బీజేపీలో చేరే ప్రసక్తి లేదు: జస్వంత్ సింగ్
న్యూఢిల్లీ: బీజేపీలో చేరే ప్రసక్తి లేదని బహిష్కృత నేత జస్వంత్ సింగ్ అన్నారు. ఒకవేళ తనను చేర్చుకోవడానికి బీజేపీ ముందుకు వచ్చినా ఆపార్టీలో చేరనని ఆయన అన్నారు. ప్రస్తుతం తాను స్వతంత్రుడినని ఆయన అన్నారు. రాజకీయ పార్టీ ప్రారంభించే ఉద్దేశం లేదన్నారు.
అంశాల వారీగా ఎన్ డీఏకు మద్దతిస్తానని ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు. అవసరమైతే థర్డ్ ఫ్రంట్, యూపీఏల కూడా మద్దతిస్తానన్నారు.
దేశానికి మంచి జరిగే విధంగా ఎజెండా ఉంటే యూపీఏ, థర్డ్ ఫ్రంట్ మద్దతిచ్చేందుకు వెనుకాడనని అన్నారు. బీజేపీ నుంచి బహిష్కృతుడైన జస్వంత్ బర్మర్ నుంచి స్వతంత్ర అభ్యర్ధిగా పోటీ చేస్తున్నారు.