జట్టు ఇంజనీర్ ఆశయం
‘ఎమ్.ఎస్.జి’ మూవీ ఫేమ్ గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన తాజా చిత్రం ‘జట్టు ఇంజనీర్’. గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ జీ ఇన్సాన్, హనీప్రీత్ ఇన్సాన్ సంయుక్తంగా దర్శకత్వం వహించిన ఈ చిత్రం ట్రైలర్ను, ఒక పాటను హర్యానాలోని సిర్సాలో విడుదల చేశారు.
గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ మాట్లాడుతూ– ‘‘నా ఐదో చిత్రం ‘జట్టు ఇంజనీర్’ ఒక శక్తివంతమైన సందేశంతో వినోదాత్మకంగా ఉంటుంది. ఆశయసాధన కోసం జట్టు ఇంజనీర్ ఏం చేశాడు? అనేది ఆసక్తికరం. గ్రామాల్లోని అమాయక ప్రజల జీవన విధానాన్ని చూపించాం. కేవలం పదిహేను రోజుల్లో ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేశాం. భారతదేశంలోని అన్ని భాషల్లో మే 19న ఈ చిత్రం విడుదల చేస్తాం’’ అన్నారు.