నీ చేశారు. భర్త జస్పాల్తో పాటు ముగ్గురు పోలీసులు ఆమెను భుజాల మీద శ్మశానానికి మోసుకెళ్లారు. ఆమెకు అంత్యక్రియలు పూర్తి చేశారు. జస్పాల్ సింగ్ స్వస్థలం అమృత్సర్. అందువల్ల అతనికి ఢిల్లీలో సన్నిహితులెవరూ లేరు. భార్య సుధా కాశ్యప్ (62) ఆరు నెలలుగా అనారోగ్యంగా బాధపడుతోంది. ముందు రోజు రాత్రి ఎప్పటిలాగే ఆహారం తీసుకుంది. హాయిగా నిద్రపోయింది. అదే గాఢ నిద్ర అని తెల్లవారే వరకు జస్పాల్సింగ్కు తెలియదు. నిద్ర లేవగానే ఆమె ఎప్పటిలాగే పిలవకపోవటంతో, జస్పాల్కు విషయం అర్థమైంది. నలభై సంవత్సరాలుగా కలిసి జీవించిన తన సహచరి, తన నుంచి దూరం కావటంతో జస్పాల్కు ప్రపంచమంతా చీకటిగా కనిపించింది. ఆమె అంత్యక్రియలకు ఏర్పాట్లు చేయలేకపోయాడు. అందుకే పోలీసులను బంధువులుగా ఆహ్వానించాడు. విషయం తెలుసుకున్న ఇన్స్పెక్టర్, కాన్స్టేబుల్స్ ఆయన ఇంటికి చేరుకుని, ఆ ఇంటి బిడ్డగా వారి ఆచారాలను అనుసరించి, కర్తవ్యం నెరవేర్చారు. పోలీసులంటే చట్టం, న్యాయం కాపాడేవారు మాత్రమే కాదు, అవసరమైతే ఒక ఇంటి వారసుడిగా అంత్యక్రియలు కూడా నిర్వహించగలమని చూపారు. -
ఫేస్బుక్ ప్రేమికుడి కోసం వచ్చి చనిపోయింది
పంజాబ్: ఆమె బ్రిటన్కు చెందిన ఓ ముగ్గురు బిడ్డల తల్లి. భారత్లోని ఓ పంజాబ్ యువకుడితో ఫేస్బుక్ ద్వారా ప్రేమలో పడింది. ఇటీవల ఇండియాకు వచ్చి చూసింది. ఇందులో విషాదమేంటంటే ఆమె ఇండియాకు వచ్చిన కొద్ది రోజుల్లోనే ప్రాణాలుకోల్పోయింది. వివరాల్లోకి వెళ్లితే ఎంజెలా స్లిన్ (45) అనే బ్రిటన్ మహిళ పంజాబ్లోని లుథియానాకు చెందిన జస్పాల్ సింగ్(30) అనే వ్యక్తికి ఫేస్ బుక్ ద్వారా పరిచయమైంది. వారి వ్యవహారం ప్రేమ వరకు దారి తీసింది. దీంతో ఇటీవలె ఆమె తన పిల్లలకు ఇండియా టూర్ వెళుతున్నానని చెప్పి, ఆ విషయం భర్త స్టీపెన్ (48)కు మాత్రం చెప్పకుండా మే 4న ఇండియాకు వచ్చింది. వచ్చి సింగ్ను కలిసిన వారం రోజుల్లో తీవ్ర న్యుమోనియాకు గురై ఆస్పత్రిలో చనిపోయింది. ఈ ఘటనపై ఎంజెలా అత్త డొరీన్ స్లిన్ స్పందిస్తూ ఎంతో ఆరోగ్యంగా ఉన్న ఎంజెలా ఎందుకు ప్రాణాలు కోల్పోయిందో తనకు అర్థం కాలేదని, తాను మరో వ్యక్తితో ప్రేమలో పడిందని తెలిసిందని, అతడిని కలుసుకునేందుకు ఇండియా వెళ్లి చివరకు విషాధంగా మిగిలిపోయిందని చెప్పింది. జస్పాల్ సింగ్ కూడా తీవ్ర బాధను వ్యక్తం చేశాడు. ఆమె లేదనే విషయాన్ని తాను నమ్మలేక పోతున్నానని అన్నాడు. సతీష్ చందర్ దావన్ ప్రభుత్వ కాలేజీలో చదివిన సింగ్ ఎంజెలా పొటోగ్రాప్లపై ఎన్నో కామెంట్లు పెట్టేవాడు. వాటిల్లో బ్యూటిఫుల్, మైలవ్ అనే పదాలే ఎక్కువగా ఉండేవి.